Mulasthana Aghraharam

Mulasthana Aghraharam A canal is the entry and Godavari river is the exit to Mulasthanam
Here Lord Shiva is self-evolved and rescuing people in the name Mulasthana Agraharam

Mulasthanam is a village, about 25km far from the well-known historical city 'Rajahmundry' in East Godavari Dist.. It is also known as Agraharam or Mulasthana Agraharam. A canal is the entry and Godavari river is the exit to Mulasthanam...
Here Lord Shiva is self-evolved and rescuing people in the name of Muleswara, So the place named as MULASTHANAM, which means the original place or first place!!

ఈ నెల 24వ తారీఖు మంగళవారం విజయదశమి రోజున మూలస్తాన అగ్రహారం శివాలయంలో చండీ హోమం నిర్వహించబడును మరిన్ని వివరాలుకు సంప్రదిం...
18/10/2023

ఈ నెల 24వ తారీఖు మంగళవారం విజయదశమి రోజున మూలస్తాన అగ్రహారం శివాలయంలో చండీ హోమం నిర్వహించబడును మరిన్ని వివరాలుకు సంప్రదించండి 8328201242..

ఓటమి లేని ప్రెసిడెంట్ గారు మృతి 😥  #సలాది_వెంకన్న గార్కి ఘన నివాళి 🙏ఆ ఊర్లో వెంకన్న చెప్పిన వాళ్లకే ఓట్లు.- ముప్పై ఐదు స...
12/04/2023

ఓటమి లేని ప్రెసిడెంట్ గారు మృతి 😥 #సలాది_వెంకన్న గార్కి ఘన నివాళి 🙏

ఆ ఊర్లో వెంకన్న చెప్పిన వాళ్లకే ఓట్లు.
- ముప్పై ఐదు సంవత్సరాల గా విజయం
- ఓటర్లకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా
- దణ్ణం పెట్టకుండా

సర్పంచిగా ఒక్కసారి గెలవడానికే ఆపసోపాలు పడిపోయే కాలం ఇది.పంచాయతీని బట్టి ఎన్నికల ఖర్చు లక్షలు కోట్ల రూపాయలు దాటి పోతున్నాయి.అలాంటిది ఓటర్లకు వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు ఎన్నికలలో అంటే ముపైమూడేళ్లుగా ఆ నాయకుడు చెప్పిన వాళ్లకే ఓట్లు వేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్తాన అగ్రహారం ప్రజలు.అలాగని అదేదో వెయ్యో పదిహేను వందల ఓట్లున్న చిన్న గ్రామం కాదండోయ్.మొత్తం ఓటర్లు 5,563 మంది.ప్రతి ఎన్నికలలో అయిదు వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ.

ఇక ఆ నాయకుడు గురించి తెలుసుకుందాం...

అతని పేరు సలాది వెంకట్రావు. అందరూ వెంకన్న అంటారు.1988లో సర్పంచిగా తొలిసారి పోటీ చేసి 864 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అధ్వానంగా ఉండే ఊరిని బాగు చెయ్యడంలో విశేష కృషి చేసారు. 1995 ఎన్నికలలో సర్పంచ్ పదవి బిసి మహిళకు కేటాయించారు. అప్పుడు కుడిపూడి శారదను వెంకట్రావు పోటీలో నిలపగా 1347 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.2001లో ఒసి జనరల్ కావడంతో ఆయనే పోటీ చేసి 1046 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.2006లో బిసి జనరల్ అయ్యింది ఇళ్ల శేషాద్రి శ్రీనివాస్ ని పోటీలో నిలిపి 678 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.2013లో ఎస్సీ జనరల్ అయ్యింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే పంచాయతీలో పారిశుధ్య కార్మికరాలు యర్రంశెట్టి వెంకాయమ్మను పోటీలో నిలిపి 1310 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.ఇప్పుడు కూడా ఎస్సీ లకే రిజర్వ్ అయ్యింది. ఈసారి ఎమ్ఎ చదివిన లంక వర ప్రసాద్ ను పోటీలో నిలిపారు. నామినేషన్లుకు రెండు రోజుల ముందు ప్రసాద్ ను పిలిచి పోటీ చేయాలని వెంకట్రావు ప్రతిపాదించారు. మొత్తం అయిదుగురు పోటీలో ఉండగా జనసేన అభ్యర్థిగా వెంకట్రావు పోటీచేయించిన ప్రసాద్ 776 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

