Sri Sringeri Sharada Peetam Sri Dattatreya Swamy Temple Anantapur

Sri Sringeri Sharada Peetam Sri Dattatreya Swamy Temple Anantapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Sringeri Sharada Peetam Sri Dattatreya Swamy Temple Anantapur, Religious organisation, Anantapur.

28/11/2025
20/11/2025

Today Laksha Deepotswam at Sri Dattatreya Swamy Devasthanam, Anantapur

12/11/2025
11/11/2025
11/05/2025

చాలా చిన్న పిల్లగా ఉండగా మూడు సం || వయసులో ఉండగా నా కూతురు పరిగెడుతూ కడిగిన ఇంట్లో వేసిన బట్ట పట్టామీద కాలు వేసి నోరు తెరచి ఉండగా పట్టా వెనకకు వెళ్ళి గడప మీద పడిపోయింది. గడప కింది దవడను కొట్టడముతో నాలుక రెండు ముక్కలు అయిపోయింది. కొద్ది పట్టుతో వ్రేలాడుతున్నది. తెల్లటి పిల్ల. ఎర్రటి నెత్తురు కారిపోతున్నది. గబగబా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే ఆయన చూసి హడలిపోయి ఆ పాపను చూస్తే నాలుక కుట్టబుద్ధి వేయడము లేదు. ఇంక ఎవరి దగ్గరకు అన్నా తీసుకుని వెళ్ళమని అన్నారు. నాలుక మోద్దుబారిపోతున్నది గబగబా ఇంకో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే ఆయన ఈ అమ్మాయి చిన్న పిల్ల టోటల్ ఎనస్తిషియా ఇస్తే పక్షవాతము వచ్చే అవకాశము ఉన్నది. చాలా నెత్తురు కారిపోయి0ది నేను బహు సమర్ధులైన శస్త్ర చికిత్సా నిపుణులైన వారిలా నాలుక కుట్టమని అంటే కుట్టలేను. మీరు ఎవరైనా బలవంతముగా నోరు తెరచి పట్టుకుంటే నాలుకకు కుట్లు వేస్తాను. సరిగ్గా అంటుకుంటుంది అన్న నమ్మకము లేదు మీ అమ్మాయికి జీవితములో మాటలు సరిగా రావు చిన్న కొస మాత్రమే ఉన్నది కాబట్టి కుట్టేస్తాను మీరు అందుకు సిద్ధము అవ్వండి అన్నారు. కుట్టేయ్యండి అన్నాను మా ఇంట్లో ఒక పిల్లవాడి ఇంజనీర్ చదువుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడు నోరు తెరచి పట్టుకున్నాడు. ఆయన నాలుక కుట్టేస్తే నాలుక మీద తిత్తుల లాగా వచ్చాయి. అందరూ రావడము అయ్యో నాలుక తెగిపోయిందా ఏదీ ఏదీ అనడము పిల్ల బెంగ పెట్టుకుని నోరు తెరవడము మాని వేసింది ఏమీ తినదు. కుట్లు ఊడి నెత్తురు కారి నాలుక మళ్ళీ ఊడిపోయింది. అర్ధరాత్రి రెండు గంటల సమయము ఎక్కడకు తీసుకుని వెళ్ళను? మళ్ళీ గబగబా ఉన్న ఊళ్ళో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాను. పిల్ల ఇలా అయిపోయింది ఏమీ తినటము లేదు జీర్ణించుకు పోయింది. కోడి ఎలా కూస్తు0దో అలా ఏడవడానికి ఓపిక లేక క్కొ క్కొ అని ఏడుస్తున్నది. నేను ఇంక ఆశ వదలి వేసుకుని ఈశ్వరుడు నాకు ఈ పిల్లను ఋణ పుత్రిక కింద ఇచ్చాడు ఉండదు వెళ్ళిపోతుంది అన్నమాట అని చాలా నిరాశ కలిగి ఆ పిల్లవాడిని పిలిచి నోరు తెరచి పట్టుకోవయ్యా మళ్ళీ కుట్లు వేస్తారుట అన్నాను. ఆ హాస్పటల్ లో ఎదురుగా సత్యనారాయణ స్వామి మూర్తి ఉన్నది. గండు