Malladi Sri Venkateswara Swami vaaru

Malladi Sri Venkateswara Swami vaaru Great God of Gods Lord SriVenkateswara came into existence in a " Banyan tree " of Malladi village, 9 k.m. away from pilgrimage centre Amaravathi, Guntur.

away from pilgrimage centre Amaravathi, Guntur Dist situated on the bank of River Krishna just in order to get his splendor and glory exhibited first time ever in the history. The story of appearance of Swami is quite amazing. It is nothing but virtue of the residents (inhabitants) of that village Malladi. The glory of Venkatesa, dwelling in the Banyan tree is enormous. (limitless) The life of dev

otees, getting salvation thro‟ serving Lord, is blessed. Well…then, what is the reason for Sri Venkateswara Swami to get manifested in that Banyan tree ? How is he, i.e. Swami is accomplishing the desires of his devotees ? What services are being offered by devotees to him ? How he gives the fortune of having darshan of his divine Lotus feet ? You will get answers to this type of questions at this Websit www.malladivasa.com


So…. Why delay ? Let us move forward. Please click on "Swami History " in on the top menu bar once. Also make others also to visit this website and read it. Have darshan of Shri Venketeswara Swami, appeared himself in this Banyan tree. In other words, He is a self-existent being here and … get blessed by Lord Srinivasa, inhabitant of Malladi, a place of pilgrimage. May Lord Balaji Venkateswara shower his choicest blessings on you and your families... Govinda...Govinda...Tirumalesha...Govinda....Malladi vasaa..Govinda....

*ఓం నమో వేంకటేశాయ నమః* శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు స్వయంగా వటవృక్ష స్వరూపంగా   వెలసిన పవిత్రమైన దివ్య పుణ్య స్థలం మ...
04/18/2026

*ఓం నమో వేంకటేశాయ నమః*
శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు స్వయంగా వటవృక్ష స్వరూపంగా వెలసిన పవిత్రమైన దివ్య పుణ్య స్థలం మల్లాది, అమరావతి మండలం పల్నాడు జిల్లా

గత శనివారం ఎంతో వైభవంగా వెయ్యవ ( సహస్ర) కళ్యాణము అంగరంగ వైభవముగా జరుపుకొని

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా హిందూ ధర్మంలో హిందువులుగా మనమందరం హోమాలు, యజ్ఞ యాగాదులు విధిగా నిర్వహించుకోవాలి, వాటివలన విశేషమైన ఫలితం ఉంటుంది.

ఈ విశేష సేవలను నిర్వహించుకొనే క్రమంలో

రేపు ఏప్రిల్ 19th ఆదివారం నుండి ప్రతి ఆదివారం *శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం* 52 వారాల పాటు జరుగును.

52 హోమాలతో పాటు
వినాయక చవితికి: *గణపతి హోమం*
దసరా రోజుల్లో : *చండీ హోమం*
కార్తీకమాసంలో : *రుద్రహోమం*
కూడా జరుగును.

స్వామి పై భక్తితో పూర్తి నమ్మకంతో పాల్గొన్న వారికి స్వామివారి సంపూర్ణ ఆశీర్వాదం తప్పక లభిస్తాయి.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ఇట్లు

శ్రీ యేలూరి పార్థసారథి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్

మరియు

ఆలయ ధర్మకర్త
యేలూరి మంగాయమ్మ గారు
సత్తెనపల్లి

04/05/2026

అవును, ఇది నిజంగా అద్భుతం!!
ఆ దేవదేవుని ఆశీర్వాద మహత్యం కాక మరి ఇంకోటి ఏముంటుంది ??

మల్లాది అనే గ్రామానికి షుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో వెలసిన స్వామి వారి వటవృక్ష క్షేత్రం..
ఆ స్వామివారు పెట్టిన ఎన్నో పరీక్షలు.. ఆటుపోట్లు, అవమానాలు తట్టుకుని దేవాలయం నిర్మించుకోవటమే కాకుండా...
స్వామివారి సేవలలో ఎటువంటి రాజీ పడకుండా మా మీ పయనం సాగింది, సాగుతుంది...

