14/05/2026
ఓం నారాయణ ఆది నారాయణ
--------క్రింద ఉన్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తుల పేర్లు బొప్పరాజు వెంకటసుబ్బయ్య. వారి సతీమణి పాలమ్మ.
వీరు రజకులు. ప్రస్తుతం గొలగమూడి లో భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో గత ఆరు సంవత్సరాలుగా గుడ్డలుతురుతున్నారు. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో ఇలా చెప్పారు.
మా స్వగ్రామం కుల్లూరు .నాకు 15 సంవత్సరాల వయసు నుండి వెంకయ్య స్వామి వారు తెలుసు. వారి గుడ్డలు మేమే ఉతికే వాళ్ళం భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్య స్వామి వారు తరచూ రాజు పాలెం వచ్చేవారు. మేము శ్రీ స్వామివారి గుడ్డలుతికి
కుల్లూరు నుండి రాజుపాలెం కి వెళ్లి వెంకయ్య స్వామి వారికి ఇచ్చేవాళ్ళు. అలా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకెళ్లాను .వెంకయ్య స్వామి వారు శ్రీ జయరామరాజు గారి ఇంట్లో ఉన్నారు. నేను అక్కడ వెళ్లేసరికి ముత్యాలయ్య అను మంగలి వారు వెంకయ్య స్వామి వారికి క్షవరం చేస్తున్నారు. అక్షవరం అయిపోయేదాకా అక్కడే ఉన్న. క్షవరమైన తర్వాత అయ్యా జయరామయ్య ఆ చాకలి ఆయనకు మంగళాయనకు డబ్బిచ్చి పంపయ్య అన్నారు. స్వామి ఇంట్లో డబ్బు ఉంది కానీ నా భార్య ఎక్కడ పెట్టిందో నాకు తెలియదు నా భార్య రాగానే డబ్బులు తీసుకొని ఇస్తా అన్నారు. .ఆమె పొలంలోకి వెళ్ళినందున త్వరగా రాలేకపోయింది. నేను (అనగాచాకలివెంకటసుబ్య్య) చాలాసేపు చూసి తర్వాత ఎప్పుడైనా ఇప్పించుకుందాం అని నేను వెళ్లొచ్చాను ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు. అప్పుడు వెంకయ్య స్వామి వారు అన్నారు అయ్యా చాకలాయన ఏమో వెళ్ళిపోయాడు ఈయన మాత్రం ఇలాగే కూర్చున్నాడు ఆయనకి డబ్బిచ్చి పంపయ్య అన్నాడు. స్వామి నాకు తెలియదు అని చెప్పాను కదా నా భార్య రాగానే ఇస్తాను స్వామి అన్నారు. మంగలి తిరుపాలయ్య బాధ చూడలేక అయ్యా జయరామయ్య ఒక పని చెయ్ నువ్వు ఇక్కడినుంచి కళ్ళు మూసుకొని నేను పరుచుకున్న చాప దగ్గరికి వెళ్లి ఆ చాప తీసి ,బండతోయి అందులో చేయి పెట్టు, కావలసినంత డబ్బు వస్తుంది కండ్లు తెరవకుండా పిడికెడు నిండు డబ్బు తీసుకొని వచ్చి కళ్ళు తెరువన్నారు .వారు అలాగే చేశారు అద్భుతము ఆశ్చర్యం శ్రీ స్వామి వారు చెప్పినట్లే ఆ బండ క్రింద చాలా నాణ్యాలు ఉన్నాయి. అంతవరకు నేను వెంకయ్య స్వామి వారు ఒక భక్తుడు అనుకున్నాను కానీ ఒక గొప్ప మహనీయుడని అప్పుడే నాకు తెలిసింది అన్నారు జయరామరాజు. .ఇంత మహిమాన్వితుడని గుర్తించిన జయరామరాజు గారు "స్వామి ఇక నాకు సంసారము, భార్య, పిల్లలు వద్దు నీ వెంటనే వస్తానన్నారు. అయ్యా నువ్వు రాలేవయ్యా అని చెప్పారు. ఎందుకు రాలేను స్వామి! వస్తా అన్నారు. స్వామి వారు వెళుతుంటే ఈయన వెంబడించాడు. శ్రీ స్వామివారు సరాసరి పెన్నా నదిలోకి వెళ్ళాడు, జయరామరాజు గారు కూడా వెళ్లారు. ఇద్దరు కలిసి మునిగారు. అప్పుడు జయరామరాజు గారికి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు నోరు తెరిస్తే యశోదమ్మ గారికి 14 భువన బాండములు ఎలా చూపించారోజయరామరాజుకు