Suryavamsham VadiyaRaja Kshatriya Samgham 1942

Suryavamsham VadiyaRaja Kshatriya Samgham 1942 International VadiyaRajulu Media. The Vadiya Rajus, lineage of Suryavamsham,warriors by nature were said to have descended from Odisha.

The Vadiya Rajus(Orissa Kings) were lineage of suryavamsham and worshippers of Perrantalamma(Peddintlamma) at kolletikota as their predestial goddess.

17/05/2026
తెలంగాణ వడ్డెరాజుల కార్పొరేషన్ మొదటి చైర్మన్ గుంజ రేణుక నారాయణ గారిని జాతీయ వడ్డెరాజుల సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధ...
16/05/2026

తెలంగాణ వడ్డెరాజుల కార్పొరేషన్ మొదటి చైర్మన్ గుంజ రేణుక నారాయణ గారిని జాతీయ వడ్డెరాజుల సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్న గారి ఆదేశాల మేరకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీసీ గర్జన సింహం శ్రీ కుంచాల ఏడుకొండలు గారు హాజరయ్యారు.

మన జాతీయ వడ్డేరాజుల సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్న గారి ఆదేశాల మేరకు రేపు 17వ తేదీన సాయంత్రం 3:00 గంటల నుండి 5...
16/05/2026

మన జాతీయ వడ్డేరాజుల సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్న గారి ఆదేశాల మేరకు రేపు 17వ తేదీన సాయంత్రం 3:00 గంటల నుండి 5:00 గంటల వరకు చిన్న ఆత్మీయ సమావేశం జరుగుతుంది కావున మన వడ్డెరాజులు వారు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను.

స్థలము అత్తాపూర్, సోమిరెడ్డి నగర్

5.0 ⭐ · Community center in India

15/05/2026

Youth Icon

జాతీయ వడ్డెరాజుల సంఘం ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీస్ వారికి ఏసీ బహూకరణ
13/05/2026

జాతీయ వడ్డెరాజుల సంఘం ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీస్ వారికి ఏసీ బహూకరణ

*వడియరాజులు ఆరాధ్య దైవం*,*వడియరాజ క్షత్రియ* *సంఘము(1942) ఫౌండర్, జమీందారు శ్రీ శ్రీ శ్రీ కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వా...
12/05/2026

*వడియరాజులు ఆరాధ్య దైవం*,
*వడియరాజ క్షత్రియ* *సంఘము(1942) ఫౌండర్, జమీందారు శ్రీ శ్రీ శ్రీ కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారు (జననం నవంబర్-23-1906)(మరణం మే-22-1991) తండ్రి పేరు తమ్మిశెట్టి వెంకటప్పయ్య గజపతిరాజు, తల్లీ పేరు లక్ష్మిదేవమ్మ*
#కందులాపురం జమీందారు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు

👉 #శ్రీ దేవి మూలిక ఫార్మసీ ద్వారా పనులలో గాయపడిన శ్రామికులకు తానే ఒక వైధ్యుడై వైధ్యం చేసేవారు

👉 మహిళాల కట్టు బొట్టు వేష ధారణ మార్చి స్త్రీ శక్తిని, మహిళల గౌరవ మర్యదలను సంరక్షించారు

👉 #వడియరాజుల వరుసలు, గోత్రాలు ద్వారా వివాహా సంభందాలు బలపరిచారు

👉 #ఐకమత్యమే మహా బలం అని వడియరాజుల మధ్య ఐక్యమత్యన్ని ఏర్పరిచారు

👉 తన భుమూలు వారసత్వంగా తన సంతానానికి చెందకుండా వడియరాజ కులంలో ఉన్న నిరుపేదలకు దానం చేశారు

👉 #1942లో వడియరాజ క్షత్రియ సంఘాన్ని స్థాపించి తన జీవితాన్ని సంఘానికి అంకితం చేశారు

👉 #కాళ్ళకి చెప్పులు లేని రోజుల్లో ఊరు రా తిరిగి జాతి ఉధ్ధారణ కోసం పాటుపడ్డారు
సమాజం లో మనకు విలువను గౌరవాన్ని తెచ్చారు

👉 #పేదలకు నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు

👉 #ఆయన గోప్ప పరిశోదకుడు మరియు చరిత్రకారులు

👉 ఎంతో మంది పెళ్ళిలకు బంగారు తాళి బొట్టు దానం చేశారు

👉 #తన తుది శ్వాస విడిచే వరకు మన వడియరాజులు అభివృద్ధి కోసం పరితపించి పోయారు

👉 #బ్రిటిషు పరిపాలనలోనే స్వాతంత్ర్యం రాకమునుపే స్త్రీ అంటే చిన్న చూపు ఉన్న రోజులలోనే " #శ్రీ_వడియరాజ_క్
షత్రియ_మాతకు_జై " అనే స్త్రీని గౌరవించే నినాధంతో "శ్రీ వడియరాజ క్షత్రియ సంఘాన్ని" స్థాపించి వడియరాజులను ఉత్తేజపరుస్తు తద్వారా సమాజంలో చైతన్యాన్ని నేలకోల్పి తన భూములను పేదలకు దానం చేసిన మన జమిందారు గారు కీర్తిశేషులు "తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు గారు."