ఆంధ్రప్రదేశ్ లోని ఇతర హిందూ దేవాలయాలతో పోలిస్తే అతి అరుదుగా జరిగే ప్రతి వార కల్యాణాలను మల్లాది క్షేత్రంలో ఇప్పటికి 999 కళ్యాణాలు పూర్తిచేసుకుని
వెయ్యవ (1000వ) సహస్ర కళ్యాణ వైభోగము జరుపుకొనటానికి సిద్ధంగా ఉంది. *వచ్చే శనివారం ఏప్రిల్ 11the*

స్వామివారు స్వయంగా వెలసిన స్థలం అవటం చేత ఎంతో పవిత్ర శక్తి సంతరించుకుంది ఈ క్షేత్రం,
అందునా అమ్మవారి కోసమై భూలోకమునకు అవతరించిన ఆ స్వామిని కళ్యాణ వేంకటేశ్వరునిగా చూసుకుంటూ వెయ్యవ కళ్యాణము జరగబోయే సమయం ఇంకా విశిష్టతని కలిగి ఉంటుంది.
ఇందులో ఎటువంటి సందేహం లేదు.

ఈ కళ్యాణ వైభోగం లో పాల్గొన్నా, చూసి తరించిన వారికి ఆ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందులో అతిశయొక్తి లేదు!!

ఈ మహాభాగ్యాన్ని పొందగలిగే అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారు అని ఆశిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం 🙏🏻

ఇట్లు
ఆలయ నిర్మాణం కోసం పాటుపడి, అహర్నిశలు శ్రమించి మాకు ఈ అవకాశం కల్పించిన మా
కీll శే ll బుల్లికోటయ్య గారు
కీll శే ll ఏలూరి పార్థసారథి గార్లను
స్మరించుకుంటూ

ఆలయ ధర్మకర్త
మంగయమ్మ ఏలూరి మరియు
కుమారులు,కుమార్తెలు

ఓం నమో వేంకటేశాయ నమః
www.malladivasa.com
వాట్సాప్ +1 (469) 463-7791 (USA)
Mobile in India : +91 9177050094
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

మల్లాది గ్రామ శివారులో పచ్చని పంట పొలాల మధ్యలో వట వృక్షరూపంగా (Banyaan Tree) వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన...
03/29/2026

మల్లాది గ్రామ శివారులో పచ్చని పంట పొలాల మధ్యలో వట వృక్షరూపంగా (Banyaan Tree) వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం
ఎన్నో దేవస్థానాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది..

**ఆలయము ప్రాంగణములోనే 11 ఆవులతో గోశాల

**ఆలయ ప్రాంగణంలోనే అర ఎకరంలో తులసి గోవింద బృందావనం

**ప్రతి శనివారం శ్రీవారి కళ్యాణం (నేటితో 998 కళ్యాణాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం)

**ప్రతి ఆదివారం శ్రీ లక్ష్మీసుదర్శన హోమాలు

**ప్రతి శనివారం కళ్యాణ అనంతరం దేదీప్యమానమైన వెలుగులో సప్త హారతులు

**హిందూ ధర్మ పరిరక్షణ లో భాగంగా

**ప్రతి శనివారం రెండు శ్లోకాలతో భగవద్గీత ప్రవచనం

**ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక క్విజ్ కార్యక్రమం

**ఆలయ ప్రాంగణంలోనే ఆధ్యాత్మిక లైబ్రరీ

**పేద విద్యార్థులకు విద్యకు ఆర్థిక సహకారం

మల్లాది వేంకటేశ్వర స్వామి దేవస్థానం
మరియు
ఏలూరి పార్థసారధి హిందూ ధర్మ పరిరక్షణ చారిటబుల్ ట్రస్ట్
వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి

*సర్వవ్యాపక తత్త్వము*                  *శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి* " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః " ...
01/21/2026

*సర్వవ్యాపక తత్త్వము*

*శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి*

" అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః " అన్న వేద వాక్కు ప్రకారం ఆ పరమేశ్వరుడు విశ్వమంతటా నిండి ఉన్నాడు. పంచభూతములలోనూ, ప్రతి జీవకణమునందునూ, సకల వృక్ష సంపదలోనూ ఆ దేవదేవుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడు. భగవంతుడు కేవలం విగ్రహాలకే పరిమితం కాదని, సకల చరాచర సృష్టి ఆయన ప్రతిరూపమేనని మల్లాది క్షేత్రం మనకు చాటిచెబుతోంది.

అలా స్వామి వారు స్వయంగా మర్రి చెట్టు రూపం గా ( వటవృక్షం) ప్రకటితమైన దివ్య క్షేత్రం మల్లాది వటవృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామి వారి క్షేత్రం..

