శ్రీమద్ భాగవత సప్తాహం

శ్రీమద్ భాగవత సప్తాహం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from శ్రీమద్ భాగవత సప్తాహం, Hindu temple, C/O Sri Swami Sh*tal Das Seva Trust, B1/88, Pushkara Talab, Telangana.

"ఓం నమో భగవతే వాసుదేవాయ! భక్తుల హృదయాలను కదిలించే భాగవత సప్తాహం, శ్రీమద్ భాగవతం మన జీవితాలకు ఒక దివ్య దారిచూపుతుంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం వంటి విలువలను నేర్పుతుంది. సప్తాహం అందరికీ మంగళకరం. #శ్రీమద్భాగవతం #భక్తి #ధర్మం #జ్ఞానం #భాగవతం #సప్తాహం

Invitation to Badrinath Bhagavata Saptaha YatraBhagavathulara,We are pleased to invite you to a spiritually enriching pi...
20/03/2025

Invitation to Badrinath Bhagavata Saptaha Yatra
Bhagavathulara,
We are pleased to invite you to a spiritually enriching pilgrimage to Badrinath, organized by Radha Peetham.
Badrinath Yatra (May 22rd - June 4th, 2025):
Location: Badrinath Kshetram
Purpose: Bhagavata Saptaha for the salvation of ancestors
Discourse by: Brahmasri Trigulla Narasimha Murthy Sharma, Director of Vishwa Samskruta Seva Sadanam, Hyderabad, Telangana
Activities: Bhagavata Saptaha Sankalpa Diksha, Bhagavata discourses, and recitations by priests.
Itinerary:
May 22rd: Hyderabad to Delhi
May 24th: Delhi to Haridwar, overnight stay
May 25th: Haridwar to Badrinath, Pushkara bath in Saraswati River
May 26th - June 1st: Bhagavata Saptaha in Badrinath
June 2nd: Badrinath to Haridwar, overnight stay
June 3rd: Visit local temples in Haridwar and Rishikesh
June 4th: Delhi to Hyderabad
Cost: Rs. 25,000/- per person (includes Brahmin meals, accommodation, and transportation). Additional costs for auto-rickshaw, cable car/ropeway, horse, doli, helicopter, darshan fees, puja, and porter.
Vrindavan/Mathura Yatra (Following Badrinath):
Location: Badrinath .
Purpose: Bhagavata Saptaha in the holy cities of salvation.
Activities: Bhagavata Saptaha Sankalpa Diksha, Bhagavata discourses, and recitations by priests.
Contact for Registration:
8978432772
8978131389
Join us for this divine journey and immerse yourself in spiritual bliss.
Jai Shri Krishna!

భక్తి పారవశ్యంలో బద్రీనాథ్ యాత్ర!రాధా పీఠం వారి శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞంమే 22, 2025 నుండి జూన్ 4, 2025 వరకుపితృదే...
20/03/2025

భక్తి పారవశ్యంలో బద్రీనాథ్ యాత్ర!

రాధా పీఠం వారి శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం

మే 22, 2025 నుండి జూన్ 4, 2025 వరకు

పితృదేవతల మోక్షప్రాప్తి కోసం బద్రీనాథ్ క్షేత్రంలో భాగవత సప్తాహం!

బ్రహ్మాశ్రీ త్రిగుళ్ల నరసింహా మూర్తి శర్మ గారిచే భాగవత ప్రవచనం
సరస్వతీ నది పుష్కర స్నానం
హరిద్వార్, రిషికేశ్ దేవాలయాల దర్శనం
యాత్ర వివరాలు:

హైదరాబాద్ నుండి ఢిల్లీ, హరిద్వార్ మీదుగా బద్రీనాథ్ ప్రయాణం
భాగవత సప్తాహ సంకల్ప దీక్ష, పారాయణాలు
భోజనం, వసతి, వాహన సౌకర్యాలతో రూ.25,000/- మాత్రమే
ఛార్ ధామ్ యాత్రకు ఆసక్తి ఉన్నవారు అదనపు రుసుము చెల్లించవచ్చు
తదుపరి వృందావన-మధుర యాత్ర కూడా!

శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర స్థలాల్లో భాగవత సప్తాహం!

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

సంప్రదించండి: 8978432772 | 8978131389

#బద్రీనాథ్ #భాగవతసప్తాహం #రాధాపీఠం #భక్తి #యాత్ర #హరిద్వార్ #రిషికేశ్ #వృందావనం #మధుర

26/10/2024

కాశీ యాత్ర ప్లాన్ చేయండి Call | WhatsApp 099516 33336
కార్తీక మాసంలో కాశీ వెళ్లాలనుకుంటున్నారా? తెలంగాణ భవన్‌లో సరసమైన ధరలకు బస చేసి, పవిత్ర గంగా నదిలో స్నానం చేసి, దేవాలయాలను దర్శించుకోండి.

