Mallavaram sri venkateswara swamy temple

Mallavaram sri venkateswara swamy temple WONDERFUL PLACE TO VISIT!!!:)

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కొండపై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి.
ఈ ప్రాచీన ప్రసిద్దిగాంచిన పుణ్యకెత్రం విజయవాడ చెన్నై జాతీయ రహదారి కి నాలుగు కిలో మీటర్ ల దూరంలో ఉంది. 12 వ శతాబ్దం లో రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైన ఆలయం చాల ప్రసిద్ది గాంచినది . స్వామి పాదాల ముందర నుండి గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది . ఆలయం ఉత్తర ఈశాన్య దిక్కున పెద్ద జలాశయం చూపరులను వివెశముగా అక్కట్టు కొంటుంది. ఆలయ ప్రాంతం పర్యాటకులకు చూడడానికి చాల బాగుంటుంది

27/08/2026

🔔 *విశేషం* 🔔

రేపటి రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకం 🙏🏻

🕉️ రాఖీ పౌర్ణమి రోజున రక్షాసూత్రం మాత్రమే కాదు… మరో గొప్ప వైదిక సంప్రదాయం కూడా ఉందని తెలుసా? 🙏

శ్రావణ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి — రక్షాబంధనం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోరుకునే పవిత్రమైన రోజు.

అయితే ఇదే శ్రావణ పౌర్ణమికి మన వైదిక సంప్రదాయంలో మరో విశిష్టమైన ప్రాధాన్యం కూడా ఉంది. అనేక సంప్రదాయాలలో ఈ కాలంలో ఉపాకర్మ ఆచరిస్తారు.

🌺 రాఖీ అంటే ఏమిటి?

రాఖీ కేవలం చేతికి కట్టే అందమైన దారం కాదు. అది రక్షణ, ప్రేమ, బాధ్యత, పరస్పర శ్రేయస్సు అనే భావాలకు ప్రతీక.

రక్షాసూత్రాన్ని కట్టేటప్పుడు ప్రసిద్ధంగా చెప్పే మంత్రం—

“యేన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః ।
తేన త్వామనుబధ్నామి రక్షే మా చల మా చల ॥”

అంటే — మహాబలవంతుడైన బలిచక్రవర్తికి ఏ పవిత్ర రక్షను కట్టారో, అదే రక్షను నీకు కడుతున్నాను; ఈ రక్ష స్థిరంగా ఉండి నిన్ను కాపాడుగాక — అనే ప్రార్థనా భావం.

🙏 మరి ఉపాకర్మ అంటే ఏమిటి?

సులభంగా చెప్పాలంటే వేదాధ్యయనాన్ని నియమబద్ధంగా తిరిగి ప్రారంభించే వైదిక సంస్కారం.

పూర్వకాలంలో గురుకులాలలో వేదాధ్యయనానికి నిర్ణీత సమయంలో విరామం ఇచ్చి, తిరిగి ఒక పవిత్ర సంకల్పంతో అధ్యయనాన్ని ప్రారంభించేవారు. ఆ పునఃప్రారంభ సంస్కారమే ఉపాకర్మ.

అందుకే ఉపాకర్మ అంటే కేవలం కొత్త యజ్ఞోపవీతం ధరించడం మాత్రమే కాదు.

🌿 కొత్త యజ్ఞోపవీతం ఎందుకు ధరిస్తారు?

యజ్ఞోపవీతం వైదిక కర్తవ్యానికి, నియమానికి, అనుష్ఠానానికి గుర్తు.

ఉపాకర్మ సందర్భంగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ద్వారా గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ, ఇకపై మరింత శ్రద్ధతో ధర్మాచరణ చేయాలనే సంకల్పాన్ని పునరుద్ధరించుకుంటారు.

అందుకే ఉపాకర్మలో ఋషులను స్మరించడం, తర్పణం, గాయత్రీ జపం, సంప్రదాయానుసారమైన వైదిక కర్మలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

🌺 అయితే రాఖీ పౌర్ణమి — ఉపాకర్మ మధ్య ఉన్న అందమైన భావసామ్యం ఏమిటి?

ఒకటి బంధాన్ని గుర్తుచేసే రక్షాసూత్రం.

మరొకటి ధర్మబద్ధమైన జీవితాన్ని గుర్తుచేసే యజ్ఞోపవీతం.

రాఖీ మనకు —
“నా కుటుంబం పట్ల నాకు బాధ్యత ఉంది" అని గుర్తుచేస్తే,

ఉపాకర్మ —
“నా ధర్మం, గురువు, ఋషిపరంపర, వైదిక కర్తవ్యాల పట్ల నాకు బాధ్యత ఉంది” అని గుర్తుచేస్తుంది.

అందుకే శ్రావణ పౌర్ణమిని కేవలం ఒక పండుగగా కాకుండా రక్షణతో పాటు బాధ్యతను గుర్తుచేసే పవిత్రమైన రోజుగా కూడా భావించవచ్చు.

