Sri Vani Jyothishalayam

Sri Vani Jyothishalayam Horoscopes, Vastu, Building Plans n Subha Muhurtas. Trusted by intellectuals all over the world. Thanks to lord and ancient saints of this Sastras.

Established by Legend in Astrology and Vastu - Jyotisha Vidya Bhushana - Vastu Martanda - Sri Ayaluri Dakshinamurty Sastry in 1954. From then this centre is continuously serving the people in thier problems of all kinds. Mentoring them by Astrology and Vastu led to have peaceful and growth oriented life. Presently this Centre is looking after by Sri Sastryji's Son - Daivagnya Sri Ayaluri Ramkumar

Sarma. MBA, MA-Astrology, with lots of the trusted and satisfied customers. Suggesting simple and Self doing remedies are the main prospectus of our Jyotishalayam. We strongly believe that Astrology and Vastu have the full strength in solving all sorts of problems like education, career, marriage, children and health. We had so many experiences that our customers expressing satisfaction and happiness after our predictions took place in their life. People in Abroad used to contact us to know auspicious time (subha muhurta) for house shifting, Vehicle purchasing, Marriages, children's functions, joining in job, surgeries, etc. Muhurtas will be set according to their local time.

26/03/2026
Kalabhairava Ashtami (Jayanthi)ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"
11/12/2025

Kalabhairava Ashtami (Jayanthi)
ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"

తిరువణ్ణామలై తిరుకార్తికై మహా దీపోత్సవములు – 202503.12.2025 – తెల్లవారుఝామున 4.00 గంటలకు భరణి దీపం శ్రీ తిరువణ్ణామలై దేవ...
03/12/2025

తిరువణ్ణామలై తిరుకార్తికై మహా దీపోత్సవములు – 2025
03.12.2025 – తెల్లవారుఝామున 4.00 గంటలకు భరణి దీపం శ్రీ తిరువణ్ణామలై దేవస్థానములో శాస్త్రోక్తంగా పూజాది క్రతువులతో అలంకరించబడింది. అనంతరం శివుని అయిదు ముఖాలకు ప్రతీకగా అయిదు భరణి దీపాలను మహా మంగళ ధ్వనులతో ప్రజ్వలన చేసి భక్తులకు దర్శనార్థం వెలుపలికి తీసుకువచ్చారు.
తిరువన్నామలై దేవస్థానం వారి సౌజన్యంతో అరుణాచల శివా నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా దివ్యఘనానందంతో నిండి పోయింది.
భరణి దీప దర్శనం లభించిన ప్రతి భక్తునికి శివానుగ్రహం, అంతరంగ శాంతి, కర్మ విముక్తి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి....!!స్కంద పురాణంలో  ఒక చక్కని శ్లోకం ఉంది.అశ్వత్థమేకం పిచుమందమేకంన్...
30/11/2025

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి....!!
స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.

అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ
పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||

అశ్వత్థ = రావి
(100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

పిచుమందా = నిమ్మ
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

న్యగ్రోధ = మర్రి చెట్టు
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

తింత్రిణి = చింత
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)

కపిత్థ = వెలగ
(80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)

బిల్వ = మారేడు
(85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)

అమలకా = ఉసిరి
(74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)

ఆమ్రాహ్ = మామిడి
(70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)

వాపి - నుయ్యి

ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)

ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం.

రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.
ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి.
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని
మూఢ నమ్మకాలుగా భావించి, ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం.
యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది,
కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి.
ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది.
గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.

గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
మూలంలో బ్రహ్మ,
కాండములో విష్ణువు,
శాఖలలో శంకరుడు,
ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని చెప్పబడినది.

తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.

భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.

02/10/2024

Subha Sri:
*🌹. దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు…. 🌹*

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.

*🌻. నవదుర్గలు

ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

*🌻. నవదుర్గా ధ్యాన శ్లోకములు 🌻*

*🌷. శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*
నైవేద్యం : కట్టు పొంగలి

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

*🌷. బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*
నైవేద్యం : పులిహోర

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

*🌷. చంద్రఘంట ( అన్నపూర్ణ )*
నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

*🌷. కూష్మాండ ( కామాక్షి )*
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

*🌷. స్కందమాత ( లలిత )*
నైవేద్యం : పెరుగు అన్నం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

*🌷. కాత్యాయని(లక్ష్మి)*
నైవేద్యం : రవ్వ కేసరి

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

*🌷. కాళరాత్రి ( సరస్వతి )*
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

*🌷. మహాగౌరి( దుర్గ )*
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

*🌷. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )*
నైవేద్యం : పాయసాన్నం

శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

*🌷. దుర్గా ధ్యాన శ్లోకము :*

శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
🌹 🌹 🌹 🌹 🌹
🌺నవదుర్గా అవతారాలు, నైవేద్యం, మంత్రం🌺

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.

