Relief Ministries

Relief Ministries Restore end lives into eternal future

06/08/2024
14/02/2024

*వాలెంటైన్ డే* - ఓ అద్భుతమైన రోజు.

*ఈ రోజు 14. 2. 2022 వాలెంటైన్స్ డే*

మరి ఆ పేరు ఈ దినానికి ఎలా వచ్చిందో తెలుసు కొందామా మరి?

*క్రీ. శ. 3 వ శతాబ్దములో రోమ్ పట్టణాన్ని క్లౌదియా అనే చక్రవర్తి పరిపాలించేవాడు.* ఆయనంటే చాలా మందికి ఇష్టముండేది కాదు. దానికి ఒక కారణం ఉంది.

క్లౌదియా తన రాజ్యం కొరకు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చెయ్యాలని ఆశించాడు. కానీ రాజ్యంలోని *మగవారికి ఆ సైన్యంలో చేరటం ఇష్టం వుండేదికాదు.* ఎందుకంటే
సైన్యంలో చేరితే తమ భార్యను, పిల్లలను విడిచి వెళ్ళాలి కాబట్టి. *ఇది క్లౌదియా చక్రవర్తికి తెలిసింది* దానికి ఆయన ఒక వ్యతిరేకమైన ఆలోచన చేసి ఏదోవిధంగా ప్రజలకు బుద్ధి చెప్పాలని అనుకొన్నాడు. గనుక *రాజ్యంలోని యువకులు ఎవరూ పెళ్ళి చేసుకోకూడదు. యువకులు అందరూ తప్పక సైన్యంలో చేరాలి.* అని ఒక శాసనం (Decree) చేసాడు.

ఈ శాసనం రాజ్యంలో ఎవరికీ నచ్చలేదు. *వాలెంటైన్* అనే ఒకాయనకు కూడా నచ్చలేదు. *వాలెంటైన్* మరెవరో కాదు ఆయన ఒక *పాష్టర్ గారు.*

*వాలెంటైన్* ఇటలీ లోని *టెర్ని* లో క్రీ.శ. 226 సంవత్సరంలో జన్మించాడు. ఆయన చేసే సేవలో ఇష్టమైనది *పెళ్ళిళ్ళు* చేయటం.

చక్రవర్తి అలాంటి ఘోరమైన శాసనం అమలుపర్చినప్పటికీ *వాలెంటైన్* యువకులకు పెళ్ళిళ్ళు చేయటం మానలేదు. అయితే చాలా రహస్యంగా పెళ్ళిళ్ళు చేసేవాడు. ఒకరోజు రాత్రి ఇలాగే రహస్యంగా ఒక పెళ్ళి చేస్తుంటే సైనికులు వచ్చి *వాలెంటైన్* ను బంధించారు. అయితే యువజంట మాత్రం తప్పించుకోగలిగారు. సైనికులు *వాలెంటైన్* ను మాత్రం బంధించి తీసుకుపోయి జైలులో వేసి మరణశిక్ష విధించారు.

మరణశిక్ష పడినా గాని *వాలెంటైన్* ఆ జైలులో ఎంతో సంతోషంగా గడిపేవాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంతోమంది యువజంటలు, యువతీయువకులు, ఆయా వృత్తులలోని వారు *వాలెంటైన్* ను చూడడానికి, పలకరించడానికి, జైలుకు వస్తూ వుండేవారు. వారు వస్తూ *వాలెంటైన్* కు పువ్వులు, పండ్లు, చాక్లెట్లు, కవితలు, బహుమానములు ఇచ్చి *వాలెంటైన్* ను ప్రశంసించేవారు.

ఒక రోజు *జైలు అధికారి కుమార్తె* ఆయిన *ఆస్టీరియస్* కూడా *వాలెంటైన్* ను పలకరించటానికి వచ్చింది. ఆమె అంధురాలు. అప్పుడు ఆమె తండ్రి .... ఆమెకొరకు ప్రార్థించమని కోరగా ఆమె కొరకు *వాలెంటైన్* ప్రార్థించాడు. *వాలెంటైన్* ఆమె కొరకు ప్రార్థించిన వెంటనే ఆమె చూపు పొందుకుంది.