స్వామి వెలసిన దివ్యమైన రోజు రేపు అనగా *జనవరి 22 గురువారం*

స్వామివారి తిరుణాల మహోత్సవం వైభవంగా జరుగుటకు పూర్తి సన్నాహాలు చేస్తున్నాం..

మీ అందరికీ స్వామివారు మా రూపంలో మా ద్వారా మీకు ఇస్తున్న ఆహ్వానం

కృతజ్ఞతగా భక్తితో స్వామిని ప్రార్థించండి, ఆరాధించండి లక్ష్మీ నారాయణుని దివ్య అనుగ్రహం పొందండి.

మరింత సమాచారం కొరకు visit

www.malladivasa com

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

01/21/2024
*తిరునాళ్ళ మహోత్సవం*జనవరి 22 న అయోధ్య లో శ్రీ సీతారామచంద్రమూర్తి వారి ఆలయ ప్రతిష్ఠాపన జరిగే దివ్యమైన రోజు (జనవరి 22,  సో...
01/21/2024

*తిరునాళ్ళ మహోత్సవం*

జనవరి 22 న అయోధ్య లో శ్రీ సీతారామచంద్రమూర్తి వారి ఆలయ ప్రతిష్ఠాపన జరిగే దివ్యమైన రోజు (జనవరి 22, సోమవారం) మల్లాది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం జరగటం
ఆ పరమేశ్వరుడి సంకల్పం.

ఈ పవిత్ర మైన రోజున జరిగే శ్రీ శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం, వటవృక్ష స్వామికి, గోమాతలకు మరియు తులసీ వనమునకు జరిగే సప్త హారతుల లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందగలరు అని మీ అందరికీ ఇదే ఆహ్వానం.

# # # # # # # # # # # # # # # # # # #

జనవరి 19 వ తేదీన :
శ్రీ సీతారామ కళ్యాణం జరుగును, ఈ కళ్యాణ ఘట్టంలో త్రేతాయుగంలో వెలసిన ఆ సీతారామ చంద్రమూర్తి ఆశీర్వాదంతో తలబ్రాల ఏర్పాటు జరుగును, ఆ తలంబ్రాలను కలియుగ శ్రీ వటవృక్ష స్వామి తిరునాళ్ళ రోజు ( జనవరి 22 న) వేంకటేశ్వర స్వామి కళ్యాణం లో వినియోగించడం జరుగుతుంది.

ఇంతటి మహిమాన్విత కళ్యాణం లో పాల్గొనటం మన పూర్వ జన్మ సుకృతం.

# # # # # # # # # # # # # #

గోవిందుడి సమేతంగా వున్న శ్రీ లక్షీతులసివన సప్త హారతులు
మరియు తులసీ వన ప్రదక్షిణ కార్యక్రమం
(తులసీవన ప్రదిక్షణం భూ ప్రదక్షిణ తో సమానం 🙏

పూర్తి వివరాలకు .. దేవస్థానం వారిని సంప్రదించండి :
Sevaks from Trustee family:

001-469-463-7791 – శ్రీనివాస యేలూరి –. (USA) ; [email protected]

91770 50094 : నారాయణ మూర్తి యేలూరి
92478 00053 : సీతారామయ్య యేలూరి
98488 25244 – భారతి – Manger

ఇట్లు
మంగాయమ్మ యేలూరి
W/o పార్థసారథి గారు యేలూరి
సత్తెనపల్లి

శుభోదయం 🙏ఈ రోజు మల్లాది వటవృక్ష స్వరూప శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో *వతసావిత్రీ వ్రతం* జరుగును.జ్యేష్ఠమాసంలో వ...
06/14/2022

శుభోదయం 🙏

ఈ రోజు మల్లాది వటవృక్ష స్వరూప శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో *వతసావిత్రీ వ్రతం* జరుగును.

జ్యేష్ఠమాసంలో వటసావిత్రీ వ్రతం చేయడం ఆచారం. ఈ రోజు మంగళవారం నాడు మల్లాది వటవృక్ష రూపం గా వెలసిన శ్రీ శ్రీ *వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో , వట సావిత్రి వ్రతం* నకు ఏర్పాట్లు జరిగాయి
అవకాశం వున్న ముత్తయిదువులు అందరూ తప్పకుండ పాల్గొనండి.

