13/12/2024
పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమ ఆహ్వానం.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం, అనుప్పల్లి పంచాయితీ శ్రీ జన్మస్థల శివాలయం వద్ద 14/12/2024 వ తేది శనివారం రాత్రి విశిష్టమైన మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు , *అన్నదాన* కార్యక్రమం నిర్వహించబడును..
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే
*కార్యక్రమ వివరాలు*
👉 రాత్రి 7:00 గంటలకు: పరమశివునికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు
👉 రాత్రి 7:30 గంటల నుండి చాగంటి రమేష్ మరియు శ్వేత చంద్రమౌళి గార్లచే ఆధ్యాత్మిక ప్రసంగం
👉 రాత్రి 8 గంటలకు హిందూ సమ్మేళనం
👉 రాత్రి 8:15 గంటలకు: శివాలయం చుట్టూ సామూహిక ప్రదక్షిణలు మరియు నేతి గిన్నెలో చంద్ర దర్శనం.
👉 రాత్రి 9:00 గంటలకు: *సమరసతా సేవా ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో పరమశివునికి మరియు చంద్రునికి భక్తులచే సామూహిక హారతి.
ఏకవీర సేవ ఫౌండేషన్, అభయ హస్త గోవింద సేవా మండలి, సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్, ఏపీ బీసీ సెల్ అధ్యక్షుడు జగన్నాథం వారి పర్యవేక్షణ లో పై కార్యక్రమాలు జరుగును.
👉 పరిసర గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులచే భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమగును.
భక్తులచే పౌర్ణమి హోమం వేయబడును.
ఆహ్వానించువారు.
*అనుప్పల్లి, వేప కుప్పం, గంగుడుపల్లి గ్రామపంచాయతీల లోని ట్రస్ట్ మెంబర్లు మరియు ప్రజలు.*
భక్తులారా రండి ! పరమశివుని సేవలో తరించండి.