వెంకట్రావు ఎన్నికల ప్రచారం చాలా విచిత్రంగా ఉంటుంది. బలపర్చిన అభ్యర్థి దండం పెట్టుకుని నడుస్తుంటే పక్కన చేతులు వెనక్కి పెట్టి వెంకట్రావు ఓట్లు అడిగేతీరు ఆశ్చర్యం కల్పిస్తుంది. నేను ఇతన్ని పోటీలో నిలబెట్టాను...నామీద నమ్మకం ఉంటే ఓటు వెయ్యండి లేకపోతే మానేయండి.. అని మొహమాటం లేకుండా చెబుతాడు. ఏ ఓటరకు చేతులు జోడించి దణ్డం పెట్టరు.ప్రచారానికి కూడా ఎవరనీ పనులు మానుకుని రావద్దంటారు.అభ్యర్థితో పాటు ఈయన ఒక్కరే తిరుగుతారు.ఓటర్లకు ఎలాంటి ప్రలోబాలు ఉండవు.కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వరు.ఎన్నికల గుర్తు తెలిడం కోసం డోర్ పోస్టర్స్ ముద్రిస్తారంతే.ఈ సారి తక్కువ సమయం ఉన్నందున మైకు పెట్టి ఆటలో ప్రచారం చేసారు.అందుకునే ఈ సారి ఎన్నికలకు పదివేల రూపాయలు ఖర్చు అయ్యాయి. మొత్తం 14 వార్డులలో పది వార్డులు వెంకట్రావు పోటీ పెట్టించిన వారినే గెలిపించారు.

మూలస్థాన అగ్రహారం వెళ్ళి వెంకన్న ఎలాంటోడని అడిగితే పిచ్చొడండి బాబూ..అని తిట్టుకుంటారు.ఎందుకంటే ఎవరికీ అనుకూలంగా చేయరు. తను చెయ్యాలనుకున్నదనే చేస్తారు.అందరికీ న్యాయం జరగాలంటారు.అందుకునే తిట్టుకున్న వాళ్లు కుడా ఓట్లేసి గెలిపిస్తారు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అభిమాని.దేశంలో అవినీతిపై ఆయన చేసిన పోరాటానికి ఆకర్షితుడై వాళ్ల అబ్బాయికి జయప్రకాష్ నారాయణ అని పెట్టారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలు సన్నగిల్లాయని పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు.

తన రాజకీయమంతా సైకిల్ పైనే సాగింది...సాగుతుంది. తెల్లారకుండా లేచి సైకిల్ వేసుకుమను ఊరంతా తిరిగి పారిశుధ్యం,త్రాగు నీరు,వీధి లైట్లు వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు.రాజకీయంగా రూపాయి ఆశించరు..పావలా పెట్టరు.అందుకునే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పదిన్నర ఎకరాల భూమి పెరగలేదు. తరగలేదు.డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే వాటిని సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతారంటారు వెంకట్రావు. అసలు సర్పంచ్ కు చెక్ పవర్ ఉండకూడదని వాదిస్తారు. అంతేకాదు రెండున్నర ఏళ్ల తర్వాత సర్పంచ్ పాలన ప్రజలకు నచ్చకపోతే రీకాల్ ద్వారా తొలగించే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేస్తారు.పన్నెండో తరగతి చదివిన ఈయన భగవద్గీత, బైబిల్ కంఠస్థం చేసుకున్నారు.ఈకాలం వారికి అంతగా నచ్చని ఎన్నో మంచి విషయాలు ఈయన వివరిస్తూ ఉంటారు.రావులపాలెం సర్పంచిగా చేసిన సఖిలేటి వాకులరాజు తన గురువని ఆయనను ఆదర్శంగా చేసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడ్డానని వెంకట్రావు వివరిస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు అత్యంత అరుదుగానే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

04/03/2022

మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మూలస్థాన అగ్రహారం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మూలేశ్వర స్వామి వారి అభిషేకం మరియు అలంకరణ...