*వ్రతం అనంతరం అన్నదానం కలదు*

" మఱ్ఱి చెట్టు విశేషం "
దేవతావృక్షాలలో వట వృక్షం ఒకటి. వటవృక్షం అంటే మఱ్ఱి చెట్టు . మన జాతీయ వృక్షం. మఱ్ఱి చెట్టు త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు.
మఱ్ఱి చెట్టువేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి .

సౌభాగ్యం కోసం, సంతానం కోసం మఱ్ఱి చెట్టును పూజించడం, ప్రదక్షిణలు చేయడం పరిపాటి. . మర్రి నీడ కింద సేద తీరితే మనసుకు, శరీరానికి సాంత్వన కలుగుతుంది. గ్రహదోషాలను పోగొట్టడంలో కూడా మర్రి ప్రధాన పాత్రను పోషిస్తుంది.
ఆయుర్వేదంలో మఱ్ఱి చెట్టుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది

వివరాలకు :
టెంపుల్ అడ్రస్ : Sri Venkateswara swami devasthanam , Malladi , Amaravathi mandal , AP

అమరావతి నుండి క్రోసూర్ వెళ్ళే మార్గమధ్యలో.
అమరావతి బుద్దుడి విగ్రహం నుంచి 7 కిలోమీటర్లు.

పూర్తి వివరాలకు .. దేవస్థానం వారిని సంప్రదించండి :
Sevaks from Trustee family:
001-469-463-7791 – Srinivasa –. (USA) ; [email protected]
91770 50094 : Narayana Murthy Eluri
92478 00053 : Seetharamaiah, Eluri
94906 38855 – Seenayya gaaru – Priest
98488 25244 – Bharathi – Manger

06/05/2022

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మి నారాయణుడు స్వయంగా తన ఉనికిని వట వృక్ష రూపంగా తెలియజేసిన పుణ్యక్షేత్రం మల్లాది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం.

ఈ దేవాలయంలో ప్రతి శనివారం విశేషమైన
పూజలు,
అర్చనలు,
కళ్యాణం,
గోమాత పూజ,
అన్నదానం
భక్తిపూర్వకంగా జరుగుచున్నాయి.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలయిక కలిగిన ఓకే ఒక వృక్షం వటవృక్షం అనగా మఱ్ఱి వృక్షం.

స్వామి వారికి నిన్న దీప, దీప నక్షత్ర హారతుల తో పాటు కుంభ హారతులు, గోమాత పూజ మొదలైన పూజల దర్శనం కోసం మీ కోసం కొన్ని ఫోటోలు వీడియోలు ఇక్కడ పంపుతున్నాము

ఇట్లు ఆలయ ధర్మకర్త
మంగాయమ్మ ఏలూరి
సత్తెనపల్లి

పూర్తి వివరాలకు .. దేవస్థానం వారిని సంప్రదించండి :
Sevaks from Trustee family:
001-469-463-7791 – Srinivasa –. (USA) ; [email protected]
91770 50094 : Narayana Murthy Eluri
92478 00053 : Seetharamaiah, Eluri
94906 38855 – Seenayya gaaru – Priest
98488 25244 – Bharathi – Manger

03/12/2022

వటవృక్ష రూపంగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం లో 2004 Feb 29 దివ్య ముహూర్తాన తిరుమల తిరుపతి వేద పండితుల చేత ప్రతిష్ట కాబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన 18 వ వార్షికోత్సవం 3వ రోజు వైభవంగా శాంతి కళ్యాణం, గోపూజ, అన్నదానం జరిగాయి..

ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు మీ అందరికీ లభించాలి అని కోరుకుంటూ

మీ అందరి కోసం స్వామి వారి ధూప దీప నక్షత్ర హారతులు ఇతర కార్యక్రమ ఫోటోలు మరియు వీడియోలు

వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం
మల్లాది, అమరావతి మండలం గుంటూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్.
(అమరావతి తో క్రోసూర్ వెళ్ళే మార్గం లో 9km )

🙏శుభోదయం 🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమఃవట వృక్ష రూపంగా తన ఉనికిని తెలియ పరచిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువ...
03/09/2022

🙏శుభోదయం 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

వట వృక్ష రూపంగా తన ఉనికిని తెలియ పరచిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో 2004 సంవత్సరంలో దేవాలయ నిర్మాణం చేసి విగ్రహ రూపం గా ప్రతిష్టించబడినది.