అప్పుడు ఆస్టీరియన్ ఆమె తండ్రి క్రైస్తవులుగా మారారు. అప్పటినుండి తన తండ్రితో *ఆస్టీరియస్* తరచుగా *వాలెంటైన్* దగ్గరకు వస్తూ వుండేది వారిద్దరూ ఎన్నో గంటల సమయం ఆధ్యాత్మికంగా గడిపేవారు. ఆసమయంలో ఆమె *వాలెంటైన్ ను* ఆత్మీయంగా బలపరచుటకు, అతనిని ఆత్మీయ స్థితి వృద్దిచేయుటకు ఎంతో దోహదపడింది.

*వాలెంటైన్ ను శిక్షించే దినం రానే వచ్చింది.* ఆ రోజున చివరగా తన స్నేహితురాలికి చివరి లేఖను వ్రాసి, అందులో ఆమె వాలెంటైన్ పై చూపిన స్నేహ భావానికి, మంచితనానికి, కృతజ్ఞతలు తెలిపి చివర్లో.... *Love from your Valentine* అని సంతకం చేశాడు.

*వాలెంటైన్ ఉత్తరం వ్రాసిన రోజు, చనిపోయిన రోజు ఫిబ్రవరి, 14 క్రీ. శ. 269* అప్పటి నుండి ప్రతీ సంవత్సరము నూతన వధూవరులు, యువకులు, *వాలెంటైన్* ను జ్ఞాపకం చేసుకుంటూ మెసేజెస్ పంపుకోవటం దానిలో *Love from your Valentine* అని చివరి సంతకం చేయటం వాడుకలోనికి వచ్చింది.

ఇంత చరిత్ర గల *ఫిబ్రవరి 14వ* తేదీ వాలెంటైన్ పొందిన మరణాన్ని, వాలెంటైన్ చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం మరచిపోయి అనవసర స్వార్థపూరితమైన వ్యామోహాలకు *వాలెంటైన్* పేరును ఉపయోగించు కోవటం చూస్తుంటే చాలా విచారం కలుగుతుంది.

ప్రియమైన యువతీయువకులారా *వాలెంటైన్* పాస్టర్ గారు పెళ్ళిళ్ళు ప్రోత్సహించారు కానీ ఈ లోక ప్రేమను కాదు. పెళ్ళిళ్ళను ప్రోత్సహించే *వాలెంటైన్* పుట్టిన రోజును అలా ఇలా చేసి మొత్తానికి *ప్రేమికుల రోజు చేశారు.* ఇది నిజంగా చాలా దారుణం. తెలియని వారికి ఈ కథను వివరించి వారి అపోహలు, అపార్ధాలు తొలగించండి.

3వ శతాబ్ధంలో రోమ్ చక్రవర్తి *క్లాడియస్*.. యువకులకు వివాహాలు కాకుండా అడ్డుకున్నారు. దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశారు. *క్లాడియస్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణం.*

🔹 వివాహామైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది అతని భావన.

🔹 వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవారు. ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టం తీసుకొచ్చినట్లు చెబుతారు.

అయితే *“సెయింట్ వాలెంటైన్”,* చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించేవాడు. వివాహామైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది అపోహ అనే విషయం తెలియజేయాలను కుంటాడు. ఆ మేరకు తాను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు. దీంతో చాలామంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు.

👉 *దానితో క్లాడియస్, వాలైంటైన్ తనను ధిక్కరించారని, జైల్లో బంధించి, క్రీ.శ. 269, ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు.*

👉 అయితే ఉరితీసే ముందురోజు సాయంత్రం.. *తాను ప్రేమించిన జైలు అధికారి కుమార్తెకు తొలిసారిగా ఆయన ప్రేమ సందేశం పంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ అధికారి కుమార్తెతో వాలెంటైన్ స్నేహం చేశాడు. ఆమె అంధురాలు కావడంతో వాలెంటైన్ చూపు తెప్పించారట. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది.*

👉 *ఆ ప్రేమ సందేశంలో 'ఫ్రమ్ యువర్ వాలెంటైన్' అని రాసి ఉందంటారు. అలా వాలెంటైన్‌ను ఉరి తీసిన ఫిబ్రవరి 14 “లవర్స్ డే” గా ప్రాచుర్యం పొందింది.*