🙏 ప్రతి ఒక్కరూ ఉపాకర్మ చేయాలా?

ఉపాకర్మ అనేది నిర్దిష్ట వైదిక సంప్రదాయాలకు సంబంధించిన కర్మ. వేదశాఖ, సూత్రం, కుటుంబాచారం ఆధారంగా దాని రోజు, విధానంలో తేడాలు ఉంటాయి. కాబట్టి ఎవరి సంప్రదాయాన్ని వారు తమ గురువు లేదా పురోహితుల మార్గదర్శకత్వంలో ఆచరించడం సముచితం.

కానీ రాఖీ పౌర్ణమి అందరికీ ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం మాత్రం ఎంతో సరళమైనది.

🌼 మనల్ని ప్రేమించే వారిని కాపాడుకోవాలి.
🌼 మన బంధాలను గౌరవించాలి.
🌼 మన ధర్మాన్ని మరచిపోకూడదు.
🌼 గురువులను, ఋషులను కృతజ్ఞతతో స్మరించాలి.
🌼 మనలోని తప్పులను సరిదిద్దుకొని మంచి సంకల్పంతో ముందుకు సాగాలి.

🌺 ఈ రాఖీ పౌర్ణమి నాడు చేతికి రక్షాసూత్రం కట్టుకోవడంతో పాటు… మనసుకు కూడా ఒక సంకల్పం కట్టుకుందాం — “నా కుటుంబాన్ని ప్రేమిస్తాను… నా ధర్మాన్ని గౌరవిస్తాను… నా జీవితం సన్మార్గంలో నడిపిస్తాను.”

🙏 అందరికీ పవిత్ర రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
సర్వేజనాః సుఖినో భవంతు 🙏

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

27/08/2026
23/08/2026

ఈరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరగడానికి ప్రోత్సాహం అందించిన వారికి అందరికి కమిటీ తరుపున మనస్ఫూర్తిగా ధన్యవాదముల🙏 ఈ కార్యక్రమం లో ఒంగోలు నుండి పాల్గొనుచున్న భక్తులు కమిటీ కు నూతన ఉత్తేజాన్ని కల్గిస్తున్నారు. ఉచితంగా ఏర్పాటు చేస్తున్న బస్ లకు వారే దాతలను సమాకూర్చు కొంటూ ఇంకా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేవిధంగా చేస్తున్న వారి కృషిని కమిటీ తరుపున అభినందిస్తున్నాము. ఈరోజు వారు ఏర్పాటు చేసిన రెండు బస్ లలో ఒక బస్ ను రైజ్ కాలేజ్ రంగమన్నార్ గారు ఏర్పాటు చేసి మల్లవరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అభివృద్ధి చేయడంలో వారి తోడ్పాటు అందించడం అభినందనీయం అలాగే పెద్దలు రంగమన్నార్ గారికి కమిటీ తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు. 🙏💐🙏

23/08/2026

గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్బంగా జరిగిన
గోమాత పూజ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు

మల్లవర గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రతి నెల పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశి రోజున  నిర్వహిస్తున్న  మల్లవరం శ్రీ వేంకటేశ్వర స్...
21/08/2026

మల్లవర గిరి ప్రదక్షిణ మహోత్సవం

ప్రతి నెల పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశి రోజున నిర్వహిస్తున్న మల్లవరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా పరిసర గ్రామాల నుండి వస్తున్న భక్తుల కోసం సమగ్ర ఏర్పాట్లు జరుగుతుండటం ఎంతో సంతోషకరం
భక్తుల కొరకు రవాణా, అన్నప్రసాదం , తాగునీరు, సమగ్ర ఏర్పాట్లతో , సౌకర్యవంతమైన గిరి ప్రదక్షిణ కల్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులందరూ సూచనలను పాటిస్తూ ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.

14/08/2026

*🌹శ్రావణమాసం ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాము🌹*

*శ్రావణమాసం ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాము*

🌺పరమశివునికి మరియు శ్రీమహావిష్ణువునకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఏకైక దివ్య మాసం ఇది. ప్రకృతి కొత్తదనంతో వికసించడంతో పాటు, జప-తపాలు మరియు వ్రతాలు చేసుకోవడానికి ఇది అత్యంత శ్రేష్ఠమైన సమయం.

🌺పౌర్ణమినాడు చంద్రుడు విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన 'శ్రవణా' నక్షత్రంలో ఉండటం వల్ల దీనికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

🌺దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసి, శివుడు హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించిన పవిత్ర కాలం ఇది. అందుకే ఆయనకు “నీలకంఠుడు” అనే పేరు వచ్చింది.

🌺క్షీరసాగర మథనం సమయంలో అనేక దివ్య వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందని చెబుతారు. ఈ సంఘటనలతో శ్రావణమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే సంప్రదాయం బలపడింది.

