Vaishnodevi AstroVastu Center

Vaishnodevi AstroVastu Center Astrology & Vastu

Sanjay Rai's experience with VAISHNAVIDEVIi ASTROVASTU in Pandu Tarfa (Bodhan Urban) was nothing short of exceptional! H...
25/05/2026

Sanjay Rai's experience with VAISHNAVIDEVIi ASTROVASTU in Pandu Tarfa (Bodhan Urban) was nothing short of exceptional! He raves about the accurate and reliable astrological services offered by our expert astrologer. Discover the power of ASTROVASTU and transform your life with our bespoke solutions. Try our services today!

Astrovastu integrates astrology with vastu principles to harmonize your living space. This balance can enhance well-bein...
23/05/2026

Astrovastu integrates astrology with vastu principles to harmonize your living space. This balance can enhance well-being and success in daily life. Consult VAISHNAVIDEVIi ASTROVASTU for personalized guidance.
Astrology

Unlock the secrets of the universe and transform your life with ASTROVASTU's expert astrological guidance, exclusively a...
22/05/2026

Unlock the secrets of the universe and transform your life with ASTROVASTU's expert astrological guidance, exclusively available at Pandu Tarfa, Bodhan Urban
Astrology

శ్రీ మాత్రే నమః,శ్రీ గణేశాయ నమః,శ్రీ గురుభ్ోన్నమః ఆషాఢమాసము|||ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినా...
11/06/2023

శ్రీ మాత్రే నమః,
శ్రీ గణేశాయ నమః,
శ్రీ గురుభ్ోన్నమః

ఆషాఢమాసము|||

ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల.

ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా
పరిగణిస్తారు.

ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా
వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే.

అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.

ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.

శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి.

ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.

హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోబడుతుంది.

ఆషాడ మాసం పండుగల జాబితా:-
పూరీ రథయాత్ర
కుసుమహార జయంతి
బోనాలు
చతుర్థి వ్రుతం
స్కంద షష్ఠి
పునర్వసు కార్తె
దుర్గా అష్టమి వ్రతం
గోపద్మ వ్రత ప్రారంభం
శయన ఏకాదశి
ప్రదోష వ్రతం
పౌర్ణమి వ్రతం
వ్యాస పూజ
గురు పూర్ణిమ
శ్రీ సత్యనారాయణ పూజ
అశున్య శయన వ్రతం
సంకష్టహర చతుర్థి
కర్కాటక సంక్రమణం
దక్షిణాయన పుణ్యకాలం
అష్టమి వ్రతం
పుష్యమి కార్తే
కామికా ఏకాదశి
మాస శివరాత్రి

శ్రీ వైష్ణోదేవి అస్ట్రో వాస్తు సెంటర్
N. ఉదయ్ కిరణ్ శర్మ
సెల్ & WhatsApp: 8019044004

09/06/2023

ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ మరియు పూజ విధానం.

ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి---------

పూజా విధానం-----

ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి - దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి - ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

ఓం మంగళాయ నమః
ఓం భూమి పుత్రాయ నమః
ఓం ఋణ హన్త్రే నమః
ఓం ధన ప్రదాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం మహా కాయాయ నమః
ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం సామగాన కృపాకరాయ నమః
ఓం ధరాత్మజాయ నమః
ఓం కుజాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిజాయా నమః
ఓం భూమి నందనాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం యమాయ నమః
ఓం సర్వరోగాపహారకాయ నమః
ఓం స్రష్ట్రే నమః
ఓం కర్త్రే నమః
ఓం హర్త్రే నమః
ఓం సర్వదెవ పూజితాయ నమః

అని పూజించ వలెను.

ఋణ విమోచక అంగారక స్తోత్రమ్:-

స్కంద ఉవాచ:
ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ I

బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ I

ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య I గౌతమ ఋషిః I అనుష్టుప్ చ్ఛందః I అంగారకో దేవతా I మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః I

ధ్యానమ్ :

రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I
స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్

మూలమంత్రః

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణ మాశు విమోచయ II

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II

అర్ఘ్యమ్ :

అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I
నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ II

భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II

ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్------

ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను------

*తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.
ఉదాహరణకు :

------------------

రు. 50,400 - 00

------------------

పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా

తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమం చేయవలెను.......స్వస్తి -------

శీఘ్ర మేవ ఋణ విమోచన ఫల ప్రాప్తిరస్తు🤚🤚..

N. ఉదయ్ కిరణ్ శర్మ.
జ్యోతిష్య వాస్తు పండితులు.
సెల్. 8019044004.

Address

Vinayaknagar
Bodhan
503185

Opening Hours

Monday 9am - 12:30pm
4pm - 7pm
Tuesday 9am - 12:30pm
4pm - 7pm
Wednesday 9am - 12:30pm
4pm - 7pm
Thursday 9am - 12:30pm
4pm - 7pm
Friday 9am - 12:30pm
4pm - 7pm

Telephone

+918019044004

Website

Alerts

Be the first to know and let us send you an email when Vaishnodevi AstroVastu Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vaishnodevi AstroVastu Center:

Share