12/10/2024
శుభ విజయ దశమి! 🙏💐 ఈరోజు మీరు ఏ పని సంకల్పించినా, తప్పక నెరవేరుతుంది. ఆ భువనేశ్వరి రాజారాజేశ్వరి పైన బరము వేశి మీ ధర్మ మై...
12/10/2024

శుభ విజయ దశమి! 🙏💐 ఈరోజు మీరు ఏ పని సంకల్పించినా, తప్పక నెరవేరుతుంది. ఆ భువనేశ్వరి రాజారాజేశ్వరి పైన బరము వేశి మీ ధర్మ మైన సంకల్పాన్ని అచమనము చేసి దశమి గడియలో చెప్పుకోండి. జయ్ భవాని! 🙏💐

శ్రీమదాంధ్ర భాగవతం - ముప్పై ఏడవ భాగము | పాషండుల పుట్టుక మరియు పృథువు యొక్క జ్ఞానోదయం (The Birth of Heretics and Pṛthu's ...
07/10/2024

శ్రీమదాంధ్ర భాగవతం - ముప్పై ఏడవ భాగము | పాషండుల పుట్టుక మరియు పృథువు యొక్క జ్ఞానోదయం (The Birth of Heretics and Pṛthu's Enlightenment) | పృథువు యొక్క మోక్ష మార్గం (Pṛthu's Path to Liberation)

(Srimad Bhagavatham Sapthaha - Yatra | Vrindavan - Mathura U.P.) బృందావనం లో శ్రీమద్ భాగవత సప్తాహం యాత్ర, శ్రీకృష్ణుని పాదాలను స్మరించుకుంటూ, భక్తి రసంతో నిండిపోయే ఓ అద్భుత యాత్రకు సిద్ధంగా ఉండండి! 2025 మార్చి 17 నుండి మార్చి 24 వరకు, పవిత్రమైన బృందావనంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రూ.16000/-లకు, ఈ పుణ్యయాత్రలో పాల్గొని, భగవద్భక్తిని పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మరిన్ని వివరాల కోసం Contact Viswapathi 9951633336 Join Yatra Group: https://chat.whatsapp.com/DNFOKPcovq0AVzMvyOg29I

పృథుమహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి "వీర్యము", "ఓజము", "ఋతము" అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.

రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహపాత్రలలో మూడురకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది.

పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టిపాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిలమహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు.

కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణనే శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు.

పాములు తక్షకుడిని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రలలోకి "పురువులు" "ఫలములు" అనే వాటిని పిండుకున్నాయి.

వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉండి మనకు రసపోషణము చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు.

ప్రజలు అందరూ పరమ సంతోషముగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి "సరస్వతి" "తృషద్వతి" అనబడే రెండు నదుల మధ్యప్రాంతంలో యజ్ఞశాల కట్టి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశాడు. నూరవయజ్ఞం చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపముతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు.

అత్రిమహర్షి "గుర్రమును ఎత్తుకు పోతున్నవాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా బాణము వదిలెయ్యి అన్నాడు. బాణము వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుఱ్ఱమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి "విజితాశ్వుడు" అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతున్నది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణముగా మాంత్రికశక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసినవాడయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాపవిముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడుకూడా అయి ఉంటాడు. అతనిని వధించాలా! వద్దా! అని పృథువు అనుమాన పడుతున్నాడు.

అత్రి "నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వేయవలసింది" అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. ఇంద్రుడు ఆ రూపమును, గుఱ్ఱమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు "పాఖండరూపము" అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేద విరుద్ధమయిన మార్గములో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది.

రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. ఋషులు "నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవయజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఇంద్రుడిని ఈ హోమములో పడేస్తాము" అన్నారు.

ఇంద్రుని మీద క్షాత్రశక్తి, తపఃశ్శక్తి రెండూ కలిసిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి "మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపఃశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే "అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరముగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనము దిగి "పృథూ, ఇప్పటికి నువ్వు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయి ఉండేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయడములో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గుర్తించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. అతని చర్య పైకి దోషముగా కనపడుతున్నది. నీవు బాణం వేయవలసింది ఇంద్రుని మీద కాదు. ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపంనుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనము చెయ్యి" అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథుమహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అర్చన భక్తికి పృథుమహారాజు గొప్పవాడు. పృథుమహారాజు జీవితములో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది.

