Spiritual India

Spiritual India Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Spiritual India, Hindu temple, Ram Janmabhoomi, Ayodhya.

🙏
07/01/2021

🙏

Jai Mata Di 🙏
31/07/2020

Jai Mata Di 🙏

శ్రావణమాసపు సంధ్యా కాలాల్లో  "తిరుచానూరు" వెండిపళ్ళాల్లోంచి ఎగిరే మంత్రగానాల పరిమళాలు పారిజాత వృక్షాల అడవుల్లోకి మనల్ని ...
31/07/2020

శ్రావణమాసపు సంధ్యా కాలాల్లో "తిరుచానూరు" వెండిపళ్ళాల్లోంచి ఎగిరే మంత్రగానాల పరిమళాలు పారిజాత వృక్షాల అడవుల్లోకి మనల్ని తీసుకెళ్తున్నాయి...జీవన భస్మరాశి అక్కడే పునర్జీవిస్తుంది.....
ఊరంతా ఈ శ్రావణంలో వందలు వందలుగా ముతైదువులు..భూమండలమంతా "పుణ్యం" విరగబూస్తోంది.పసుపు కుంకుమల పరవశంతో ప్రకృతి మెలికలు తిరుగుతుంది...ముంగిట్లోంచి మరో ముంగిట్లోకి పసుపుకొమ్ముల తాంబూలాలు చిగురిస్తూనే ఉన్నాయి.ఇది పురాతనం,ఇది సనాతనం. తొలి శ్రావణవేళ నుండి దివ్యదిగంతాలు కళకళాలాడుతూనే ఉన్నాయి....
ఋతువు మొగ్గ తొడిగే
ఈ పదహారు వన్నెల వేళా-నిండా విరిసిన తామరలోంచి "అలమేల్మంగమ్మ" కుంకుమ భోగాలతో వస్తుంది..
పూల పసుపుపరుపులు పరుద్దాం రండి..
నిఖిల తారగోళాలు, సూర్యాది గ్రహమండలాలు,సమస్త దేవతాశక్తులు నిజస్వరూపాలతో "అమ్మ"ను కొలుచుకునేందుకు నిలుచున్నాయి...
ప్రణవ మంత్రాలతో శరణాగతి కోరుదాము రండి....

09/07/2020

You can see her at Sri Rajagopalaswamy Temple, Mannargudi, Tamilnadu.

04/07/2020

❤🥰

దారిపొడుగున గుండెనెత్తురుల ఆర్తనాధాలు వింటూ  అన్యాయమైపోతున్న భారతజాతి దాస్యవిముక్తికై సర్వం త్యజించి రామచంద్రుడిలా వనవాస...
04/07/2020