అలాగే కనిపించాయి. ఒక్కసారిగా పైకి లేచాడు నీళ్లలో నుండి. అప్పుడు స్వామి కనిపించలేదు ఆ నది ప్రవాహంలో శ్రీ స్వామివారు కొట్టుకపోయాడేమో అనుకున్నాడు జయరామయ్య. అక్కడంతా వెతికి వెతికి స్వామి లేడు, నదిలో కొట్టుకుపోయినాడు, చనిపోయి ఉంటాడని నిరాశగా ఇంటికి వచ్చేసారు. మూడురోజుల తర్వాత జయరామరాజు ఒక శివాలయంలోకి వెళ్లారు. అక్కడ వెంకయ్య స్వామి వారు తంబుర మీటుతూ ఉన్నారు. జయరామరాజు గారు చాలా సంతోషించారు. వెంటనే స్వామి అని పాదాలపై పడి మీరు ఎక్కడికి వెళ్లారు మీకోసం వెతికాను అని అన్నాడు జయరామరాజు. అప్పుడు శ్రీ స్వామి వారు అన్నారు అయ్యా నేనెక్కడ పోతున్నయ్య నువ్వు నా వెంట రాలేవని చెప్పాను కదయ్యా! అన్నారు. అప్పటినుండి శ్రీ స్వామివారు మహిమాన్వితులని గుర్తించి జయరామరాజు గారు తన జీవితాన్ని స్వామి అంకితం చేశారు.
ఒకరోజు పెంచలరెడ్డినీ వెంకయ్య స్వామి వారు బండి కట్టమని, పెన్నా నది దాటించమని అడిగారు. వార లాగే బండి కట్టి పెన్నా నది దాటించారు. శ్రీ స్వామివారు అయ్యా నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తాను అన్నారు. స్వామి ఎటో వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత బండి కడితే పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వామి ఇప్పుడు వద్దు తర్వాత వెళ్దాం అన్నారు పెంచలరెడ్డి గారు.అప్పుడు స్వామి వారన్నారు అయ్యా నువ్వు బండి ఎక్కి పడుకో నేను తోలుతా బండిఅన్నారు. వెంటనే పెంచల రెడ్డి బండి ఎక్కి పడుకున్నారు. పడుకోగానే క్షణాల మీద నిద్ర వచ్చేసింది. తర్వాత కొద్ది నిమిషాలు కాగానే అయ్యో నది దాటాము లే అన్నారుస్వామి. అంతగా ప్రవహిస్తున్న నది ఎలా దాటించారు స్వామి అన్నారు. అప్పుడు స్వామివారు అన్నారు అయ్యా దాటింది అక్కడ చూడయ్యా ఎద్దు తోక కూడా తడవలేదు చూడయ్యా అన్నారు స్వామివారు.అది చూసిన పెంచల్ రెడ్డి ఆశ్చర్యపడిపోయారు.
మరొక రోజు వెంకయ్య స్వామి వారు అర్ధరాత్రి వేళ ఒంటరిగా పెన్నా నది వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఒంటెలకని పెంచల్ రెడ్డి గారు లేశారు చూస్తే స్వామి వెళ్తున్నారు. స్వామివారికి కనిపించకుండా వెనకనే వెళ్ళాడు పెంచల్ రెడ్డి . పెన్నా నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. వెంకయ్య స్వామి వారు ప్రవహిస్తున్న నదిపై నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాడు. పెంచల్ రెడ్డి గారు ఒక చెట్టు చాటున నిలుచుకొని చూస్తున్నారు. అది పండు వెన్నెల, అంతా బాగా కనిపిస్తోంది, వెంకయ్య స్వామి వారు నీళ్లల్లో కొంత దూరం పోయాక అక్కడ కొంతమంది ఉన్నారు. అందరూ నీటి మీద చాపలు పరుచుకొని కూర్చుని భజన చేశారు. చాలాసేపు చూశాడు పెంచల్ రెడ్డి. భజన్ అయిన తర్వాత వెంకయ్య స్వామి వారు వస్తూ వస్తూ చెట్టు వెనుకనున్న పెంచలరెడ్డిని చూసి ఏమయ్యా పెంచల్ రెడ్డి అన్నారు. స్వామి ఎక్కడ పోయినారు అడిగాడు. నా పని మీద నేను పోయాను లేయ్యా నీ పని నువ్వు చూసుకో అన్నాడు. పెంచల రెడ్డి గారు మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయారు.