01/03/2022

మహాశివరాత్రి పర్వదినాన శ్రీ మూలేశ్వర స్వామి వారి దర్శనం....

ఈరోజు నుండి 5రోజుల పాటు మూలస్థాన అగ్రహారం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ మూలేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ...
25/02/2022

ఈరోజు నుండి 5రోజుల పాటు మూలస్థాన అగ్రహారం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ మూలేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈరోజు సాయంత్రం గవ్యాంతం, త్రిశూలపూజ,అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ,అంకురారోపణ, గ్రామోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి🙏

 #రైతుల వెన్ను విరిచిన  #అకాల_వర్షాలు!!! #తూర్పుగోదావరి_జిల్లా,  #ఆలమూరు_మండలం,  #మూలస్థాన_అగ్రహారం గ్రామములో మరియు ఆలమూ...
12/11/2021

#రైతుల వెన్ను విరిచిన #అకాల_వర్షాలు!!!

#తూర్పుగోదావరి_జిల్లా, #ఆలమూరు_మండలం, #మూలస్థాన_అగ్రహారం గ్రామములో మరియు ఆలమూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ ప్రారంభం నుండి కాపాడుకుంటూ వచ్చిన పంట గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టం వాటిల్లి రైతన్నకు కంటి నీరు మిగిల్చాయి.ముఖ్యంగా ఆలమూరు మండలం, మూలస్థాన అగ్రహారం గ్రామములో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరి చేలు పూర్తిగా పడిపోయి,నీట మునిగి పంట నష్టం వాటిల్లింది.

తుఫాన్ ప్రభావంతో, చిరుజల్లులతో చల్లబడిన మన ఊరు...😘 #మూలస్థానఅగ్రహారం 😍
12/11/2021

తుఫాన్ ప్రభావంతో, చిరుజల్లులతో చల్లబడిన మన ఊరు...😘

#మూలస్థానఅగ్రహారం 😍

09/11/2021

పరమ పవిత్రమైన కార్తీకమాసం లో శ్రీ మూలేశ్వర స్వామి వారి దర్శనం...

కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యాస్తమయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.

అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.

పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.

కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.

మన గ్రామం లో 19-9-2021 ఆదివారం నాడు శ్రీ సిద్ది బుద్ది సమేత గణపతి కల్యాణం మరియు లక్ష్మీ గణపతి హోమం జరుగును.
15/09/2021

మన గ్రామం లో 19-9-2021 ఆదివారం నాడు
శ్రీ సిద్ది బుద్ది సమేత గణపతి కల్యాణం మరియు లక్ష్మీ గణపతి హోమం జరుగును.

06/09/2021
*ఈరోజు అనగా 28/8/2021 శనివారం మూలస్థానం గ్రామంలో హై స్కూల్ శివాలయం దగ్గర మరియు ఇందిరా కాలనీ బోర్డు స్కూల్ దగ్గర మొదటి మర...
28/08/2021

*ఈరోజు అనగా 28/8/2021 శనివారం మూలస్థానం గ్రామంలో హై స్కూల్ శివాలయం దగ్గర మరియు ఇందిరా కాలనీ బోర్డు స్కూల్ దగ్గర మొదటి మరియు రెండో డోస్ వేయబడును కనుక 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మీ ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి 💉వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది*
ముఖ్య గమనిక వ్యాక్సిన్ వేయించుకునే వారు తప్పనిసరిగా 😷మాస్ పెట్టుకుని రావలెను

Address

Eastgodavari
Alamuru
533233

Website

Alerts

Be the first to know and let us send you an email when Mulasthana Aghraharam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category