13/10/2022
ప॥ వనిలో వెన్నెల రాత్రులన్ విరహతాపంబొందు నన్గాంచి ల
క్ష్మణుఁడోదారుప, జానకీ గుణవిశేషంబెల్ల నగ్గించుచున్
దిన మొక్కేఁడుఁగబుచ్చి ఘోర విపదాబ్దిన్ దారకంబింక నే
మనుచున్, వేఁదురునట్లు క్రుమ్మరవె? రామా! ఆపదుద్ధారకా!
- కీ॥శే॥ శ్రీ బాపట్ల హనుమంతరావు గారు
భా॥ సీతా విరహవేదనాచిత్తుడవైన శ్రీరామా! ఆ వనములో వెన్నెల రాత్రులందు సీత నెడబాసి బాధను పొందు నిన్ను చూచి లక్ష్మణుడు ఓదార్చగా, జానకీదేవి సుగుణ సచ్చీల సంపదలను కొనియాడుచూ, దినమునొక యేడుగ గడుపుచు, "ఈ ఘోర ఆపత్సముద్రాన్ని దాటుటకు నాకింక మార్గమేమని పరిపరి విధముల ఆనాడు నీవు మూర్ఖునివలె దుఃఖించినావు కదా!
-శ్రీ బాపట్ల రాజశేఖరసాయి గారు
O’ Rama – Devastated with being parted from Sitadevi! In the forest, seeing your suffering at the absence of Sitadevi in the moonlit night, Lakshamana tried to console you. You were occupied in admiring the beautiful ornaments left behind by Janaki Mata and feeling every day is as long as a year. “There is no way forward for me to come out of this endless abyss” - So you grieved every second in the day as a mere simpleton.
- Bapatla Venkata Naga Sayee Hanuma & Bapatla Yasodhara