🌺మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి మరియు కృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.

🌺ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపుకు నిలయమైన శ్రావణ మాసానికి శుభ స్వాగతం చెబుదాం. ఆ శ్రీలక్ష్మి అనుగ్రహంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు పొందుదాం.

12/08/2026

*కేశవ నామాల విశిష్టత-అర్ధం*

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ

కేశవాయనమః
నారాయణాయనమః
మాధవాయనమః

అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.

01. ఓం కేశవాయనమః(శంఖం _చక్రం_గద_పద్మం)

బ్రహ్మ రుద్రు (ఈశుడు,శివుడు ) లను పుట్టించినవాడు, బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

02. ఓం నారాయణాయనమః (పద్మం_గద_చక్రం_శంఖం)

నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత, సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ నియామకుడు.

03. ఓం మాధవాయ నమః(చక్రం_శంఖం_పద్మం_గద)

‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.

04. ఓం గోవిందాయ నమః(గద_పద్మం_శంఖం_చక్రం)

వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ, కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.

05. ఓం విష్ణవే నమః(పద్మం_శంఖం_చక్రం_గద)

జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.
ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ, చైత్రమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ, సింహరాశికీ,పాలకూ నియామకుడు.

06. ఓం మధుసూదనాయ నమః (శంఖం_పద్మం_గద_చక్రం)

“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని
‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు

07. ఓం త్రివిక్రమాయ నమః (గద_చక్రం_శంఖం_పద్మం)

మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ణి’ అన్న అక్షరానికీ, నేత్ర తత్త్వానికీ, జ్యేష్ఠమాసానికీ, శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.

08. ఓం వామనాయ నమః(చక్రం_గద_పద్మం_శంఖం)

అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ జిహ్వాతత్త్వానికీ, ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ, వృశ్చికరాశికీ, పెరుగుకూ నియామకుడు.

09. ఓం శ్రీధరాయ నమః(చక్రం_గద_శంఖం_పద్మం)

శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.

ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.

10. ఓం హృషీకేశాయ నమః(చక్రం_పద్మం_శంఖం_గద)

ఇంద్రియ నియామకుడూ, రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు.

ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

11. ఓం పద్మనాభాయ నమః(పద్మం_చక్రం_గద_శంఖం)

నాభిలో పద్మాన్ని కలిగినవాడూ, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘ పద్మనాభుడు’ అనబడుతున్నాడు.

ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ,
ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

12. ఓం దామోదరాయ నమః(శంఖం_గద_చక్రం_పద్మం)

యశోదచేత పొట్టకు బిగించబడినతాడుగలవాడూ, ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.

ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

13. ఓం సంకర్షణాయ నమః(శంఖం_పద్మం_చక్రం_గద)

భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.

ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,
మనోమయకోశానికీ, క్షత్రియవర్ణానికీ, స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.

14. ఓం వాసుదేవాయ
నమః (శంఖం_చక్రం_పద్మం_గద)
త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.

ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.

15. ఓం ప్రద్యుమ్నాయ నమః(శంఖం_గద_పద్మం_చక్రం)

అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.

ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.

16. ఓం అనిరుద్ధాయ నమః(గద_శంఖం_పద్మం_చక్రం)

ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ, సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ, జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’ అనబడుతున్నాడు.

ఈయన గాయత్రిలోని ‘హి’అన్న అక్షరానికీ, స్పర్శతత్త్వానికీ, కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ, అబ్దానికీ, నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ, గ్రీష్మఋతువుకూ నియామకుడు.

17. ఓం పురుషోత్తమాయ నమః(పద్మం_శంఖం_గద_చక్రం)

దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు

ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ, రూపతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.

18. ఓం అధోక్షజాయ నమః(గద_శంఖం_చక్రం_పద్మం)

ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.

ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

19. ఓం నారసింహాయ నమః(పద్మం_గద_శంఖం_చక్రం)

నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.

ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

20. ఓం అచ్యుతాయ నమః(పద్మం_చక్రం_శంఖం_గద)

శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.

ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు.

21. ఓం జనార్థనాయ నమః(చక్రం_శంఖం_గద_పద్మం)

సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ, మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ, సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ, సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.

ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ, వాయుతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.

22. ఓం ఉపేంద్రాయ నమః(గద_చక్రం_పద్మం_శంఖం)

ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.

ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.

23. ఓం హరయే నమః(చక్రం_పద్మం_గద_శంఖం)

భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.

ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ, అపోతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.

24. ఓం కృష్ణాయ నమః(గద_పద్మం_చక్రం_శంఖం)

సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“ కృష్ణుడు”అనబడుతున్నాడు.

ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ, పృథ్వీతత్త్వానికీ, కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ, దైహిక కర్మకూ నియామకుడు.

🕉️ మాధవ్ సుదర్శనం 🕉️

Address

Mallavaram, Maddipadu
Addanki
523263

Alerts

Be the first to know and let us send you an email when Mallavaram sri venkateswara swamy temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category