👉 #రేడియో వాడకం కూడా పూర్తిగా ప్రజలకు విస్తరించని రోజులలోనే రాష్ట్ర నలుమూలలకు వెళ్ళి ప్రజలలో చైతన్యం తీసుకోచ్చారు

👉 #తిరుమల తిరుపతిలో ఏనుగుపై ఊరేగే హక్కు కేవలం ఆ వెంకటేశ్వరస్వామి వారికి మాత్రమే ఉన్న రోజులలో
#గజరాజుపై_ఊరేగిన_గజపతి_రాజు "శ్రీ తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు గారు"
ఏనుగుపై ఊరేగడమే కాదు బ్రిటుషు వారికి వ్యతిరేకంగా మన జాతియ జెండాను ఏనుగపై గంభీరముగా రెపరెపలాడిచ్చిన యోధుడు "వెంకటస్వామి రాజు గారు"*
త్యాగంలో మన వడియరాజుల ఆడపడుచు కొల్లేటి ముద్దుబిడ్డ అయిన శ్రీ #పేఱంటాలమ్మ తరువాత అంతటి స్థాయికి అర్హుడు మన వెంకటస్వామి రాజు గారు. అందుకేనేమో ఆయన *వడియరాజ క్షత్రియ మాతకు జై* అనే నినాదానికి ఊపీరి పోసారు.

👉 #బ్రాహ్మణ సంస్క్రతికి ప్రతినిధి అయిన శ్రీనాథ కవిసార్వభౌముడని శిక్షించి అపకీర్తి పోందిన వడియరాజుల వంశంలో జన్మించిన ఈయన వడియరాజ వంశంలోనే పుట్టిన " #ముంగర_మల్లిఖార్జున రాజునే" కవిసార్వభౌముడిగా తీర్చిదిద్దిన గురువు మన వెంకటస్వామి రాజు గారు.

👉 తరువాత గిరిపురం లో బంధు మిత్రులతో కలిసి స్వాతంత్ర్యం కోసం మనంత పోరాటం చేయాలని సభ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు (ప్రముఖులు)
1) ఓర్సు గుత్వరాజు గారు
2)కల్లూరు చల్లా రోశరాజు ఒడియరు (మైసురు ప్యాలస్ ప్రెసిడెన్సీ)
2)సూర్యవంశ చయళ్ రాజేంద్రుడు
3)బండారు ఓబుల్ రాజు గారు
4)దేరంగుల రోశయ్య రాజు గారు
5)యువ్వచానర్ రాజ పుత్రుడు వెంకటస్వామిరాజు వేంపాడు
6)జమిందార్ బత్తుల చిన్న గురప్పరాజు గారు
7)విడగోట్టు క్రష్ణం రాజు డాక్టరు
8)కె.వి.రెడ్డిరాజు గారు
9)పటేల్ వెంకటప్ప ఒడియరు గారు
10)బత్తుల పెద్ద గురప్పరాజు గారు
11)దేరంగుల యీరవరాజు గారు
12)శ్రీ కె.వి.లక్ష్మి దేవమ్మగారు గారు
13)యమ్.ఎ.రాజగోపాలరాజు గారు
14)విడగోట్టముని వెంకటప్పరాజు గారు
15)జి.వై క్రిష్ణరాజు గారు
16)షువ్వ బనప్పరాజు గారు
17)దేవండ్ల వీరయ్యరాజు గారు
18)గోవిందప్పరాజు గారు
19)యువ్వు బనప్పరాజు గారు
20)దేవండ్ల పెద్ద వంకంరాజు గారు
21)దేవండ్ల కోటంరాజు గారు
22)గుంజా నరసింహరాజు గారు
23)కుంచాల వెంకంరాజు,చాగల్లు
24)తన్నీరు సుబ్బరాజు గారు
25)చల్లా వెంకం రాజు గారు
26)యువ్వు సుబ్బరాజు గారు
27)చల్లా బంగారురాజు గారు
28)వైరాగిరాజు గారు
29)కోవూరు వీరస్వామి రాజు గారు
30)మల్లె సుబ్బమ్మదేవి
31)సంపంగి హనుమంతరాజు గారు
32)పల్లెపు పెద్ద పకీరప్పరాజు గారు
33)పల్లెపు చిన్న పకీరప్పరాజు గారు
34)పల్లెపు నాగరాజు గారు
35)ఓర్సు సుబ్బరాజు గారు
36)దేవండ్ల ఓబుల్ రాజు గారు
37)దేరంగుల లింగమూర్తిరాజు గారు
38)గోవుల యీరవరాజు గారు
39)చల్లా వెంకట్రవణరాజు గారు
40)బత్తుల గంగురాజు కులోద్దారణ సింగం
41)స్వామిరేరి వెంకటస్వామి రాజు గారు
42)జరిపెటిి దాగులరాజు గారు
43)విడగోట్టు వెంకటప్పరాజు గారు
44)జరిపెటి వెంకటస్వామిరాజు గారు
45)ఎడగొట్టు నయ నేలప్పరాజు గారు
46)బండి తిమ్మరాజు గారు
47)దేరంగుల రామరాజు గారు
48)భట్టుమూర్తి మల్లిఖార్జునరాజు గారు