మీసములతో నవ్వుతున్నట్లుగా ఉన్నాడాయన పవిత్రమైన వేదిక మీద నిజము చెపుతున్నాను అబద్దము ఆడటము నాకు ఇష్టము లేదు. ఆయనను చూసి చాలా అసహ్యము వేసింది. దేనికీ ఆ వెకిలి నవ్వు ? అభము శుభము తెలియని పిల్లకు నాలుక తెగి అంత కష్ట పడుతున్నది బ్రతుకుతు0దన్న ఆశ లేదు. నేను ఇక్కడ ఇంత బాధతో కూర్చున్నాను. నువ్వు నవ్వుతూ కనపడుతున్నావు. దేనికీ ఆనవ్వు? ఏమిటి సాధించానని నవ్వవలసిన అవసరము ఏమిటి ఇప్పుడు ? అలా నవ్వితే ఇప్పుడు ఊరుకు0టానా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఈశ్వరుడవు అన్న మర్యాద ఉన్నది నీ మీద నాకు భక్తి ఉన్నది గౌరవము ఉన్నది. నువ్వు ఒక ఉపకారము చెయ్యి ఒకవేళ నేను గత జన్మలలో ఏదో పాపము చేసి ఉ0డటము వలన ఈ కష్టము పడుతుంటే ఆ కష్టమును ఇంకొక రకముగా తీసుకుంటాను నీ మీద నాకు ఉన్న నమ్మకము అటువంటిది. కాలినడకన నడచి నీ క్షేత్రమునకు వస్తాను. నా కూతురు కష్ట పడకుండా దానిని బ్రతికించు. నేను దానికి మాట ఉండాలి అని అడగలేదు బ్రతికితే చాలు అన్నాను. యధార్ధము చెపుతున్నాను నన్ను నమ్మండి మా పిల్ల ఆడుకోవడము చక్కగా తిరగడము మొదలు పెట్టింది ఏదైనా నోట్లో పెడితే మింగేది ఒక పది రోజులు పోయిన తరవాత డాక్టర్ దగ్గరకు తీసుకుని వెడితే ఏదమ్మా ఆ అను అంటే టక్కున నోరు తెరచి0ది నాలుక బయట పెట్టు అంటే చాపింది ఆయన నాలుక పట్టుకుని చూసి తెల్లపోయి కోటేశ్వరరావు గారూ ఈ నాలుకకేనా నేను కుట్లు వేసింది అన్నారు మీరు ఈ నాలుకకే వేసింది అన్నాను. ఈ పాపకి ఒకప్పుడు నాలుక తెగిపోయింది అనడానికి గుర్తుగా పక్కన నల్లపూసంత చిన్న పొక్కు ఉన్నది నరము కూడా కలసి పోయింది. కుట్లు విప్పడానికి కూడా ఏమీ లేదు నాలుక మామూలుగా వచ్చేసింది ఎలా వచ్చేసిందో ఇది నిజముగా ఆశ్చర్యము మీ పాప ఎప్పటిలా మాట్లాడగలదు అన్నారు. తరవాతి కాలములో పిల్ల పెరిగి పెద్దది అయి నాన్నగారండీ ఎందుకు అన్ని డేట్లు ఇస్తారు? ఎందుకు అంత ఇబ్బంది పడతారు? ఎ0దుకంత కష్ట పడతారు ? ఎందుకు అన్ని ఉపన్యాసములు చెపుతారు? ఏమి ఆఫిసునుంచి వచ్చి విశ్రాంతిగా కూర్చో లేరా ! అని నన్ను గద్దించేది. అమ్మా!ఈశ్వరుడు నన్ను ఇలా మాట్లాడటానికి అవకాశము ఇచ్చాడు. ఆయన కోసము నేను ఏదో చెప్పుకుంటూ ఉంటాను కంగారు పడకు అంటూ ఉండేవాడిని హాయిగా సంగీతము నేర్చుకుని పాటలు పాడుతుంది B. Tech పాసయ్యి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి రామాయణములో చెప్పినట్లు రామచంద్రమూర్తితో సీతమ్మ ఆడుకున్నట్లు సంతోషముగా అల్లుడుతో ఆడుకు0టూగడుపుతున్నది. ఆ తరవాత నేను పాదయాత్ర చేసి స్వామివారి దర్శనము చేసుకునే అదృష్టము కూడా అన్నవరము సత్యనారాయణ స్వామి వారు కృప చేసారు. ఇది చెప్పక పోతే కృతఘ్నుడను అవుతాను అని చెప్పాను తప్పించి డాంబికమునకు చెప్పానని మీరు అనుకోవద్దు.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