👉 కానీ, విచిత్రమేమిటంటే? సెయింట్ వాలెంటైన్ గ్రుడ్డి అమ్మాయిని ప్రేమించి, ఆమెకు చూపును (వెలుగును) రప్పించారు. కానీ, *నేటి దినాన్న ఆయన పేరుతో జరుపుకొనే ఈ ప్రేమికుల రోజుమాత్రం, ప్రేమ గ్రుడ్డిదై, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు.*

*ప్రేమ అనేపదంలోనున్నవి రెండే రెండక్షరాలు. కానీ, అది సృష్టించే గందరగోళం మాత్రం వర్ణనాతీతం.*

👉 ఈలోకంలో ప్రేమకున్నన్ని నిర్వచనాలు మరేపదానికి లేవేమో? నేటికిని ఆ ప్రేమను నిర్వచించడానికి మనిషి ప్రయత్నిస్తూనే వున్నాడు. కానీ, దానిని నిర్వచించడం మనిషివల్ల కాదు. ప్రేమంటే? ఆకర్షణ కాదు. మొహం అంతకంటే కాదు. అది చంపేసేది కాదు. చచ్చిపోయేది. ప్రేమ అనేది ఒక శక్తి కాదు. ఆయనొక వ్యక్తి. ఆయనెవరో తెలిస్తే? ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. ప్రేమంటే ఏంటో తెలియాలంటే ఆయనెవరో తెలియాలి.

❣ *ప్రేమ ముఖ్యముగా నాలుగు రకాలు:*
🔴🟢🔵⚪🟣🟡🟠🟤⚫⚫
1⃣ *స్టోర్జ్:*
⚫🟤🟠⚪🔵🟢🔴🔴
( కుటుంబాల మధ్యన వుండే ప్రేమ) పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులు కొందరైతే, తలిదండ్రులను పట్టించుకొనని పిల్లలు కొందరు. ఈ ప్రేమ లోపరహితమైనదేమికాదు.

2⃣ *ఫీలియా:*
🔴🟢🔵⚪🟣🟡🟠🟤🟤⚫
( స్నేహితులు, బంధువుల మధ్య వుండే ప్రేమ) ఇది కొంతకాలం బానే కొనసాగుతుంది. ఏదైనా సమస్యలొస్తే ఇక శత్రుత్వమే మిగులుతుంది. ఇది కూడా లోపరహితమైన ప్రేమ కాదు.

3⃣ *ఎరోస్:*
⚫🟤🟠🟣⚪🔵🟢🔴🔴
(మోహముతో కూడిన ప్రేమ) శరీర కోర్కెలు తీరేవరకు నీవే నా ప్రాణం అంటుంది. తీరాక, ప్రాణం తీయడానికైనా వెనుకాడదు. లొంగదీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. బ్లేక్ మెయిలింగ్ కైనా సిద్ధపడుతుంది. *ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రేమిది. ఇది అత్యంత భయంకరమైనది.*

4⃣ *అగాపే:*
🔴🟢🟣🟡🟠🟤⚫⚫
*ఇది షరతులు లేని ప్రేమ.*
*బదులాశించని దివ్యమైన ప్రేమ.*
👉 *అది నా ప్రియ రక్షకుడైన నా యేసుని ప్రేమ. ఇది శాశ్వతమైనది, సజీవమైనది, లోపరహితమైన ప్రేమ.*

💕 *లోకం దృష్టిలో ప్రేమంటే?*
🔴🔵⚪🟡🟠🟤⚫
👉మూడవ తరగతి చదివే అబ్బాయి, అదే తరగతి చదివే అమ్మాయికి *' l LOVE U'* అని వ్రాసి ఆ అమ్మాయి బుక్ లో పెట్టేసాడు. అంటే? ప్రైమరీ నుండే ప్రారంభ మయిపోయింది ప్రేమ.

👉 ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని

👉ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' 'టైం పాస్ 20' అని. అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? *'టైం పాస్'* అని.

👉ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచి, మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు.

👉 *'ప్రేమికుల రోజు'* (వాలెంటైన్స్ డే) ఇదొకటి. ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.

