Sri Sri Sri Lakshmi Ganapathi Temple

Sri Sri Sri Lakshmi Ganapathi Temple Jai Sri Sri Lakshmi Ganapati
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం

16/05/2026
P.s పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం లో వార్షిక పాంచ రాత్ర కళ్యాణం లో భాగంగా ఈ రోజు ...
28/03/2026

P.s పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం లో వార్షిక పాంచ రాత్ర కళ్యాణం లో భాగంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరిగింది. రేపు అనగా తేదీ 29 ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం,అనంతరంద్వజా రోహణ,నిత్య హోమం, సాయంత్రం 5 గంటలకు తిరువీధి ఉత్సవo, రాత్రి 8 గంటలకు వార్షిక కల్యాణం జరుగును.

రాముని జననం : విష్ణు యొక్క ఏడవ అవతారం అయిన శ్రీరాముడు చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రం, కర్కాట...
27/03/2026

రాముని జననం : విష్ణు యొక్క ఏడవ అవతారం అయిన శ్రీరాముడు చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళలో (అభిజిత్ ముహూర్తంలో) జన్మించాడు. ఈ పవిత్రమైన రోజును ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి పండుగగా జరుపుకుంటారు,
సీతా రామ కళ్యాణం : ఈ రోజున శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం జరుగుతుంది. ఈ సంప్రదాయాన్ని భద్రాచల రామదాసు గారు ప్రముఖంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు.

అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఫకీర్ సాహెబ్ పేట గ్రామo ,బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్...
09/03/2026

అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఫకీర్ సాహెబ్ పేట గ్రామo ,బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం:
"నారాయణసేవ" నూతన విధానం
శ్రీ శ్రీ శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులుతో ....

శ్లో:సర్వేషామేవ దానానా మన్నదానం పరం స్మృతమ్|
సద్య: ప్రీతి కరం హృద్యం బల బుద్ధి వివర్ధనమ్॥

భక్తుల కోరిక మేరకు,
ప్రతి భక్తుడుకి
గణపతి నవరాత్రులలో" "నారాయణ సేవ" (అన్నదాన)ఫలితం,మరియు స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుట కు ఈ "9 రోజులు శాశ్వత నారాయణ సేవ" వితరణ కు కొత్త విధానం కమిటీ వారు సంకల్పించిరి.

ప్రతి సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా నవరాత్రులలో వారి శక్త్యానుసారం "నారాయణ సేవ" చేసుకునే అవకాశం దేవ స్థానం వారు స్వామి కృపతో కలుగ జేయాలనీ సత్ సంకల్పించిరి.

ఇందు నిమిత్తము భక్తుల ద్వారా వచ్చిన విరాళాలను
మొత్తము డిపాజిట్ చేసి అందు నిమిత్తము వచ్చే వడ్డీ మాత్రమే "నారాయణ సేవ" చేయాలని కమిటీ వారి నిర్ణయం.

ఉదాహరణకు:
కనీస డిపాజిట్ కింద
Rs2000/ చేస్తే వచ్చే వడ్డీ సుమారు గా రూపాయలు 130/_ వస్తుంది.
ఒక మనిషికి ఒకరోజు " "నారాయణసేవ"కు సరిపోతుంది.
మరికొన్ని...
Rs.6000/డిపాజిట్ చేస్తే ముగ్గురు భక్తులు కి
Rs10,000/ ఇస్తే 5గురు భక్తులుకి,
Rs 20,000/ ఇస్తే 10మందికి "నారాయణ సేవ" చేయగలుగుతాము.

కాబట్టి

ఈ గణపతి నవరాత్రిలలో ప్రతి నిత్యం జరుగు విశేష కార్యక్రమాలలో బాగంగా

ప్రారంభం లో
గణపతి మాలధారణ కార్యక్రమం మొదలు కొని
నిత్య గణపతి హోమము,
నిత్య కళ్యాణ ఉత్సవములు ,
అమ్మవారి కుంకుమ పూజలు,
విద్యార్థులు కు సరస్వతి పూజలు
ఏకాదశి నాడు సహస్ర లింగార్చన వంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న వారు
మరియు
సప్త ఋషులు కార్యక్రమం లో పాల్గొన్న అదీ దంపతులు అందరికీ
గోపూజ లో పాల్గొన్న వారు కావచ్చు
చివరి ఘట్టమయి న పూర్ణాహుతి,తిరువీధి మహోత్సవము వరకు

ఇంకా జరుగు మరెన్నో విశేష కార్యక్రమాలలో
నిత్యం కొన్ని వందల మందికి ప్రతీ సంవత్సరం శాశ్వత దాతల సహకారం తో మాస్టార్ MRL rao గారి ఆశీస్సులతో నిరాటంకం గా 2009 వ సంవత్సరం నుండి
"నారాయణ సేవ" జరుగుతోంది.

