Jwalamukhi Mahakali Temple, Peddapadu.

Jwalamukhi Mahakali Temple, Peddapadu. This Page is to Expose The Temple in Peddapadu and it’s Greatness.

18/02/2025

1- రాణి పద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి 14000 మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణం అయిన కామపిశాచి.. అల్లావుద్దీన్‌ని నేను మరచిపోలేదు.

2- ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు శంభాజీ మహారాజ్‌ను కౄరంగా చంపిన రక్తపిశాచి.. ఔరంగజేబును నేను మరచిపోలేదు.

3- ఒక్క రోజులో లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన ఉన్మాదజిహాదీ.. టిప్పు సుల్తాన్‌ని నేను మరిచిపోలేదు.

4- తన రాజభవనంలో 14 ఏళ్ల బ్రాహ్మణ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన తలారి.. షాజహాన్‌ని నేను మరిచిపోలేదు.

5- నా శ్రీరామ ప్రభువు మందిరాన్ని బద్దలు కొట్టి లక్షలాది మంది అమాయక హిందువులను చంపిన అనాగరిక.. బాబర్‌ని నేను మరిచిపోలేదు.

6- నాగర్‌కోట్‌లోని జ్వాలాముఖి ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని బద్దలుకొట్టి.. మాంసం తూకం వేయడానికి కసాయిలకు ఇచ్చిన రాక్షసుడు.. సికందర్ లోఢీ ని నేను మర్చిపోలేదు.

7- ఇస్లాంను అంగీకరించనందుకు మొఘల్ సైనికుల ముందు సంయోగితను నగ్నంగా విసిరేసిన జిత్తులమారి.. ఖ్వాజా మొయినిద్దీన్ చిస్తీని నేను మరిచిపోలేదు

8- కేవలం 7 సంవత్సరాలు & 5 సంవత్సరాల వయస్సులో ఉన్న గురు గోవింద్ సింగ్ యొక్క అమాయక పసి పుత్రులు ఫతేసింగ్ మరియు జోరావర్ ఇద్దరినీ.. ఇస్లాంను అంగీకరించనందుకు.. సజీవంగా గోడకు సమాధి చేసిన క్రూరమైన.. బజీర్ ఖాన్‌ను నేను మరచిపోలేదు.

9- బండ బైరాగి చర్మాన్ని వేడి ఇనుప కడ్డీలతో ఎముకలు కనిపించే వరకు కాల్చివేసిన జిహాదీ.. బజీర్ ఖాన్‌ని నేను మరచిపోలేదు.

10- ఇస్లాం మతంలోకి మారనందుకు హేము యొక్క 72 ఏళ్ల ఆత్మగౌరవం కలిగిన వృద్ధ తండ్రిని తల నరికి చంపిన నీచుడైన.. అక్బర్‌ని నేను మరచిపోలేదు.

11- ధర్మవీర్ భాయ్ మతిదాస్ ఇస్లాంను అంగీకరించనందుకు మధ్య కూడలిలో సిలువ వేసిన ఆ క్రూరమైన.. ఔరంగజేబును నేను మరచిపోలేదు.

హిందువులపై జరిగిన అఘాయిత్యాలను వివరించడానికి పదాలు మరియు పేజీలు చిన్నవి.

 #అష్టాంగ_నమస్కారము లేదా  #సాష్టాంగ_నమస్కారము.నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతానికి చెందిన నమః అనే పదం...
12/12/2024

#అష్టాంగ_నమస్కారము లేదా #సాష్టాంగ_నమస్కారము.

నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతానికి చెందిన నమః అనే
పదం నుంచి నమస్కారం అన్న పదం ఏర్పడిననది. సంస్కృతంలో నమః అంటే విధేయత ప్రకటించామని అర్ధం. మనషు లందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు.

నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటివ్యక్తిలోని ఆత్మను
గుర్తించి, దానికి విధేయత ప్రకటించడం. ఇది అధ్యాత్మిక పరమైన వివరణ. శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతుల వేలికొసలు ఒకదానికొకటి తాకుతాయి. మనం చేతివేళ్ల కొనలకు కళ్ళు,చెవి,మెదడులతో సంబంధం ఉంటుంది.