వీరి దృష్టిలో ప్రేమంటే?
🟣🔴🔵🟡🟡🟤⚫
🔺గ్రీటింగ్స్
🔺రెడ్ రోజెస్
🔺డేటింగ్
🔺 గిఫ్ట్స్
🔺బీచ్ ల వెంట తిరగడం
🔺పార్క్ లలో గడపడం
🔺బైక్స్ మీద చక్కర్లు కొట్టడం

👉 *ఇక తల్లి ప్రేమ!* ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. కాని వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది.

👉ఇక అందరికీ తల్లి *'మదర్ థెరీసా'* ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.

💕 *ఇంతకీ, నిజమైన ప్రేమ ఏది?*
🟣🟢🔴⚪🟡🟠🟤⚫
*ప్రేమ అనేది ఒక శక్తి కాదు. ఆయనొక వ్యక్తి.* ఆయనెవరో తెలిస్తే? ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. ప్రేమంటే ఏంటో తెలియాలంటే ఆయనెవరో తెలియాలి.

నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం *'ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు'*.

*“ఆయన ప్రేమాస్వరూపి”*( ఆయనే ప్రేమయై వున్నాడు)
1 యోహాను 4:8,16

👉 ఆ ప్రేమ యొక్క లక్షణాలు:
🔵🟢⚪🟡🟠🟤⚫⚫
*ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును..... కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.*
(1 కొరింథీ 13 : 4-8,13)

👉 *ఆయన ప్రేమతత్వం:*
శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44)
*మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా.* మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)

👉 *ఆయన ప్రేమ శాశ్వతకాలం నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.*
(యిర్మీయా 31 : 3)

New one..
21/09/2022

New one..

12/06/2021

G d:
*తప్పక కంఠత చేయవలసిన పరిశుద్ధ గ్రంథమందలి కొన్ని(15) సంగతులు.*

*01. పాత నిబంధన పుస్తకముల పేర్లు.(39)*
01. ఆదికాండము
02. నిర్గమకాండము
03. లేవీయకాండము
04. సంఖ్యాకాండము
05. ద్వితియోపదేశకాండము
06. యెహోషువ
07. న్యాయాధిపతులు
08. రూతు
09. సమూయేలు మొదటి గ్రంథము
10. సమూయేలు రెండవ గ్రంథము
11. రాజులు మొదటి గ్రంథము
12. రాజులు రెండవ గ్రంథము
13.దినవృత్తాంతములు మొదటి గ్రంథము
14.దినవృత్తాంతములు రెండవ గ్రంథము
15. ఎజ్రా
16. నెహెమ్యా
17. ఎస్తేరు
18. యోబు
19. కీర్తనలు
20. సామెతలు
21.ప్రసంగి
22. పరమగీతము
23. యెషయా
24. యిర్మీయా
25. విలాపవాక్యములు
26. యెహెజ్కేలు
27. దానియేలు
28. హోషేయ
29. యోవేలు
30. ఆమోసు
31. ఓబద్యా
32. యోనా
33. మీకా
34. నహూము
35. హబక్కూకు
36. జెఫన్యా
37. హగ్గయి
38. జెకర్యా
39. మలాకీ.

*02. క్రొత్త నిబంధన పుస్తకముల పేర్లు. (27)*
01. మత్తయి సువార్త
02. మార్కు సువార్త
03. లూకా సువార్త
04. యోహాను సువార్త
05. అపొస్తలుల కార్యములు
06. రోమీయులకు వ్రాసిన పత్రిక
07. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
08. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక
09. గలతీయులకు వ్రాసిన పత్రిక
10. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక
11. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
12. కొలొస్సయులకు వ్రాసిన పత్రిక
13. థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక
14. థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
15. తిమోతి కి వ్రాసిన మొదటి పత్రిక
16. తిమోతి కి వ్రాసిన రెండవ పత్రిక
17. తీతుకు వ్రాసిన పత్రిక
18. ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక
19. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
20. యాకోబు వ్రాసిన పత్రిక
21. పేతురు వ్రాసిన మొదటి పత్రిక
22. పేతురు వ్రాసిన రెండవ పత్రిక
23. యోహాను వ్రాసిన మొదటి పత్రిక
24. యోహాను వ్రాసిన రెండవ పత్రిక
25. యోహాను వ్రాసిన మూడవ పత్రిక
26. యాదా వ్రాసిన పత్రిక.
27. ప్రకటన గ్రంథము.