దారిపొడుగున గుండెనెత్తురుల ఆర్తనాధాలు వింటూ అన్యాయమైపోతున్న భారతజాతి దాస్యవిముక్తికై సర్వం త్యజించి రామచంద్రుడిలా వనవాసం చేస్తూ తెల్లోళ్ళనే అసురుల గుండెల్లో నిదురించిన ఆంధ్రసింగం "అల్లూరిసీతరామరాజు"...
రత్నగర్భలో దొంగలు పడి అన్ని దోచుకుపోతుంటే రామచంద్రుడిలా కోదండం చేపట్టి రామశరబాణాలతో విరుచుకుపడిన విప్లవాగ్ని అల్లూరిసీతారామరాజు...
రామచంద్రుడు ప్రజాజ్ఞకి లోబడి తల్లిసీతమ్మను అడువులో వదిలేస్తే, దేశం కోసం,భారతమాత బానిససంకెళ్లు తెంచాడనికి తన "సీత"ను త్యజించి రామరాజు "సీతరామరాజు"అయ్యాడు...
వనంలో వనవాసం చేస్తూ వాడవాడలా,వీధివీధిలా స్వాతంత్ర్యభావాలు రేకెత్తిస్తూ గాలికిరెపరెపలాడుతున్నా ప్రజావిప్లవజ్యోతిని తన పిడికిట్లో మోస్తూ ప్రతి మన్నెం వీరుడి గుండెల్లో వెలిగించిన ప్రజాగ్ని దీపజ్యోతి అల్లూరిసీతారామరాజు...
"అక్కడకాదుర దమ్ముంటే ఇక్కడ కాల్చు" అని గుండెని చూపిన విప్లవ బడబాగ్ని అల్లూరిసీతరామరాజు...స్వాతంత్ర్య సమరంలో నిదురిస్తున్నా తెలుగోళ్ళని నిద్దురలేపి తెల్లోళ్ళ గుండెల్లో నిదురించిన మహోజ్జ్వల శక్తి అల్లూరి సీతారామరాజు......
22-8-1922 మొట్టమొదటి సారి దెబ్బకి దెబ్బ తీయాలని చింతపల్లిఠాణా దాడి చేసి మన ఆయుధాలని రాజసంగా తీసుకొచ్చాడు...
తెల్లోలకి చెప్పి మరి 23-8-1922 కృష్ణదేవిపేట ఠాణాపై దాడి
24-8-1922 రాజవొమ్మంగి ఠాణాపై దాడి...
తన ఆయధసంపత్తితో మన్నెం వీరులకు భరోసానిస్తూ 3-9-1922 ఓoగేరిఘాట్ వద్ద బ్రిటీషోడిపై విజయాన్ని సాధించాడు..మళ్ళీ 15-10-1923 రంపచోడవరం ఠాణాపై దాడి....వరస దాడులు, మరోపక్క రవిఅస్తమించని సామ్రాజ్యానికి ఓటమి..తట్టుకోలేకపోయారు..ఇంకేముంది తమకెంతో ప్రావీణ్యమున్న కపటనాటకనికి తెరతీసారు... మన్నెం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టడం,అమాయక స్త్రీలపై ఆత్యాచారాలు..అంతటా అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని నానాభాధలకి గురిచేయడం...
తట్టుకోలేకపోయారు రామరాజు..నా ఒక్కడికొరకి ప్రజలకిన్ని బాధలా..గుండెలవిసేలా రోధించాడు ఆయన....ఎలాంటి సహాయసహకారాలు లేవు..సైన్యం నానాటికి తగ్గుతూవస్తుంది..
కపటంతో,మోసంతో చర్చలకని పిలిచి ఆసురకంఠకుల చేతిలో అసువులు బాసిన అగ్ని వీరకిశోరం అల్లూరి సీతారామరాజు.....
ఆనాటి కాంగ్రెస్ పెద్దల సహాయసహకారాలు లేకుండా,ఒంటరిగా జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని దెబ్బకిదెబ్బ,రక్తానికిరక్తం,హింసకు సమాధానం హింసయే అంటూ ఉన్నన్నాళ్లు స్వాతంత్ర్య సమర జ్యోతిని తన భుజాలపై మోసిన వీరాధివీరుడు, మనందరికి ఆదర్శప్రాయడైన మన్నెంవీరుడి జయంతి నేడు... మనస్ఫూర్తిగా ఆయనని తలుచుకుందాము.....అసలు సిసలైన జాతీయవీరుడి అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం......
"జయహో అల్లూరిసీతరామరాజు"

నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు, పంచభూతాలూ కాదు. చిదానంద రూపుడైన శ...
17/06/2020

నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు.
నేను పంచేంద్రియాలు కాదు, పంచభూతాలూ కాదు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను

నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువులు నేను కాదు.
సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను

నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు.
నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.

నాకు పుణ్యపాపాలు లేవు, సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను

నాకు జననమరణాలు లేవు. జాతి భేధాలు లేవు.
నాకు తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, గురుశిష్యులు లేరు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను

నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు.
నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను.
అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు.
చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను...
చిదానంద రూపం శివోహం శివోహం.....
ఓం నమఃశివాయ

శ్రీకృష్ణుడు స్త్రీలోలుడని అందుకే ఎనిమిది మంది భార్యలు ఉన్నా కూడా 16000 మంది గోపికలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఇంకా ఏదేద...
15/06/2020