ఈ కార్యక్రమంలో రాజు గారు తెల్ల ఏనుగు పైన గంభీరముగా కూర్చొని మన భారత జాతీయ జెండాని ఎగురవేయడం వలన అక్కడున్న ఓ బ్రిటిష్ అధికారి వచ్చి సభని ఇబ్బంది పెడుతుంటే రాజు గారు కోపంగా "రెయ్ వాడిని ఆ చెట్టుకి కట్టిపడేయండిర" అని చెప్పగానే మన రాజులందరు, అక్కడున్న మహిళలు వాడిని కొట్టి చెట్టుకి కట్టేశారు. ఇలా కార్యక్రమం విజయవంతం అయిన తరువాత గద్వాల్ మహారాణి గారు రాజు గారిని రాజమహల్ కి తీసుకెళ్లి సన్మానించారు. ఆయన చేసిన సేవలకు దేశానికి చేస్తున్న పోరాటానికి మహారాణి గారు అంతఃపురంలో అధితులకు పరిచయం చేశారు. ఆ తరువాత మైసూర్ పాలస్ ప్రెసిడెన్సీ చల్లా రోసిరాజ వడియర్ గారు కోకిల అనే గుర్రం పై మైసూరు రాజ ప్రసాదానికి ఆహ్వానించారు.
ఈ అమూల్యమైన విషయాలన్నీ రాజు గారి శిష్యులు చల్లా సుబ్బారాయుడు గారి కుమారుడు చల్లా జయరామరాజు గారు తెలియజేశారు.

భారత్ మాతకి జై
జై హింద్ 🇮🇳🚩🙏🏼
జై వడియరాజ్

మన వల్లేపు చైత్ర కి మన వారందరు అండగా ఉండాలని కోరుతున్నాను..
08/05/2026

మన వల్లేపు చైత్ర కి మన వారందరు అండగా ఉండాలని కోరుతున్నాను..

12 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఇంకా చరిత్ర పరిశోధన చేస్తూ ఎంతో కృషి తో ముందుకు వస్తు మన సూర్యవంశం వడియరాజుల కుల పరువుని ఆ...
07/05/2026

12 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఇంకా చరిత్ర పరిశోధన చేస్తూ ఎంతో కృషి తో ముందుకు వస్తు మన సూర్యవంశం వడియరాజుల కుల పరువుని ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు తన్నీరు అజయ్ కుమార్ రాజు గారు. ఆయన మరో వెంకటస్వామిరాజు గారు అజయ్ రాజ్ గారు రాబోయేరోజుల్లో మన వడియరాజులు మళ్ళీ రాజకీయం చేసే మార్గదర్శకులు అవుతారు.. ఇది నిజం.
అలాగే మీకు మన చరిత్ర పరంగా ఎలాంటి వివరాలు కావాలన్నా లేదా వాటి శాసనాలు ఆధారాలు కావాలన్నా తన్నీరు అజయ్ కుమార్ రాజు గారి నెంబర్ కి వాట్సాప్ చేయండి 8247084799

Address

Vijayawada
520001

Website

https://suryavamsamvadiyarajulu.blogspot.com/?m=1

Alerts

Be the first to know and let us send you an email when Suryavamsham VadiyaRaja Kshatriya Samgham 1942 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share