తిథులలో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి మంత్రం.

పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

బాల గాయత్రి :
" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్‌||"
అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

అన్నపూర్ణ గాయత్రి :
అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం
మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||

లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||
"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||" అని పఠించినా మంచిది.

చవితి - గాయత్రి దేవి - కట్టు పొంగలి అన్నం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.

పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||

శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||

షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||

దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌
దైవజ్ఞ శ్రీ రామ్ కుమార్ శర్మ,
శ్రీ వాణీ జ్యోతిషాలయం,
భీమవరం, 9704755446
సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||

సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్‌||

అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం, కేసరిబాత్‌
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్‌||

నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం, లడ్డూలు
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌
దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||

రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||
దైవజ్ఞ శ్రీ రామ్ కుమార్ శర్మ,
శ్రీ వాణీ జ్యోతిషాలయం,
భీమవరం, 9704755446
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

18/06/2024

*గరికె’ అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం?*

గరికెను.., సంస్కృతంలో ‘దూర్వాయుగ్మం’అంటారు. గరికె.., ‘దర్భల’ జాతికి చెందిన మొక్క. ‘దర్భలు’ శ్రీ మహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయి. పైగా అమృత స్పర్శకు నోచుకోబడ్డాయి. అందుకే అవి అతి పవిత్రాలు. ఆ జాతికి చెందిన ‘గరికె’ కూడా దర్భలవలె పవిత్రమైనవి. అంతేకాక, గడ్డిపూలు ఉన్నాయి గానీ…‘గరికె’ పూవులు పూయదు. ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ‘గరికె’కు లేదు. అవి స్వయంభువాలు. కనుక., సంపర్క దోషం లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడుగా జన్మించిన వినాయకునికి ‘గరికె’ అంత ఇష్టం. అందుకే ఆయన ‘దూర్వాయుగ్మ’ పూజను పరమ ప్రీతిగా స్వీకరిస్తాడు.

‘తెల్ల జిల్లేడు’కు ఎందుకంత పవిత్రత?

‘మారేడుచెట్టు’……….శివుని కి ప్రతిరూపం.
‘రావిచెట్టు’…………..శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం.

‘తులసిమొక్క’……….శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం.

‘వేపచెట్టు’……………మహాశక్తికి ప్రతిరూపం. అలాగే –

‘తెల్లజిల్లేడుమొక్క’…….సాక్షాత్తు వినాయకునికి ప్రతిరూపం. ఎందుకంటే –
వంద సంవత్సరాలు బ్రతికిన తెల్లజిల్లేడుమొక్క.., వినాయకుని ఆకృతిని సంతరించుకుంటుంది. అలాంటి మొక్కలో.., వినాయకుడు శాశ్వతంగా నివసిస్తాడు. అట్టి వినాయకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధస్తాయి. అందుకే తెల్లజిల్లేడుమొక్కకు అంత పవిత్రత..,విశిష్టత.

పాలవెల్లి’ ఎందుకు కట్టాలి?- ‘పాలవెల్లి’…‘పాలపుంత’…అంతరిక్షంలోని గ్రహ, నక్షత్ర సముదాయానికి పర్యాయ పదాలు. దానికి ప్రతిరూపమే ఈ ‘పాలవెల్లి’. అంతరిక్షంలో వ్రేలాడే గ్రహ, నక్షత్రాలే.., మనం పాలవెల్లికి కట్టే రకరకాల ఫలాలు, పుష్పాలు. సమస్త సృష్టికీ ఈ ఆదిదేవుడే అధినాయకుడు అని చెప్పడానికే మనం ‘పాలవెల్లి’ని కడతాం.

ఈ కారణంగానే పెద్దలు సెలవిస్తారు. యతులు *చెట్టుకు పూసినా పూలు ముట్టరాదు.* కారణం ప్రకృతి సంపర్కంతోనే పూవు పుడుతుంది. అందుకే మనో పుష్పాన్ని నిరంతరం ..భగవంతునికి సమర్పించాలి.