ఈ"నారాయణసేవ" కార్యక్రమంలో

మీరు కూడా ప్రత్యక్షం గా గానీ పరోక్షం గా కానీ "నారాయణ సేవ" (అన్నదానం) చేయు మహద్భాగ్యం మీకు మరియు మీ సహచర బందు వర్గo నకు కలిగించాలి అనే కమిటీ వారి సద్భావన తో ఈ నూతన నారాయణ సేవ విధానం లో మిమ్ములను భాగస్వామ్య చేయ మా సత్ సంకల్పం.

కావున మరొక్కసారి మా కమిటీ వారి విన్నపం

ఈ బృహత్తర కార్యక్రమంలో
మీరు పాల్గొని మరియు మీ సహచర బందు మిత్రులకు తెలియజేసి వారిని కూడా
స్వామి కృప కు పాత్రులు చేయమని మా మనవి.

ఈ"నారాయణ సేవ" మరింత కట్టు దిట్టంగా,ఇంకా ఎంతో పారదర్శకo గా నిర్వహించాలన్న సత్సంకల్పం తో వచ్చిన ప్రతి విరాళం
శ్రీ లక్ష్మి గణపతి ట్రస్టు అకౌంట్" కి నేరుగా మీరు జమ చేయవచ్చు. లేదా నగదు రూపం లో దేవస్థానo నందు గానీ చెల్లించగలరు.

ఇందు నిమిత్తము
మీకు కమిటీ వారు సేవ పత్రం ( Certificate of Seva / Donation )
అందచేయుదురు.

నగదు జమ చేసిన
తర్వాత మీ యొక్క పూర్తి వివరాలు,సెల్ నెంబరుతో సహా కమిటీ వారికి తెలియ చేయమని అభ్యర్థన.

ప్రతి భక్తుడు"నారాయణ సేవ"లో భాగస్వామిగా ఉండి స్వామి అనుగ్రహం నకు పాత్రులు కాగలరని, మరియు దేవాలయం అభివృద్ధి కి మీరు, మీ తోటి వారిని కూడా భాగస్వాములుగా చేసి ఈ బృహత్తర కార్యక్రమం దిగ్విజయం చేయ మని కమిటీ వారి అభ్యర్థన.

ట్రస్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు.

SLG Foundation
SBI A/c Number
33022939665,
IFSC code
:SBIN0000255
చోడవరం

ఈ సువర్ణ అవకాశం వినియోగించుకోవలసిందిగా కమిటీ వారి పునః విజ్ఞప్తి 🙏🙏

మరిన్ని వివరములకు సంప్రదించవలసిన కమిటీ వారి వివరములు

దేవస్థాన ధర్మకర్తలు మరియు SLG ఫౌండేషన్ సభ్యులు

1. సరిపల్లి నర్సింగరావు
Ph 9491786634

2. పుట్రేవు శ్యామ్ ప్రసాద్
Ph 9989246003

3. దేవగుప్తాపుVK శ్రీనివాసరావు
Ph 9493677468

4. ధన్యంరాజు సీతా రామ్
Ph 9133815288
5. సరిపల్లి శ్రీనివాస్ రావు
Ph 9491786634
6. దేవగుప్తాపు సీతారామయ్య
Ph 9491786634

ఇట్లు:
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి గణపతి ఫౌండేషన్,

స్వస్తీ

మంగళం మహత్ !

శ్రీమన్నారాయణుడు మీకు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ…మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
30/12/2025

శ్రీమన్నారాయణుడు మీకు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ…
మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

ఈ రోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం జరిగింది[ ఉదయం 8 గంటల నుండి రేపు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు ఏకాహం శ్రీ ...
29/12/2025

ఈ రోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం జరిగింది
[ ఉదయం 8 గంటల నుండి రేపు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు ఏకాహం శ్రీ రామ నామజయ మంత్రo జరుగుతున్నది
రేపు ఉదయం 5 గంటల కు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం లభించును. భక్తులు అందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించ మని ప్రార్థన..

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿

ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబానికి
ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు,
ఉద్యోగ స్థిరత్వం మరియు ఆర్థిక అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను.

ఈ రోజు ఉపవాసం లేదా ప్రార్థన చేయగలిగితే,
మనసులో ప్రశాంతత వస్తుంది,
సంకల్పాలు నెరవేరే శక్తి పెరుగుతుంది.

శ్రీమన్నారాయణుడు మీకు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ…
మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

Address

P. S Peta
Chodavaram
531036

Alerts

Be the first to know and let us send you an email when Sri Sri Sri Lakshmi Ganapathi Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Sri Sri Lakshmi Ganapathi Temple:

Shortcuts

Share

Category