శ్రీమహా విష్ణువు "పృథూ! నీకేమి వరం కావాలో కోరుకో" అన్నాడు. పృథుమహారాజు "స్వామీ! నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరములు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడము వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు.

ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు" అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజానిష్ఠ. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగము చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందాది మహర్షులు క్రిందికి దిగారు. మహాపురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది.

ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి "స్వామీ! మేము సంసారమునందు ఉన్న మేము ఎలా తరిస్తాము?

మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి" అని "బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత" అని అడిగితే సనక సనందనాదులు "ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటివాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు" అని చెప్పారు.

వాళ్లు ఇంకా ఇలా ‘గృహస్థాశ్రమంలో ఉండి చాలాకాలము పాపకర్మలయందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితము తరించడానికి చేయవలసిన మొట్టమొదటి పని భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగి ఆ నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకోవాలి. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమముగా నిష్కామయోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్నిపాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతే సాయుజ్యము కలుగుతుంది" అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తరదిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథివికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణుసాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేసాడు.

ఈవిధముగా పృథుమహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేస్తూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథుమహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు.

క్షత్రియుడు తనకు ఫలానారాజ్యం కావాలని పృథుమహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథుమహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారములో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించేతత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి పృథుచరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వపాపములు నశించి శ్రీకృష్ణపరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహముతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.

శ్రీమదాంధ్ర భాగవతం - ముప్పై ఆరవ భాగము | పృథువు: భూమి పితామహుడు (Pṛthu: The Father of the Earth) - Emphasizes Pṛthu's rol...
05/10/2024

శ్రీమదాంధ్ర భాగవతం - ముప్పై ఆరవ భాగము | పృథువు: భూమి పితామహుడు (Pṛthu: The Father of the Earth) - Emphasizes Pṛthu's role in cultivating the Earth | సమస్త భూమికి జీవం పోసిన రాజు (The King Who Gave Life to the Entire Earth) - Focuses on his role in revitalizing the Earth.

(Srimad Bhagavatham Sapthaha - Yatra | Vrindavan - Mathura U.P.) బృందావనం లో శ్రీమద్ భాగవత సప్తాహం యాత్ర, శ్రీకృష్ణుని పాదాలను స్మరించుకుంటూ, భక్తి రసంతో నిండిపోయే ఓ అద్భుత యాత్రకు సిద్ధంగా ఉండండి! 2025 మార్చి 17 నుండి మార్చి 24 వరకు, పవిత్రమైన బృందావనంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రూ.16000/-లకు, ఈ పుణ్యయాత్రలో పాల్గొని, భగవద్భక్తిని పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మరిన్ని వివరాల కోసం Contact Viswapathi 9951633336 Join Yatra Group: https://chat.whatsapp.com/DNFOKPcovq0AVzMvyOg29I

వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ క్రూరుల వైపునుండి బాధ. యజ్ఞయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు.

ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. "వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను " అన్నది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు.

ప్రతివాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రారు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగి దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీతీరంలో సమావేశమై రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకుని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. " రాజా! నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి.

శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో " అని చెప్పారు. వేనుడు " అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగితిపోతాయి " అన్నాడు.

ఋషులు ఇక అతడు మారడు. " వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు." అనుకున్నారు. ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచ్చిపోయాడు.

అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వేనుని శరీరమును కాపాడింది. ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు.

ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. ఋషులు " మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. మనం మన తపఃశ్శక్తితో రాజు శరీరములో నుంచి రాజు సంతానమును తీసుకురావాలి" అనుకున్నారు. తపఃశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు.

ఋషులు వెళ్ళి మొట్టమొదట తపఃశ్శక్తితో ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి పాపము పైకి రావడం మొదలు పెట్టింది. బాహుకుడు అనబడే ఒక నల్లటివాడు పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగిజుట్టుతో పుట్టుకొచ్చాడు. "నేను ఏమి చేయాలి" అని ఋషులను అడిగాడు. ఋషులు వానివంక చూసి "వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు.

సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే "నిషాదులు" అని పేరు వచ్చింది.

ఋషులు "స్వామీ! ఒక కొడుకు పుట్టాలని మేము అడగడము లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము.

శ్రీమహావిష్ణువా! నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా" అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. "ఓహో మనం ప్రార్థన చేసినట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు" అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు "అర్చిస్సు" అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.

ఆయన విష్ణుఅంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము దిక్పాలకులు పట్టుకుని వచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోవడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మెడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మెడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కత్తి పెట్టడానికి ఒర కావాలి.

పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుఱ్ఱమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్తదేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు.

పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి "మహానుభావా! ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా ! అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది" అన్నారు.

పార్వతీదేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. "అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను" అన్నాడు.

పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. "స్వామి ! నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు.

యజ్ఞయాగాదులు మానడము ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను (నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉన్నది. నేను గోరూపంలో తిరుగుతాను.

జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు" అని అడిగింది.

అపుడు పృథు మహారాజు "ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు" అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది.

స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి.

ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలము అయింది.

ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది.

విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాలా సంతోషించారు. భూమిని పృథుమహారాజు పిండితే "పృథ్వి'' అనే పేరు వచ్చింది. జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.

Jai Kashi Viswanath 🙏💐
04/10/2024

Jai Kashi Viswanath 🙏💐

శ్రీమద్ భాగవత సప్తాహం | Srimad Bhagavatha Sapthaha0 seconds agoశ్రీమదాంధ్ర భాగవతం -  ముప్పై ఐదవ భాగము |  ధృవ మండల యాత్ర ...
03/10/2024

శ్రీమద్ భాగవత సప్తాహం | Srimad Bhagavatha Sapthaha
0 seconds ago
శ్రీమదాంధ్ర భాగవతం - ముప్పై ఐదవ భాగము | ధృవ మండల యాత్ర The Journey to Dhruva Loka | అంగరాజు కథ The Story of King Anga | వేనుని పాప కర్మలు The Sins of Venu

(Srimad Bhagavatham Sapthaha - Yatra | Vrindavan - Mathura U.P.) బృందావనం లో శ్రీమద్ భాగవత సప్తాహం యాత్ర, శ్రీకృష్ణుని పాదాలను స్మరించుకుంటూ, భక్తి రసంతో నిండిపోయే ఓ అద్భుత యాత్రకు సిద్ధంగా ఉండండి! 2025 మార్చి 17 నుండి మార్చి 24 వరకు, పవిత్రమైన బృందావనంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రూ.16000/-లకు, ఈ పుణ్యయాత్రలో పాల్గొని, భగవద్భక్తిని పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మరిన్ని వివరాల కోసం Contact Viswapathi 9951633336 Join Yatra Group: https://chat.whatsapp.com/DNFOKPcovq0...

ధృవుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధృవోపాఖ్యానం.

కుబేరుడు వచ్చి "నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడము నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను" అన్నాడు. ధృవుడు " నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా!

నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీవరము చేత కటాక్షింపబడుగాక" అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో వరమును ధృవునకు అనుగ్రహించాడు. దానితో ధృవుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకము చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు.

ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖ చక్ర గద పద్మములను పట్టుకుని తాను అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. ధృవుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు.

వాళ్ళు "మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణుపార్షదులము వచ్చి విమానం ఎక్కమ"ని అన్నారు.

ధృవుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చుని అనుకున్నాడు "ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు.

అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్దపదవి అంటే ఏమో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధృవస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోకదర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని" అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరని ఆలోచించాడు.

"మనసులో దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో" అనుకున్నాడు. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. "నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు" అన్నారు. ధృవుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీతి వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుని లోకి వెళ్ళిపోయింది.

ధృవుడు ధృవ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమయిన ఈ ధృవోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.

3. పృథు చరిత్ర:- ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భముగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. "ఎందుచేత ఇలా జరిగింది" అని ఋషులను అడిగాడు.

ఋషులు "వేదము స్వరప్రకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడము లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. నీలో ఏదో దోషం ఉండి ఉండాలి. నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడము లేదు. ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి" అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు.

అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. ఋషులు "నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకముగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానము కలగలేదు. ఈ ప్రతిబంధకమును తీసివేయాలి.

శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తిపడితే నీకు సంతానం కలుగుతుంది" అన్నారు.

అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోనుంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారుకలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు.

ఆ పురుషుడు "అంగరాజా! ఈ పాయసపాత్రలో ఉన్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది" అని చెప్పాడు. పాయసపాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది.

ఇపుడు ఆ విఘ్నం పోయి సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి "వేనుడు" అని పేరు వచ్చింది.

జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడములో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు.

వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారి లేవడం పాపకృత్యములు చేయడం. ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక "నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిదనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకము చేశారు.

Address

C/O Sri Swami Sh*tal Das Seva Trust, B1/88, Pushkara Talab
Telangana
221005

Alerts

Be the first to know and let us send you an email when శ్రీమద్ భాగవత సప్తాహం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category