18/06/2024

🌹. కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు.. 🌹

శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి, వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56 ఈ ప్రకారం 7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.. మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటి ది మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

ఈ శక్తి కేంద్రాలు భావితరాలకు ఉపయోగ పడాలి అని మన పూర్వీకులు ఎక్కడ అయితే ఎక్కువగా శక్తి విశ్వం నుండి ఆకర్షించ బడుతుందో ఆ ప్రాంత్రాలలో వరుసగా విగ్నేశ్వరుడుని ప్రతిష్ట చేశారు.. *కాశీలో ఉన్న ఈ ప్రసిద్ధ విగ్నేశ్వర దేవాలయాలు అన్ని కాస్మిక్ ఎనర్జీ కి నిలయాలి.. ఆలయం అక్కడ ఉంటే ప్రభావం తెలియని వారు కూడా అక్కడికి వస్తారు కాసేపు ఉంటారు అందువల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి, జ్ఞాపకాశక్తి పెరుగుతుంది... ఎంతో ప్రశాంతంత కలుగుతుంది.. అటువంటి వినాయక అలయాలన్ని కలిపి "షట్టంచశద్వినాయకుల" అంటారు..ఈ 56 మంది వినాయకులను దర్శించటమే చప్పన్ యాత్ర అంటారు కానీ ఆ విగ్నేశ్వరుడు ఉన్న ప్రాంతాలు అన్ని శక్తి కేంద్రాలు కు ప్రసిద్ధ నిలయం అని చాలా తక్కువ మందికే తెలుసు.

వాటి వివరాలు చూద్దాము..

👉. ఇందులో ఏడు ఆవరణలుంటాయి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు .ఏడు ఆవరణల్లో కలిపి యాభై ఆరు మంది అవుతారు.🙏

*♦️. మొదటి ఆవరణ లో♦️*

లోలార్క కుండం లోనీ అర్క వినాయకుడు ,
దుర్గా కుండం లో దుర్గా వినాయకుడు ,
భీమ చండి లో భీమ చండీ వినాయకుడు ,
ప్రసిద్ధమ్ లో ఉన్న దేహలీ వినాయకుడు ,
భుయిలీ లో ఉద్దండ వినాయకుడు ,
సదర్ బజార లో పాశ పాణి వినాయకుడు ,
వరుణా సంగమం దగ్గరున్న ఖర్వ వినాయకుడు ,
మణి కర్ణికా ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రధమ ఆవరణం పూర్తీ అయినట్లు.

*♦️. రెండవ ఆవరణలో ♦️*

కేదార్ ఘాట్ వద్ద లంబోదర వినాయకుడు ,
కుమి కుండ మహల్ దగ్గర కూట దంత వినాయకుడు ,
మాడు అమేహ్ వద్ద కాల కూటవినాయకుడు ,
ఫుల్ వరియా లో కూష్మాండ వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లో ముండ వినాయకుడు ,
ధూప చండీ దేవి వెనుక వికట దంత వినాయకుడు ,
పులుహీ కోటలో రాజ పుత్ర వినాయకుడు ,
త్రిలోచనా ఘాట్ లో ప్రణవ వినయ దర్శనం తో ద్వితీయ ఆవరణం పూర్తీ .

*♦️. మూడవ ఆవరణం ♦️*

చోసట్టీ ఘాట్ లో వక్ర తుండ లేక సరస్వతీ వినాయకుడు,
బంగాలీ బోలా వద్ద ఏక దంత వినాయకుడు ,
సిగిరావార్ లో త్రిముఖ వినాయకుడు (వానర ,సింహ ,ఏనుగు ముఖాల తో )పిశాచ మోచన తాలాబ్ పై పంచాస్య వినాయకుడు ,
హేరంబ వినాయకుడు ,
చిత్ర కూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ,
ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ,
ఆది దేవ మందిరం లో మోదక ప్రియ వినాయకుడు ల దర్శనం తో తృతీయ ఆవరణం సంపూర్ణం.

*♦️. నాలుగవ ఆవరణం ♦️*

శూల కన్తేశ్వర స్వామి ఆలయం లోనీ అభయద వినాయకుడు ,
బాల ముకుంద చౌహట్టా లో సింహ తుండ వినాయకుడు ,
లక్ష్మీ కుండం పై కూణితాక్ష వినాయకుడు ,
పితృ కుండం పై క్షిప్ర ప్రసాదన వినాయకుడు ,
ఇసర్ గంగీ పై చింతా మణి వినాయకుడు బడా గణేష్ ఆవరణ లోనీ దంత హస్త వినాయకుడు ,
ప్రహ్లాద ఘాట్ లో పిచండిలా వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లోనీ ఉద్దండ ముండ వినాయకుని దర్శిస్తే చతుర్ధ ఆవరణం పూర్తీ .

*♦️. అయిదవ ఆవరణం♦️*

మాన్ మందిర్ ఘాట్ లో స్తూల దంత వినాయకుడు ,సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు ,ధవేశ్వర్ మందిరం లో చతుర్దంత వినాయకుడు ,సూర్య కుండం దగ్గర ద్విదంత వినాయకుడు ,మహల్ కాశీ పురా లో జ్యేష్ట వినాయకుడు ,మిక్చర్ ఘట్టా లో గజ వినాయకుడు ,రాం ఘాట్ లో కాల వినాయకుడు ,ఘోసలా ఘాట్ లో నాగేశ వినాయకులను చూస్తె పంచమ ఆవరణం అయినట్లు.