ఆ రాజు పాలెం కు చెందిన రోసి రెడ్డి గారు టీచర్ గా పనిచేస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుని ఆ ఊరిలో దాసంగం పెట్టాలని *అనగా అన్నసంతర్పణ) చేయించాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. వారు రిటైర్ అవ్వగానే తిరుపతి కెళ్ళి గుండె కొట్టించుకొని వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి స్వామి ఈ విధంగా అన్నసంతర్పణ చేస్తున్నాను మీరు రావాలి అన్నారు. వెంటనే శ్రీ స్వామి వారు అయ్యా నాకు అన్నం పెట్టగలవా అన్నాడు. స్వామి ఇంతమందికి పెడుతున్న మీకు అంతన్నం పెట్టలేనా అన్నాడు. అట్లాగైతే వస్తానయ్యా అన్నాడు వెంకయ్య స్వామి వారువెళ్లారు. మొదట వారికి వడ్డించారు. వండిన వంట మొత్తం వారే ఆరగించారు. అందరు చూసి ఆశ్చర్యపడిపోయారు కానీ అందరూ సంతోషించారు. ఆ వెంకటేశ్వర స్వామి ఇలా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించా రన్నంత సంతోషంతో స్వామివారికి ప్రణవిల్లి తర్వాత చకచకా వంటలు చేసి అన్న సంతర్పణం చేయించారు.
రాజుపాలెంలో ముక్కు తిరుపాల అనే ఒక టీచర్ ఉండేవారు వారు ముందు కూలి పని చేసుకుని జీవించేవారు అప్పుడు వెంకయ్య స్వామి వారు వారి ఇంటికి వచ్చారు శ్రీ స్వామివారి తో పాటు ఇద్దరోచ్చారు. అమ్మ మా ముగ్గురికి అంత ముద్ద పెట్టమ్మా అన్నారు. వెంటనే ఆమె కుండలో ఉన్న మూడు ముద్దల్ని తలా ఒకటి వడ్డించింది. తర్వాత స్వామివారు పిలిచి అమ్మ మారు వడ్డించమ్మ అన్నారు. మూడుముద్దుల ఉన్నాయి అని ఆమె మదన పడింది వెంటనే శ్రీ స్వామివారు అమ్మ మూత తీసి గరిటతో అట్లా అను వస్తుంది అన్నారు. సరే వెళ్లి మూత తీస్తే తిరిగి మూడు ముద్దలు అలాగే ఉన్నాయి ఆమె సంబరం ఆశ్చర్యాలకు అంతులేకుండా పోయింది. శ్రీ స్వామివారి మహిమను కొనియాడింది.
అప్పటినుండి వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్థిక అభివృద్ధి జరిగి. టీచర్ ఉద్యోగం చేశారు. వీరికి 50 ఏళ్లు దాటాయి కానీ సంతానం లేదు వెంకయ్య స్వామి వారిని ప్రార్థించారు. అయ్యో ఉన్నారయ్యా దూరంగా ఉన్నారన్నారు ఇంకేంటి స్వామి వయసు అయిపోయింది అంటే అయ్యో నీకు కొడుకు పుడతాడయ్యా !నీకు పిల్లలు ఉన్నారయ్యా! అన్నారు. శ్రీ స్వామి వారు చెప్పినట్లే రెండు సంవత్సరాలకి మగ సంతానం కలిగింది. ప్రస్తుతం అబ్బాయి ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
అదేవిధంగా రాజుపాలెం నివాసి ఓబులశెట్టి గారు హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వెంకయ్య స్వామి వారు అక్కడికి వెళ్లి ఓబుల్ శెట్టి గారిని పరామర్శించి "అయ్యా నీకేం ఇబ్బంది లేదు 10 సంవత్సరాలు ఆయుష్ పెంచాను నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చీటీలు రాయించారు. "1.