నమస్కారం చేసేటప్పుడు వేలికొనలు పరస్పరం ఒత్తుకోవడం వలన కళ్ళు, చెవి, మెదడు యొక్క కేంద్రాలు ఉత్తేజమవుతాయి. దానితో కళ్ళకు ఎదురుగావున్న వ్యక్తిని మెదడు ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడం. వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం జరుగుతుంది. అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి నమస్కారం పెడితే వాళ్ళు మనకు ఎక్కువకాలం గుర్తుండిపోతారని అర్థం.

నమస్కారం అనేది మన సంస్కృతి,సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం. తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి. మంచి నమస్కారం ఎలా ఉండాలంటే, మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష.

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయ పూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటివారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.

★శివునకు, విష్ణువుకు నమస్కరించేటపుడు తలనుంచి 12 అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. శివకేశవుల్లో ఏ భేదం లేదని చాటడానికి ఇది గుర్తు. హరిహరులకు తప్ప, మిగతా దేవతలకు శిరసుమీద చేతులు జోడించి నమస్కరించకూడదు.

★గురువునకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.

★తండ్రికి, ఇతర పెద్దలకు నోరుకు ఎదురుగా చేతులు జోడించాలి.

★తల్లికి నమస్కరించేటపుడు చాతికి ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి.

★యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.

నమస్కారంలోని ఈ అంతర్గతం భారతీయ హిందూసంస్కృతిలో నమస్కారం ఒక విశిష్ట ప్రక్రియ.

★ఒకరికొకరు ఎదురైతే రెండుచేతులు జోడించి హృదయస్థానం దగ్గర ఉంచి, నమస్కారం చెప్పడం హిందువు అలవాటు. మామూలుగా చూస్తే నమస్కారం చేయడం అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం.

★సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. స్త్రీలు చేయకూడదు. పురుషులు తమ ఎనిమిది అంగాలను అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆనించి నమస్కరించడం.
★స్త్రీలను సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదని మన పెద్దలు చెప్పారంటే... స్త్రీ ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయడంవల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.

★సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము అని అర్ధం.
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా౹ పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఈరితః౹౹

★అష్టాంగాలు :- అంటే
"ఉరసా" అంటే తొడలు,
"శిరసా" అంటే తల,
"దృష్ట్యా" అనగా కళ్ళు,
"మనసా" అనగా హృదయం,
"వచసా" అనగా నోరు,
"పద్భ్యాం" అనగా పాదములు,
"కరాభ్యాం" అనగా చేతులు,
"కర్ణాభ్యాం" అంటే చెవులు.
ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటారు. అందుకే, దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి, ఆయా అంగములు నెలకు తగిలించాలి.

ఇలా చేయడంవల్ల మనం చేసినటువంటి పాపాలను దేవుడు క్షమింస్తాడు.
★ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ, నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో - నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనఃస్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే
ఓం నమో నారాయణాయ౹ లేదా
ఓం నమశ్శివాయ౹ అనో
అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం అంటే నమస్కార ప్రక్రియలో రెండు-పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం అంటే నమస్కారం చేసేటపుడు రెండు-చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

😎 జానుభ్యాం అంటే నమస్కారం చేసేటపుడు రెండు-మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

నమస్కారం అన్నది సత్యగుణమైనది. అవకాశం ఉన్నంతవరకు ఎదుటివ్యక్తికి
మంచి-మనస్సుతో చేతులు జోడించి, నమస్కంరించడం
మంచిది. నమస్కారం ఒక మంచి సంస్కారం దీనిని మనం అందరం పాటిదాం.
ఎదుటవారికి నమస్కరించటంతో మన-విలువే పెరుగుతుంది.
ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ, మన-పిల్లలకూ నేర్పిద్దాం.
🙏శ్రీ మాత్రే నమః🙏

ముగ్గుతో ప్రతి రోజూ పండుగే!పండుగలు వస్తాయి, వెళ్లిపోతాయి. కానీ కొన్ని సంప్రదాయాలను మాత్రం పండుగలు పబ్బాలతో సంబంధం లేకుండ...
07/11/2023

ముగ్గుతో ప్రతి రోజూ పండుగే!

