17/05/2021
🌸
వైశాఖ శుద్ధ పంచమి రోజున
శ్రీ భావ నారాయణ స్వామివారి
జయంతి శుభాకాంక్షలతో..
🌸
కృతయుగంలో
శ్రీ మహా విష్ణువు అవతారాలలోని
ప్రప్రథమ అవతారం ,
శ్రీమన్నారాయణుని అంశ
భృగు వంశ శ్రేష్ఠుడైన
భృగు మహర్షి మునిమనుమడు.
శ్రీ మార్కండేయుని పుత్రుడు ,
సూర్య దేవుని అల్లుడు.
యమధర్మరాజునకు , శనీశ్వరునికి
స్వయానా బావగారు.
ప్రప్రథమ వస్త్ర నిర్మాణ సృష్టికర్త.
బ్రహ్మ లోకము , శివ లోకము , విష్ణు లోకము , సూర్య మండల లోకములకు సశరీరంతో వెళ్లగలిగిన మహా తపో సంపన్నుడైన
భావన మహర్షి జయంతి మహోత్సవ పర్వదినం.
▫
సర్వ దేవతలకు ,
సకల మానవాళికి నగ్నత్వం నుండి
విముక్తి కలిగించదలచి
శ్రీ మహావిష్ణువు యొక్క నాభి యందలి
పద్మము నుండి తంతువులను గ్రహించి
ఓతము ( ఋగ్వేదం ) ,
పడుగు ప్రోతము ( అధర్వణ వేదము )
ప్యాక అను వేద సారము నుండి
యంత్రములు సృష్టించి ,
సూర్యపుత్రి భద్రావతీదేవి సమేతుడై
వస్త్ర నిర్మాణము కొరకై మణిపురమనే
ప్రత్యేక గృహము నిర్మించుకొని ,
చైత్ర శుద్ధ పంచమి రోజున ,
మొట్ట మొదటిసారిగా
లక్ష్మీ విలాసం అనే ఉత్కళ పౌష్టిక
వస్త్రములను నిర్మించి ,
మొదటగా విఘ్నేశ్వరునికి సమర్పించి
ఆశీస్సులు పొందిన అనంతరం
శ్రీ లక్ష్మీ నారాయణులకు సమర్పించగా , ఆనందభరితులై వారు సకల సంపదలు ఒసంగి
పద్మ బ్రహ్మ , పద్మశాలీ , బహోత్తమ,పద్మశాఖీ
అను బిరుదాంకితం చేసెను. అనంతరం ,
బ్రహ్మ సరస్వతులకు వస్త్రములు సమర్పించగా, వారు సంతోషమున 64 కళల సారస్వతమును
అఖండ బ్రహ్మ జ్ఞానమును ఒసంగెను.
అనంతరం శివ పార్వతులకు సమర్పించగా,
గౌరి దేవి మృత సంజీవని విద్య,
శాంభవీ విద్యలను అనుగ్రహించెను.
పరమశివుడు పులిచర్మం కోరగా,
పెద్దపులిని చూసి నఖః శిఖ పర్యంతం శుభ్రంచేసి, సుందరంగా సమర్పించెను.
అంతట, పరమేశ్వరుడు సంతోషించి
పెద్దపులి వాహనం, పెద్దపులి ధ్వజం అందించెను.
సకల దేవతలకు వారికి కూడా సమర్పించగా, సంతోషభరితులై వారు
ముప్పైఆరు బిరుదులు బహూకరించెను.
మహావిష్ణువు వేద శీర్షునకు
నూరు పద్మములు ఇచ్చెను.
వాటి ప్రసాదమున నూరు మంది మహర్షులు సంతానం కలిగిరి.
▫
శ్లో: అజరాశ్చతయోః పుత్ర
పౌత్రష్చ బహవో భవన్!
మార్కండేయ సమాఖ్యాతాః
ఋషయో వేద పారగా!!
▫
భావనారాయణునకు
పుత్రులు పౌత్రులు కలిగినవారు.
మార్కండేయుని వలె
అఖండ మేథాసంపన్నులై
ఋషుశ్రేష్టులు, వేద పారంగతులు,
భృగు బ్రాహ్మణ పద్మశాలీ వంశ
మూల పురుషులు అయ్యారు.
భావనారాయణుడు
ధర్మపత్నీ సమేతుడై కాలువాసురునితో
అతి భయంకర యుద్ధము చేసి
"మహా నారాయణ అస్త్రం"
ఉపయోగించి కాలువాసురుని సంహరించెను. అంతట సకల దేవతలు ప్రత్యక్షమై
పుష్పవర్షం కురిపించగా,
సకల జనులు జయధ్వానాలు పలికెను.
అంతట మహా విష్ణువు
ప్రత్యక్షమై ఇలా పలికెను.
▫️
ఓ భావనారాయణా!
నీకు ఒక వచనం ప్రతిజ్ఞ చేయుచున్నాను.
భృగు వంశమున పుట్టిన వారందరు
నా వంశము వారే.
నా మతము వారే అగుదురు.
▫
యువాంతు పద్మకోశియైః
పూజనీయ ద్విజాదిభిః
యోవైన పూజ్యతే తౌతు
మమ ద్రోహి భవేదృవం
▫
పద్మకోశమున ,
( భృగు బ్రాహ్మణ పద్మశాలీ)
పద్మ బ్రాహ్మణ కులమున పుట్టిన
వారందరు బ్రాహ్మణాది చాతుర్వర్ణములచే సమస్త కులములచే సమస్త జాతులచే పూజింపతగినవారై ఉన్నారు. అట్లు పూజింప తగిన మిమ్ములను పూజింపని వారు నాకు ద్రోహం చేసినవారే అవుతారు అని పలికెను.
శ్రీ భావనాఋషికి పుత్రులు
వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడినవారైరి.
వారి పుత్రులే మహాపద్ములు, పద్మశాఖీయులు, పద్మశాలీయులు, పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింపపడగా,
యుగయుగాల నుండి
సూర్యచంద్రులున్నంత వరకు
మనమందరం భృగు బ్రాహ్మణ పద్మశాలీయులుగా
పిలువబడుతున్నాము కనుక ,
ప్రతీ భృగు బ్రాహ్మణ పద్మశాలీ ...
మన పూర్వపు మహోన్నత కుల విశిష్టతను తెలుసుకొని , వైదిక ధర్మాలను ఆచరించి
సమాజంలో వెలుగొందాలని ఆశిస్తూ..
▫
జై పద్మశాలి !
జై జై పద్మశాలీ..
Tadipatri Markandeya Swamy Temple Tadipatri Markandeya Swamy Devasthanam Padmashali Sangham Tadipatri-బహుత్తమ పద్మశాలీయ సంఘం తాడిపత్రి Padmashali Family - పద్మశాలి కుటుంబం