*03. సృష్టి*

01. వెలుగు, చీకటి
02. ఆకాశము
03. భూమి, గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫల వృక్షములు
04. పెద్ద జ్యోతి (సూర్యుడు), చిన్న జ్యోతి (చంద్రుడు), నక్షత్రములు
05. జలములలో చలించువాటిని, ఆకాశములో సంచరించువాటిని
06. అడవి జంతువులు, పశువులు, పురుగులు, *మానవుడు*

*04. యాకోబు కుమారుల పేర్లు. (12)*

01. రూబేను
02. షిమ్యోను
03. లేవీ
04. యూదా
05. ఇశ్శాఖారు
06. జెబూలూను
07. దాను
08. నఫ్తాలి
09. గాదు
10. ఆషేరు
11. యోసేపు
12. బెన్యామీను.

*05. పన్నెండు గోత్రములు పేర్లు. (12)*

01. రూబేను
02. షిమ్యోను
03. యూదా
04. ఇశ్శాఖారు
05. జెబూలూను
06. దాను
07. నఫ్తాలి
08. గాదు
09. ఆషేరు
10. మనష్షే
11. ఎఫ్రాయిము
12. బెన్యామీను.

*06. పది ఆజ్ఞలు.*
01. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
02. పైన ఆకాశమందే గాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
03. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
04. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.
05. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
06. నరహత్య చేయకూడదు.
07. వ్యభిచరింపకూడదు.
08. దొంగిలకూడదు.
09. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
10. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

*07. న్యాయాధిపతుల పేర్లు.*
01. ఒత్నీయేలు
02. ఎహుదు
03. షమ్గరు
04. దెబోరా
05. గిద్యోను
06. అబీమెలెకు
07. తోలా
08. యాయీరు
09. యెఫ్తా
10. ఇబ్సాను
11. ఏలోను
12. అబ్దోను
13. సమ్సోను
14. ఏలీ
15. సమూయేలు

*08. ఇశ్రాయేలీయుల రాజుల పేర్లు. (19)*
01. యరొబాము 1
02. నాదాబు
03. బయెషా
04. ఏలా
05. జిమ్రీ
06. ఒమ్రీ
07. అహాబు
08. అహజ్యా
09. యెహోరాము
10. యెహు
11.యెహోయాహాజు
12. యెహోయాషు
13.యరొబాము 2
14. జెకర్యా
15. షల్లూము
16. మెనహేము
17. పెకహ్యా
18. పెకహు
19. హోషేయ

*09. యూదా రాజుల పేర్లు. (20)*
01. రెహబాము
02. అబీయాము
03. ఆసా
04. యెహోషాపాతు
05. యెహోరాము
06. అహజ్యా
07. అతల్యా
08. యోవాషు
09. అమజ్యా
10. ఉజ్జియా
11.యోతాము
12. ఆహాజు
13. హిజ్కియా
14. మనష్షే
15. ఆమోను
16. యోషీయా
17. యెహోయాహాజు
18. యెహోయాకీము
19. యెహోయాకీను
20. సిద్కియా

*10. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు. (12)*
01. పేతురనబడిన సీమోను
02. అతని సహోదరుడగు అంద్రెయ
03. జెబెదయి కుమారుడగు యాకోబు
04. అతని సహోదరుడగు యోహాను
05. ఫిలిప్పు
06. బర్తొలొమయి
07. తోమా
08. సుంకరియైన మత్తయి
09. అల్ఫయి కుమారుడగు యాకోబు
10. తద్దయియను మారుపేరుగల లెబ్బయి
11. కనానీయుడైన సీమోను
12. ఇస్కరియోతు యూదా.

I wish you a very happy birthday brother! May God bless you richly..
31/03/2021

I wish you a very happy birthday brother! May God bless you richly..

Thank you lord for your goodness and faithfulness towards on my sister.It was a joyful moment for us because first time ...
05/03/2021

Thank you lord for your goodness and faithfulness towards on my sister.
It was a joyful moment for us because first time my sister was preached in her church at B.kotthuru and many people were blessed and touched by her preaching, and It was so wonderful moment in our family members because God is using her in his ministry. Therefore I'm praying that may God continue to bless her and lead her for expansion of God's kingdom.

Address

Annavaram
533446

Telephone

+917731882356

Website

Alerts

Be the first to know and let us send you an email when Relief Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Relief Ministries:

Share