పండుగలు వస్తాయి, వెళ్లిపోతాయి. కానీ కొన్ని సంప్రదాయాలను మాత్రం పండుగలు పబ్బాలతో సంబంధం లేకుండా నిత్యం పాటిస్తూనే ఉంటాము. వాటిలో ముఖ్యమైనది ముగ్గు వేయడం. ఇంట్లో ఏదన్నా అశుభం జరిగితేనో, ఇంటిల్లపాదీ ఊరికి వెళ్తేనో తప్ప, ఇంటి ముందర ముగ్గు వేయడం మానరు తెలుగువారు. మన ఇళ్లలోని ఆడవారు అలవోకగా వేసే ముగ్గు వెనుక వందల ఏళ్ల నుంచి నిలిచి ఉన్న సంస్కృతి కనిపిస్తుంది. ఆ సంస్కృతి వెనుక పదుల కొద్దీ కారణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని.

- బియ్యపు పిండితో ముగ్గుని వేయడం వల్ల మన చుట్టూ తిరిగే పిచుకలు, ఉడతలు, చీమలు వంటి చిన్నచిన్న ప్రాణులకు ఆహారాన్ని కల్పించినట్లు అవుతుంది. గృహస్థు తన నిత్య జీవితంలో తెలిసీ తెలియకుండా ఎన్నో ప్రాణులకు హాని కలిగిస్తూ ఉంటాడు. తనకు తోచిన రీతిలో వాటికి తిరిగి ఆహారాన్ని అందించడం వల్ల అలాంటి పాపాలకు పరిహారం లభిస్తుంది.

- కొందరు ముగ్గు వేయడానికి రాతిపిండిని వాడతారు. సున్నపు రాళ్లతోనో, నత్తగుల్లలతోనో తయారుచేసే ఈ పిండితో ముగ్గు వేసినా మనకి ప్రయోజనమే! ఈ పిండి ఘాటుకి సూక్ష్మక్రిములు ఇంటి బయటే నిలిచిపోతాయి. ముగ్గుపిండికి కార్బన్‌ డై అక్సైడ్‌ వంటి మలినాలను పీల్చుకునే గుణం ఉంటుంది.

- ముగ్గు వేయడం వల్ల ఇంటికి నిండుదనం వస్తుంది. తరచూ ఇంటి లోపలికీ బయటకీ తిరిగే మనకి ముగ్గుని దాటుకుని వెళ్తున్నప్పుడల్లా మనసు నిండుగా ఉంటుంది. ఇంటి ముందర నుంచి వెళ్లేవాళ్లకి కూడా ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తుంది.

- ముగ్గులని మన ప్రాచీన ఖగోళశాస్త్రంగా భావించేవారు కూడా లేకపోలేదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలకీ, గ్రహాలకీ, రాశులకీ సూచనగా ముగ్గులు వేయడం మొదలు పెట్టి ఉంటారన్నది కొందరి నమ్మకం. ముగ్గులు ఖగోళానికి సూచన అయినా కాకపోయినా, ఆకాశంలోని తారలు తప్పకుండా నేల మీద ముగ్గులు వేసేందుకు ఒక ప్రేరణగా నిలిచి ఉంటాయి.

- ముగ్గులు అప్పటి సందర్భానికి ఒక సూచనగా కూడా ఉంటాయి. సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నదానికి గుర్తుగా సంక్రాంతి రథం ముగ్గు వేస్తారు. యజ్ఞవాటికలకి ఒక విధంగా, వధూవరుల దగ్గర ఒక విధంగా ముగ్గులు వేస్తారు. ఇక ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మను ఉంచితే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం.

- గణితాన్ని సృజనతో అనుసంధానించే గొప్ప కళ ముగ్గు. లెక్క ప్రకారం చుక్కలు పెట్టి, వాటిని కలుపుకుంటూ వేసే ముగ్గుకి ఎలాంటి కొలబద్దలూ, కంపాస్‌లూ అవసరం లేదు. ఒక ముగ్గులో ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎన్ని గీతలు గీయాలి అనే అంశాలతో మన పూర్వీకులు కావల్సినంత సంఖ్యా జ్ఞానాన్ని అలవర్చుకుని ఉంటారు.