*♦️. ఆరవ ఆవరణం♦️*

మణి కర్ణిక వద్ద మణి కర్ణ వినాయకుడు ,
మీర్ ఘాట్ లో ఆశా వినాయకుడు ,
కాళికా గల్లీ లో సృష్టి వినాయకుడు ,
డుండి రాజు వద్ద యక్ష వినాయకుడు ,
బాన్స్ ఫాఠక్ వద్ద గజకర్ణ వినాయకుడు ,
చాందినీ చౌక్ లో చిత్ర ఘంట వినాయకుడు ,
పంచ గనఘా ఘాట్ వద్ద "స్థూల ", "జంఘ "వినాయకుల దర్శనం తో షష్ఠ ఆ వరణం పూర్తీ.

♦️. ఏడవ ఆవరణం ♦️

జ్ఞాన వాపి వద్ద మోద వినాయకుడు ,
విశ్వనాధ కచాహరి లో ప్రమోద వినాయకుడు ,
సముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు
గజ నాద వినాయకుడు జ్ఞాన వాపీ దగ్గర,
జ్ఞాన వినాయకుడు విశ్వనాధ ద్వారం వద్ద,
ద్వార వినాయకుడు అవి ముక్తేశ్వరుడి వద్ద అవి ముక్త వినాయకులను దర్శిస్తే సప్తమ ఆవరణ తో పాటు చప్పన్ వినాయక దర్శనం పరి పూర్తీ అయినట్లే.

👉. సిద్దిలు ,సాధకులు, తాంత్రికులు ఈ కేంద్రాల్లో ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు యాత్ర కోసం వెళ్లే గృహస్థులు ఈ ప్రదేశాలను సందర్శించిన చలా మంచి యోగం లభిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹 🪷⚛️✡️🕉️🌹

Gayatri Jayanti 2024: Goddess Gayatri is known as the mother of Indian culture. Goddess Gayatri is also known as Vedmata...
17/06/2024

Gayatri Jayanti 2024: Goddess Gayatri is known as the mother of Indian culture. Goddess Gayatri is also known as Vedmata. It is believed that all the Vedas originated from the Goddess. Also known as the Goddess of Hindu Trimurti, Goddess Gayatri is worshipped as the mother of all gods and the embodiment of Goddess Saraswati, Goddess Parvati and Goddess Lakshmi. The birth anniversary of Goddess Gayatri is celebrated as Gayatri Jayanti every year. The manifestation of all phenomenal attributes of Brahman led to the birth of Goddess Gayatri. As we gear up to celebrate the auspicious day, here are a few things that we should know
Gayatri Jayanti is celebrated every year on the date of Ekadashi, of Shukla Paksha, of the month of Jyestha. This year, Gayatri Jayanti falls on June 17.
Gayatri Jayanti 2024 Shubh Muhurat:
According to Drik Panchang, The Ekadashi Tithi will begin at 4:43 AM on June 17 and will end at 6:24 AM on June 18.
Gayatri Jayanti 2024 History:
According to Gayatri Samhita, it is believed that Goddess Gayatri is the embodiment of Goddess Saraswati, Goddess Parvati and Goddess Lakshmi. Atharvaveda mentions that the seven benefits of life, people, animals, fame, wealth and Brahmavarchas are obtained from Goddess Gayatri. Every year, Gayatri Jayanti is worshipped to seek the blessings of the Goddess for a long, happy and healthy life.
Gayatri Jayanti 2024 History:
According to Gayatri Samhita, it is believed that Goddess Gayatri is the embodiment of Goddess Saraswati, Goddess Parvati and Goddess Lakshmi. Atharvaveda mentions that the seven benefits of life, people, animals, fame, wealth and Brahmavarchas are obtained from Goddess Gayatri. Every year, Gayatri Jayanti is worshipped to seek the blessings of the Goddess for a long, happy and healthy life.

Gayatri Jayanti 2024 Significance:
It is believed that Goddess Gayatri exists in every form of life on this earth. Hence, by worshipping Goddess Gayatri on the auspicious day of Gayatri Jayanti, one can seek wisdom, knowledge and a prosperous life. Worshipping Goddess Gayatri is equivalent to studying the Vedas. Goddess Gayatri is considered to be the basis of all powers. Devotees who worship the Goddess on this auspicious day are blessed with unity, prosperity and a long and happy life.

Address

Ayaluri Ramkumar Sarma D No: 1-309/3, Arunachala Shiva Heritage, Opp Aditya Junior College, Komarada RoadBHIMAVARAM Mobile: 97047 55446
Bhimavaram
534208

Telephone

9704755446

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vani Jyothishalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Vani Jyothishalayam:

Share