శ్రీకృష్ణుడు స్త్రీలోలుడని అందుకే ఎనిమిది మంది భార్యలు ఉన్నా కూడా 16000 మంది గోపికలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఇంకా ఏదేదో...దీన్నే "Character Assassination" అంటారు...శ్రీకృష్ణుడంటే గిట్టని వారు ఇలాంటి పనికిరాని ప్రచారాలు చేస్తా ఉంటారు..దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు...
నోరుంది కదాని ఏదేదో ఓం నమఃశివాయ...
ఈ 16000 మంది గోపికలు నరకాసురుని బంధీలు....ఆనాటి ఆచారాల ప్రకారం స్త్రీ ఎవ్వరిచేతనైనా బందింపబడిన,,ఒక్కసారి గడప దాటిన అలాంటి స్త్రీలని సంఘం బహిష్కరించేది.వారికి ఇంట్లో ప్రవేశము ఉండేది కదా.. అలాంటి కట్టుబాట్లు ఉన్న ఆ సమయంలో నరకాసురుణ్ణి కృష్ణపరమాత్మ వదించిన తరువాత ఆ గోపికలు పరమాత్మతో "కృష్ణా మేమిప్పుడు ఎక్కడికి వెళ్లగలము,నీవే ఏదైనా దారి చూపించమన్నప్పుడు ఆనాటి సమాజపు ఆచారాలను పక్కన పెట్టి వారందరికి తన రాజ్యంలో అంతఃపుర భవనాలు నిర్మించి ఇచ్చాడు...ఆ స్త్రీలందరిని ఆదుకొని ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించిన సంఘసంస్కర్త కృష్ణ పరమాత్మ.....నిండు సభలో మాతద్రౌపది దేవి అవమానము పాలు కాకుండా చూశాడు,అన్నగారి మాట కాదన్నట్టు కనిపించిన సుభద్రదేవి భద్రంగా ఉండాలని వీరాధివీరుడైన అర్జునుడికే కట్టబెట్టాడు....తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరుగుతుందని మాత రుక్మిణి దేవి రాయబారం పంపితే వారి అన్న రుక్మి ని ఓడించి రుక్మిణి దేవిని పెళ్లాడడు....రుక్మిణీదేవి పాతివ్రత్యాన్ని ప్రపంచానికి చాటడానికి నిలువెత్తు బంగారాన్ని పోతపోసిన చిన్న తులసిఆకుతో తులతుగాడు కదా... మాత కుంతిపుత్రులను రాజ్యములో, అరణ్యాలలో అజ్ఞాతవాసంలో కూడ కాపాడుతూనే ఉన్నాడు...ఆఖరికి ఒక స్త్రీశాపనికి తలోంచాడే కానీ నేనే గొప్ప అన్న ఆహాన్ని ప్రదర్శించలేదక్కడ... గోకులంలో ఉన్న ప్రతి స్త్రీకి పుత్రప్రేమని అందించాడు..ఇలా ఎన్నెన్నో ఉన్నాయి..శ్రీకృష్ణుడు ఎప్పుడు స్త్రీని అగౌరవపరచలేదు,ఆయనేమి స్త్రీలోలుడు కాదు.. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు ఈ మహాన్ లోకోత్తర పుంగవులు ఏమి ఆలోచిస్తారో మరి...ఓం నమఃశివాయ....వారి ఖర్మ....

14/06/2020
కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు.... మరేం పరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా, చస్తే మనకేంటి....అ...
13/06/2020

కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు.... మరేం పరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా, చస్తే మనకేంటి....అతనో కశ్మీర్ పండిట్, అందునా హిందువు,చనిపోతే దేశానికేమన్న నష్టమొచ్చిందా...అదే పండిట్ స్థానంలో అనకూడదు కానీ ఒక ముస్లిమ్ సోదరుడో లేదంటే ఒక కసాయి సారి.... సారీ...ఇసాయి సోదరుడో ఉండి ఉంటే ....అమ్మో..!!దేశం సర్వనాశనమైపోదు...ఈపాటికి మీడియా అని, నాస్తికులని, హేతువాదులని, సెక్యూలరిస్టులని ఎంత బాగా స్పందించేవారు....అర్ధనగ్నప్రదర్శనలని,హిందూ మతోన్మాదము పెరిగిపోయిందని,T.V. లలో గొప్ప గొప్ప మేధావులు కూర్చొని ఎంత బాగా మాట్లాడేవారు..ప్చ్...చనిపోయింది హిందువు అని తెలిసి ఎంత Dissappointment ఫీల్ అయ్యారో..ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు, మీరు స్పందించకండి Sir ... కాని ఎక్కడో అమెరికాలో ఒక నల్లజాతి వ్యక్తిని చంపితే మాత్రం మీరు చాలా బాగా స్పందించారు, అది తప్పేం కాదు ఎక్కడైనా మనిషి మనిషే...అతని గురించి అంత బాగా స్పందించిన మీరు మరి మనదేశములో అది కశ్మీర్ లో చనిపోతే,ఎందుకు Sir దానిగురించి మాట్లాడట్లలేదు...అంత చులకనైపోయారా Sir హిందువులు మీ కంటికి....స్వామిజీలని చంపితే మాట్లాడరు,కశ్మీర్ పండిట్ చనిపోతే మాట్లాడరు,ఇంకెందుకు Sir హిందూదేశములో మీరు..???????

అమ్మా...'నీ మొగుడేం సామాన్యుడు కాదు...సర్వసంగపరిత్యాగి,విరాగీ, బైరాగి ఇంకా ఏదేదో,అంతెందుకు తల్లి కాముడిని బూడిద చేసినవాడ...
12/06/2020

అమ్మా...'నీ మొగుడేం సామాన్యుడు కాదు...సర్వసంగపరిత్యాగి,విరాగీ, బైరాగి ఇంకా ఏదేదో,అంతెందుకు తల్లి కాముడిని బూడిద చేసినవాడంతటి వాడు కూడా నువ్వు కనిపించగానే కరిగిపోతాడట..ఎంత రాచకార్యం లో ఉన్నా సరే తమరు గుర్తుకు రాగానే అయ్యవారి పెదాల మీద చిరునవ్వు చివురిస్తుందట.. బహుశా మీతో గడిపిన ఏకాంత క్షణాలేవో గుర్తొస్తాయి కాబోలు....చాలా సార్లు విన్న ఒక విషయం 'ఏమీ లేనోడికే అందమైన అమ్మాయలు పడతారట'అది మీ నుండే మొదలైందనుకుంటా...లేకపోతే ఏంటి తల్లి..
"నువ్వా ఎండకన్నెరుగని పిల్లవి..అతగాడేమో ఎండల్లో ఎండిపోతు,వానల్లో తడిసిపోతు స్మశానాల్లో బతికేరకం...నీ తనువంతా సుగంధ లేపనాలు,అతడి శరీరమంతా బూడిద గీతలు,నీ చేతులకు వంకీలు-అతడి చేతులకి పాము పిల్లలు..ఎక్కడా పొంతనే లేదు.....'
అయినా అంత అవ్యాజమైన ప్రేమ..యుగాలు మారాయి తరాలు మారాయి..అయిన సరే ఎప్పటికి మీరు నిత్య వధువే...నా తండ్రి శివయ్య కొత్త పెళ్ళికొడుకే... ఆహా మీది కదమ్మా బంధమంటే...ఎన్నెళ్ళైనా అంతటి ఆకర్షణ ఎలా సాధ్యం తల్లి.. ఎన్నో సమస్యలేదురుకున్నారు...సృష్టి నిర్మాణం కోసం ఎన్నోసార్లు ఒకరిని ఒకరు త్యాగం చేసుకున్నారు..ఐనా అదే చెక్కుచెదరని బంధం...మీ ప్రేమ రహ్యామేంటో కాస్త మాకు చెప్పొచ్చుగా తల్లి.....
రోజురోజుకి వివాహ బంధాలు జఠిలమైపోతున్నాయి,చిన్న చిన్న విషయాలకే విడాకులు.....,బతికేది కొన్నాళ్ళు, ఉన్నన్నాళ్లు మీలా ఉండక ఆహాలతో,గర్వాతిశయాలతో ఒకరికొకరు దూరమవుతు ఏంటో తల్లి అంతా.... సమాజానికి పట్టుగొమ్మలాంటి వివాహ వ్యవస్థ నానాటికి కుంచించుకుపోతునే ఉంది తల్లి....