18 సంవత్సరాల క్రితం వైభవంగా తిరుమల తిరుపతి వేద పండితుల చేత ఎన్నో మహిమల నడుమ ప్రతిష్ఠా మహోత్సవం జరిగినది.

ఈ రోజు నుండి మూడు రోజుల కార్యక్రమంగా 18వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అయినాయి.

*ఈ రోజు పంచామృత అభిషేకము*

*రేపు శ్రీ లక్ష్మీ సుదర్శన హోమము*

*ఎల్లుండి అనగా మార్చి 13 శుక్రవారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం*

రేపు, ఎల్లుండి అన్నదాన కార్యక్రమం జరుగును.

ఈ పవిత్ర కార్యక్రమాలలో అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తులు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని కోరుచున్నాము.

ఇట్లు ఆలయ ధర్మకర్త ఏలూరి మంగాయమ్మ గారు మరియు వారి కుమారులు.
సత్తెనపల్లి

శ్రీనివాస ఏలూరి +1 469-463-7791 (USA)

మన అందరి కోసం ఈ కలియుగంలో వట వృక్ష రూపంలో లో వెలసిన ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం ఈరోజు సుప్రభాతసేవతో...
01/22/2022

మన అందరి కోసం ఈ కలియుగంలో వట వృక్ష రూపంలో లో వెలసిన ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం ఈరోజు సుప్రభాతసేవతో వైభవంగా ప్రారంభం అయినది.

చూడటానికి కనులకు విందుగా, మనసుకు ఆనందాన్ని కలిగించే రీతిలో ఆ స్వామివారి రూపం ఉంది.

మనందరి కష్టాలను తొలగించి సుఖశాంతులను, ఆయురారోగ్యాలను కలుగ చేయడానికి కొలువై ఉన్న ఆ వట వృక్ష రూప వేంకటేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందగలరు అని మనవి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దర్శనం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం లో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందగలరు.

అమరావతి బుద్దుడి విగ్రహం నుండి క్రోసూర్ వెళ్ళే మార్గం లో 9 km దూరం లో వుంది దేవాలయం.

ఓం నమో వేంకటేశాయ నమః
గోవిందా గోవిందా 🙏🙏

ఆలయ ధర్మకర్త
ఏలూరి మంగాయమ్మ గారు & కుమారులు
సత్తెనపల్లి

విష్ణు సహస్ర నామావళి లో వున్న వెయ్యి నామాలలో ఒక నామము “ఓం న్యగ్రోధాయ నమః “అనగా .. మఱ్ఱిచెట్టు (వటవృక్షం) రూపంగా, మనకు రక...
02/25/2021