పది సంవత్సరాల ఆయుష్ పెంచాను 2. పది సంవత్సరాలు గౌరవం చీటీ 3. పది సంవత్సరాలు డబ్బు చీటీ 4. పది సంవత్సరాలు ఆరోగ్యం చీటీ అని రాయించి ఇచ్చారు." ఆ చీటీని ఓబుల్ శెట్టి గారు భద్రంగా దాచి ఉంచారు. ప్రతిరోజు ఉదయం ప్రమిదలో నూనె వత్తి వేసుకుని రామాలయానికి వెళ్లి దీపం వెలిగించి వచ్చేవారు. ఒకరోజు అదే విధంగా ఉదయమే నూనె వత్తి దీపం తీసుకుని గుడికి వెళుతుండగా ఇంటిలోనే హఠాత్తుగా ఎదలో నొప్పి పుట్టింది. అప్పుడు ఓబులశెట్టి కుమారుడైన పరంధామయ్య గారు కృష్ణయ్య అనే ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలిస్తే వారు ఎలాంటి ఇంజక్షన్ తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిస్థితి తెలుసుకొని ఇంజక్షన్ వేస్తానంటూ తీసుకురావడానికి వెళ్లొచ్చేసరికి ఓబుల శెట్టి గారు మరణించారు. ఓబుల్ శెట్టి గారు మరణించే ముందు బయట వర్షం వస్తుంది. అది చూస్తూ అరే వెంకయ్య స్వామి మహిమనుతుడు రా ఎట్లా వర్షం కురిపిస్తున్నాడు చూడరా! ఇట్లా బ్రహ్మాండంగా వర్షాలు కురిపిస్తున్నాడు రా అంటూ నాకు రాసి ఇచ్చిన పది సంవత్సరాలు గడువు పూర్తి అయింది రా ఆ చీటీ తీసుకురా అని పరంధామయ్యతో చెప్పారు. పరంధామయ్య వెళ్లి చూస్తే ఆరోజుకే పది సంవత్సరాలు పూర్తి అయినట్టు తెలిసింది. వెంటనే పరంధామయ్య మాట మార్చి నాయనా ఏమి లేదు ఇంకా గడువుంది అని చెప్పినా వినలేదు. ఈ సంఘటన జరిగేటప్పుడు నేను నా భార్య అనగా చాకలి వెంకటసుబ్బయ్య ఇద్దరం అక్కడే ఉన్నాం. వాళ్లకు బట్టలు ఉతుకుతాము. కాబట్టి రోజు అన్నం తీసుకోవడానికి వెళ్తాం. అప్పుడు మా కళ్ళముందే రామా రామా వెంకయ్య వెంకయ్య అంటూ ప్రాణాలు వదిలారు.!!!వెంకయ్య స్వామి వారు చెప్పిన మాట అక్షరాల నిజమని ఈ లీలనిరూపిస్తోంది.
నాకు అనగా చాకలి వెంకటసుబ్బయ్య మూడున్నర సంవత్సరములు క్రితం వెంకయ్య స్వామి వారు కలలోకి వచ్చి నాలుగేళ్లు చూపించారు దాని అర్థం నాకు తెలియలేదు .
శ్రీ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞ మేరకు 20 సంవత్సరాల క్రితం గొలగమూడి కొచ్చి స్థిర పడ్డాం. నా పెద్ద కుమారుడు వెంకటేష్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో వంటశాలలో ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. ఒకరోజు మా కుమారుడైన వెంకటేష్ ఇంట్లో మధ్యాహ్నం నిద్ర పోతున్నాను. వెంకయ్య స్వామి వారు వచ్చి నా వీపు పై గట్టిగా కొట్టారు. నాకు చురుక్కుని దెబ్బ తగిలింది. లేచి చూశాను నిజంగా స్వామివారు నా ఎదుట ఉన్నారు. నేను గతంలో సుబ్బయ్య అనే వ్యక్తి దగ్గర 20 అంకణాలు పొలం బేరమాడాను. అది గుర్తు చేస్తూ అయ్యా సుబ్బయ్య! కొలతలేస్తున్నాడు నువ్వు వెంటనే వెళ్ళు నీకు దక్కుతుంది ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తా అని మా ముంగిట్లో కూర్చున్నాడు. నేను అంతా అది కల గా భావిస్తూ నేను అక్కడికి పరిగెత్తి వెళ్ళాను. అప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటల సమయం అవుతుంది అక్కడ కెళ్ళి చూడగా సుబ్బయ్య గారు అందరికీ అమ్మేయాలని కొలత వేస్తున్నారు. అది చూసి ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు వెంటనే ఆయన్ను నాకమ్ముతావని మాట ఇచ్చి వేరే వాళ్లకు అమ్ముతావా అని గద్దించి అడిగాను. అప్పుడు వెంటనే ఆయన సరే నీకే అమ్ముతా అన్నాడు 1,65,000 రూపాయలకు భూమి కొన్నాను. ఇప్పుడు అందరము ఆ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధిలోనే ఉన్నాము. నిరంతరము మమ్ము వారు కాపాడాల్సిందే అన్నారు చాకలి బొప్పరాజు వెంకటసుబ్బయ్య గారు.
సదా వెంకయ్య స్వామి సేవ లో
మీ
ఉమామహేశ్వర సార్
☎️ నెంబర్ 9866251649
🙏🙏🙏