22000 మంది రాళ్ళెత్తిన కూలీల చేతులు తెగ నరికించిన 'షాజహాన్' మీ దృష్టిలో గొప్ప ప్రేమికుడైతే,హిందూ దేవాలయ శిథిలాలమీద నిర్మ...
11/06/2020

22000 మంది రాళ్ళెత్తిన కూలీల చేతులు తెగ నరికించిన 'షాజహాన్' మీ దృష్టిలో గొప్ప ప్రేమికుడైతే,హిందూ దేవాలయ శిథిలాలమీద నిర్మించిన 'తాజ్-మహల్' అనే సమాధి ప్రేమకు నిర్వచనమని మీరు భావిస్తే....మరి రాముడు మాటేంటి..??'రామసేతు' మాటేంటి..!!! ఐనా ప్రభు శ్రీరాముడితో వాడికి పొలికేంటి.. కానీ నిజం అనేది ఒకటుంది కాబట్టి.....
సువర్ణమణిమయరత్నఖచిత సర్వ పుష్పాలంకార శోభితమైన 'లంక'రాజ్యాన్ని ఆక్రమించడానికి కట్టించిన నిర్మాణము కాదది..
రాజ్యకాంక్షతో,మహత్వాకాంక్షతో రాజ్యవిస్తరణకై పన్నాగం పన్ని లంకను ఆక్రమించడానికి కట్టిన సౌధం కాదది...
సర్వ జగత్తులో నేనే
పరమ శ్రేష్ఠుడననిపించుకోవాడనికి,తన శౌర్య-పరాక్రమలు చూపించాడనికి వేసిన రాచమార్గం కాదది...
అది కేవలం ఒక గొప్ప ప్రేమకు నిర్వచనం..ఒక గొప్ప ప్రేమికుడి మనః సౌధం....
తను ప్రేమించిన దాని(సీతమ్మ తల్లి క్షమించు) కొఱకు ఎంతకైనా తెగించే అసలు-సిసలైన ప్రేమికుడి నిర్వచనమది....
సంద్రాలవతల తన కొరకు విలపిస్తు ఎదరుచూస్తున్న తన ప్రేయసి అగ్ని కన్నీరు తుడచాడనికి ఒక ప్రేమికుడు వేసిన చెక్కుచెదరని శిలాశాసనమది....
ప్రభు శ్రీరాముడు వానరులతో కలిసి నిర్మించిన అద్బుతమైన ప్రేమ నిర్వచనం "రామసేతు"...
కానీ దీన్ని ప్రేమకు గుర్తుగా ఎవ్వరు చూడరు...అసలు రామసేతు నిర్మాణం నిజంగా జరిగిందా.!! లేదా..??ఒక వేళ నిజమైతే దాని నిర్మాణం ఎప్పుడు జరిగింది...Show me the historical evidence and existence of Lord Ram..!!! అసలు రాముడున్నాడా లేదా..!! అని ప్రశ్నించే గొప్ప..గొప్ప కుహనా కంపురుషులకి దాని విలువ ఏమర్థమవుతిందిలే..!!!!
ఓహో... 'రామసేతు' హిందూ నిర్మాణం కదా... నిర్మించింది శ్రీరాముడు కదా.. తప్పులేదులే,చర్చలు జరుగుతూనే ఉంటాయి...బతకాలి కదా రాముని మీద పడి..ఇదేమి సుల్తాన్ల్ కట్టించిందా లేక ఇసాయి లు కట్టించిందా,దాని గురించి గొప్పలు చెప్పుకోవడానికి.... ఎదవ జీవితాలు......

Address

Ram Janmabhoomi
Ayodhya

Website

Alerts

Be the first to know and let us send you an email when Spiritual India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category