16/03/2025

శ్రీ స్తోత్రమ్

పురన్దర ఉవాచ:

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః ।
కృష్ణప్రియాయయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః ॥ 1 ॥
పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥ 2 ॥
సర్వసమ్పత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః ।
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః ॥ 3 ॥
కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః ।
చన్ద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే ॥ 4 ॥
సమ్పత్త్యధిష్ఠాతృదేవ్యై మహా దేవ్యై నమో నమః ।
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః ॥ 5 ॥
వైకుణ్ఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే ।
స్వర్గలక్ష్మీరిన్ద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే ॥ 6 ॥
గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా ।
సురభిః సాగరే జాతా దక్షిణా యజ్ఞకామినీ ॥ 7 ॥
అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే ।
స్వాహా త్వం చ హవిర్దానే కావ్యదానే స్వధా స్మృతా ॥ 8 ॥
త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసున్ధరా ।
శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణపరాయణా ॥ 9 ॥
క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా ।
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా ॥ 10 ॥
యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకమ్ ।
జీవన్మృతం చ విశ్వం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా ॥ 11 ॥
సర్వేషాం చ పరా మాతా సర్వబాన్ధవరూపిణీ ।
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ॥ 12 ॥
యథా మాతా స్తనాన్ధానాం శిశూనాం శైశవే సదా ।
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ॥ 13 ॥
మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః ।
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ॥ 14 ॥
సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవామ్బికే ।
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతనీ ॥ 15 ॥
అహం యావత్త్వయా హీనః బన్ధుహీనశ్చ భిక్షుకః ।
సర్వసమ్పద్విహీనశ్చ తావదేవ హరిప్రియే ॥ 16 ॥
జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితమ్ ।
ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ ॥ 17 ॥
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ ।
ఇత్యుక్త్వా చ మహేన్ద్రశ్చ సర్వేః సురగణైః సహ ॥ 18 ॥
ప్రణనామ సాశ్రునేత్రో మూర్ధ్నా చైవ పునః పునః ।
బ్రహ్మా చ శఙ్కరశ్చైవ శేపో ధర్మశ్చ కేశవః ॥ 19 ॥
సర్వే చక్రుః పరీహారం సురార్థే చ పునః పునః ।
దేవేభ్యశ్చ వరం దత్వా పుష్పమాలాం మనోహరమ్ ॥ 20 ॥
కేశవాయ దదౌ లక్ష్మీః సన్తుష్టా సురసంసది ।
యయుర్దేవాశ్చ సన్తుష్టాః స్వం స్వ స్థానం చ నారద ॥ 21 ॥
దేవీ యయౌ హరేః స్థానం దృష్ట్వా క్షీరోదశాయినః ।
యయుశ్చైవ స్వగృహం బ్రహ్మేశానౌ చ నారద ॥ 22 ॥
దత్త్వా శుభాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకమ్ ।
ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసన్ధ్యం చ పఠేన్నరః ॥ 23 ॥
కువేరతుల్యః స భవేద్రాజరాజేశ్వరో మహాన్ ।
పఞ్చలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ ॥ 24 ॥
సిద్ధస్తోత్రం యది పఠేన్మాసమేకం తు సన్తతమ్ ।
మహాసుఖీ చ రాజేన్ద్రో భవిష్యతి న సంశయః ॥ 25 ॥

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే నవమస్కన్ధే ద్విచత్వారింశోఽధ్యాయః

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sringeri Sharada Peetam Sri Dattatreya Swamy Temple Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Sringeri Sharada Peetam Sri Dattatreya Swamy Temple Anantapur:

Share