Kshetra Darsini

Kshetra Darsini క్షేత్ర దర్శిని - ఈ ఛానల్ లో భారతదేశంలో ఉన్న దేవాలయాలు అక్కడకి ఎలా వెళ్ళాలి వసతి భోజనం సమాచరం ఉంది

20/02/2024

బోర్డర్ లో మంచు వానలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్న మన దేశ సైనికులు 🇮🇳

11/02/2024

ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగానేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.

దానిని పైకి తీశాను.అందులో కొద్దిపాటి నోట్లు ఒక #కృష్ణుడిఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.
ఎలా తిరిగి ఇవ్వడం?
ఈ పర్స్ ఎవరిదండీ ?అంటూ అడిగా అక్కడునొల్లతో.... అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.

ఇంతలో పక్కబెర్తులో కూర్చుని #భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.
మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ?ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన.
"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ ?ఇంకా ఏదైనా చెప్పండి.మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా !"అడిగాను.
అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.
బాబూ..!
అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.
కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.

నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది.నా భార్య చాలా అందగత్తె.నాకు ఆమె అంటే చాలా ప్రేమ.అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.

ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.
వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని.వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని.వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని.వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.

నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.
కొడుకు నన్ను మరచిపోయాడు.నాకెవ్వరూ లేరు.ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి.అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను.ఆయనే నాకు ఇపుడు తోడు.

నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.
నా విచారానికి ఓదారుస్తాడు.
నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.

#భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి,ఆనందం కలుగుతున్నాయి.చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప,శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను.జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ #బ్రహ్మవిద్యపై శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో,కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ #దేవునివాచ పై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన.

ఆయన మాటల్లో ఆవేదన,ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.
నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.
పక్క స్టేషనులో రైలు ఆగింది,నేను దిగవలసినది అక్కడే.రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి.బయటకు రాగానే ఎదురుగా గోడపై
"భగవద్గీత చదవండి,శ్రీ కృష్ణుని నిజభావం తెలియండి" అని వ్రాసి ఉన్న బోర్డు చూసి,దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను.ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని,మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు.గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.
సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను.అతను దగ్గరకు వచ్చి "భగవద్గీత" నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది అన్న,క్షమించాలి అన్నాడు.ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి,ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి,ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి,ఆటోని పిలిచాను.ఆ పెద్దాయన చెప్పింది నిజమే., భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

#భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు... నిత్యం మనకు ఎన్ని పనులు వున్న భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీత కు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు.
ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!
నీ జీవుతామంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు

కృష్ణం వందే జగద్గురుం

01/12/2023

అయ్యప్ప భక్తులకు అలర్ట్... డిసెంబర్ 1 నుంచి 22 ప్రత్యేక రైళ్లు
భారతీయ రైల్వే అయ్యప్ప భక్తుల కోసం భారీగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 1 నుంచి 22 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. ఈ ప్రత్యేక రైళ్ల జాబితా , టైమింగ్స్ తెలుసుకోండి.

1. రైలు నెంబర్ 07137 విజయవాడ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 1, 8, 29, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శుక్రవారం రాత్రి 10.50 గంటలకు విజయవాడలో బయల్దేరి, శనివారం రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

2. రైలు నెంబర్ 07138 కొట్టాయం నుంచి విజయవాడ వరకు డిసెంబర్ 3, 10, 31, జనవరి 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు కొట్టాయంలో బయల్దేరి, సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

3. విజయవాడ-కొట్టాయం, కొట్టాయం-విజయవాడ రైళ్లు న్యూ గుంటూర్, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వాయ్, ఎర్నాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

4. రైలు నెంబర్ 07139 విజయవాడ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 15, 22 జనవరి 5 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శుక్రవారం మధ్యాహ్నం 4.25 గంటలకు విజయవాడలో బయల్దేరి, శనివారం రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

5. రైలు నెంబర్ 07140 కొట్టాయం నుంచి విజయవాడ వరకు డిసెంబర్ 17, 24 జనవరి 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు కొట్టాయంలో బయల్దేరి, సోమవారం ఉదయం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

6. విజయవాడ-కొట్టాయం, కొట్టాయం-విజయవాడ రైళ్లు గుంటూర్, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోయిలకుంట్ల, ప్రొద్దుటూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వాయ్, ఎర్నాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

7. రైలు నెంబర్ 07141 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 8, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి, శనివారం సాయంత్రం 7.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

8. రైలు నెంబర్ 07142 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 9, జనవరి 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం రాత్రి 11 గంటలకు కొల్లాంలో బయల్దేరి, సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

9. సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్ రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూర్, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

27/10/2023
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
06/09/2023

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

02/09/2023

ఇస్రో ఈరోజు తన మొదటి సూర్యునిపై పరిశోధన కోసం ఆదిత్య L1 సాటిలైట్ నీ విజయవంతంగా ప్రయోగించింది..

02/09/2023

మంచితనం మతం చూడదు.

Address

Chennai
600113

Alerts

Be the first to know and let us send you an email when Kshetra Darsini posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kshetra Darsini:

Share