విష్ణు సహస్ర నామావళి లో వున్న వెయ్యి నామాలలో ఒక నామము “ఓం న్యగ్రోధాయ నమః “
అనగా .. మఱ్ఱిచెట్టు (వటవృక్షం) రూపంగా, మనకు రక్షణ ఇచ్చే వాడు దేవాది దేముడు ఆ విష్ణుమూర్తి అని అర్ధం.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక కలిగిన వృక్షం " వట వృక్షం " మాత్రమే.
స్వయానా శ్రీ మన్నారాయణుడు సృష్టి ప్రళయ కాలం లో వటపత్ర సాయి గా అవతరిస్తూవుంటాడు. ఆ స్వామి ఆధారం గా చేసుకున్న దేవతా వృక్షం వటవృక్షం.
సతీ సావిత్రి తన ఐదోతనాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ల రూపమైన ఈ వటవృక్షం ను ప్రార్థించి తన మాంగల్యాన్ని తిరిగి పొందింది. అని పురాణం గాథ.
ఈ కలియుగం లో శ్రీ లక్ష్మీ నారాయణుడే స్వయంభు గా వెలసిన అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
ఆపత్బాంధవుడిగా భక్తుల కు కొంగు బంగారమయ్యే ఆ శ్రీనివాసుడే తన మహిమతో భక్తుల సంరక్షణకై స్వయంగా వట వృక్షం రూపం లో వెలసిన దివ్య స్థలం మల్లాది.
గుంటూరు జిల్లా అమరావతి కి 7 కి మీ దూరంలో వున్న మల్లాది గ్రామంలో పరమ రామ భక్తుడు శ్రీ బొత్తినేని బోల్లయ్య గారు పెంచిన వటవృక్షము, 1977 వ సంవత్సరం లో దివి సీమ తుఫానుకి నెలకొరిగినది. ప్రభుత్వం వారు పాటకి పెట్టి రోడ్కి అడ్డం గా వున్న చెట్లను నరికించారు. అందులో భాగంగా ఈ వట వృక్షాన్ని సగానికి పైగా నరికిన తరువాత ఎటువంటి ప్రయత్నం చేసినా నరుకుటకు చేతకాక నేలకొరిగిన మిగిలి చెట్టుని ఆలా వదిలివేసి వెళ్లారు.
ఒక పవిత్ర శుభదినాన ఆ శ్రీనివాసుడి దివ్య మహిమతో ఆ వటవృక్షం ఫెళ ఫెళ ధ్వనులతో, పెద్ద గాలులతో తన అంతటా తానుగా లేసి యధా స్థానం లో ప్రతిష్ఠాపన చేసుకుని నిలబడినది.
ఆ సమయంలో తూమాటి నరసింహయ్య అనే వ్యక్తి ఒక్కడే అక్కడ వుంది స్వయంగా చూసిన వ్యక్తి.. అదే సమయంలో మల్లాది గ్రామంలో భక్తులకు స్వామి వారి వంటిమీదకి వచ్చి ఆ సంఘటన తన మహిమతోనే జరిగినది అని వాక్ ఇచ్చినారు
అలనాటి నుంచి ఆ దేవాలయం దినదినాభివృద్ధి కాంచుతూ, ఆ స్వామి వారు భక్తులని కాపాడుతూ వున్నారు .
కీ శే బుల్లి కోటయ్య గారు, ఏలూరి పార్ధసారధి గార్లు ఆ దేవాలయమునకు ఎనలేని కృసుషీ చేసి వున్నారు. వీరి ఆలోచన మేరకు.. స్వామి వారి ఆశీస్సులతో, నిత్యం ఆ తిరుమలలో స్వామి వారి కైంకర్యాలు చేసే తిరుమల తిరుపతి దేవస్థాన పండితుల స్వహస్తాలతో 2004 ఫిబ్రవరి 29 న విగ్రహ రూపం గా స్వామి వారిని ప్రతిష్టించారు.
ఇప్పుడు ఏలూరి మంగాయమ్మ గారు మరియు వారి కుమారుల ఆద్వర్యం లో దేవాలయం మానెజ్మెంట్ జరుగుచున్నది.
స్వామి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అందులో మచ్చుకు కొన్ని::
* ప్రతి శనివారం కల్యాణం
* అన్నదానం
* గోశాల
* తులసి వనం
* సుదర్శన హోమం
* ఉచిత విద్య
గోశాల:: గత 15 సంవత్సరాల క్రితం నుండి దేవస్థానం లో గోసేవ ప్రారంభం అయినది, అప్పటినుండి గోశాల నిర్మాణం చేసుకుని , గో పోషణ చేయుచున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మా పాదాభి వందనాలు.
దేవస్థానం ఎదురుగా ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని, దానికి ఫెన్స్ వేసి, ఆవులను ఉదయం పూట మేత కి స్వేచ్ఛగా వదలటం జరుగుతుంది. సాయంత్రం వేళకి అవి పక్కనే దేవాలయం లో వున్న గోశాల లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. పచ్చ గడ్డితో పాటు, ఎండు గండి కూడా ఖరీదు చేసి కొనటం జరిగింది. అలానే పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నాము.
వీటి సంరక్షణకు రక్షకుడుని ఏర్పాటు చేసాము. ఇతను 24 గంటలు దేవస్థానం లో ఉంటూ పూర్తి స్థాయిలో గో సంరక్షుడుగా ఉంటున్నాడు.
ప్రతి శనివారం జరిగే ఈ కళ్యాణం లో, స్వామి వారి నక్షత్ర హారతి లో అవకాశం ఉన్నవారు తప్పకుండా పాల్గొనండి.
వారంలో ఒక సారి అయినా దేవాలయ దర్శనం చేయండి. హిందూ ధర్మాన్ని పాటించండి.
మరింత సమాచారం కోసం :
---------------------------------
ఏలూరి నారాయణ మూర్తి : 91770 50094 ( India )
ఏలూరి సీతారామయ్య : 92478 00053 ( India )
శ్రీనివాస ఏలూరి : +1 469 463 7791 ( USA )
[email protected]

Address

Dallas, TX

Alerts

Be the first to know and let us send you an email when Malladi Sri Venkateswara Swami vaaru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Malladi Sri Venkateswara Swami vaaru:

Share