- ముగ్గు వేసే విధానం ఒక మనిషిలోని సృజనశక్తినే కాదు, వారి మనస్తత్వాన్ని కూడా చెబుతుంది. మన పెద్దలు ఒక అమ్మాయి ముగ్గు వేసే విధానాన్ని బట్టి ఆమె మనస్తత్వాన్ని ఊహించేవారు. ముగ్గుని సన్నటి గీతలతో వేస్తే ఆమె పొదుపరి అనీ, ముగ్గుని వీలైనంతగా అలంకరిస్తే ఆమె అలంకార ప్రియురాలనీ అనుకునేవారు. అయితే ఒకరిలోని సృజనని వ్యక్తపరిచేందుకు ముగ్గు కూడా ఒక సాధనమే అని మాత్రం ఎవరైనా ఒప్పుకోక తప్పదు.

- ముగ్గులు దుష్టశక్తులను తరిమివేసే యంత్రాలు అని భావించేవారు కూడా లేకపోలేదు. తాంత్రికులు కూడా ముగ్గు లేకుండా సాధన చేయరు. ఆ దుష్టశక్తుల సంగతేమో కానీ, అందమైన ముగ్గుని చూసినప్పుడు మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయనడంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు!

చేతులతో తినడం అనాగరికమా?భారతీయులు ఆహారం తినే విధానం చూసి పాశ్చాత్యులకి ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఫోర్కులూ, స్పూన్ల...
07/11/2023

చేతులతో తినడం అనాగరికమా?

భారతీయులు ఆహారం తినే విధానం చూసి పాశ్చాత్యులకి ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఫోర్కులూ, స్పూన్లూ లేకుండా వీళ్లు ఒట్టి చేతులతో ఎలా తింటారబ్బా అనుకుంటారు. అలా చేతులతో ఆహారం తీసుకోవడాన్ని అనాగరికంగా పరిగణించేవాళ్లు కూడా లేకపోలేదు. ఆహారాన్ని వేళ్లతో తినడం అనాగరికత కాదు సరికదా ఆరోగ్యమేనని చెప్పేందుకు ఒకటి కాదు వంద కారణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని…

- భారతీయుల ఆహారం చప్పిడిగా ఉండదు. ఉప్పు, పులుపు, కారాలతోపాటు మసాలాలు దండిగా ఉంటాయి. వీటికి లోహం తగలగానే రుచిలో తప్పకుండా మార్పు వచ్చేస్తుంది. అంతేకాదు! ఆహారపదార్థాలలో ఉన్న నూనె, ఉప్పు లోహంతో చేసిన స్పూన్లతో కలిసినప్పుడు ప్రతిచర్య ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేనా! నోట్లోకి రుచికరమైన ఆహారంతో పాటు స్పూను కూడా ప్రవేశించినప్పుడు కమ్మటి రుచి కాస్తా కటువుగా మారిపోతుంది.

- ఆయుర్వేదం ప్రకారం మన శరీరం పంచభూతాల సమూహం. మన చేతికి ఉండే అయిదు వేళ్లలో ప్రతి ఒక్క వేలిలో ఒకో తత్వం ప్రస్ఫుటంగా ఉంటుంది. బొటనవేలిలో అగ్నితత్వం, చూపుడు వేలులో వాయుతత్వం, మధ్యవేలిలో ఆకాశం, ఉంగరం వేలిన పృథ్వి, చిటికెన వేలిన జలతత్వం ఉంటాయట. ఈ అయిదు వేళ్ల స్పర్శా తగిలినప్పుడు ఆహారంలోని జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

- స్పూన్లు, ఫోర్కులని ఎంతగా కడిగినా అవి శుభ్రంగా ఉన్నాయని చెప్పలేము. వేడివేడి నీళ్లలో నిరంతరం ఉంచితే తప్ప అవి క్రిముల నుంచి దూరంగా ఉన్నాయన్న నమ్మకం కలగదు. కానీ శుభ్రంగా కడుక్కున్న చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సూక్ష్మక్రిములూ మన జీర్ణాశయంలోకి చేరకుండా చూడగలం.

- వేళ్లతో తినడంలో కనిపించని వ్యాయామం ఇమిడి ఉంటుంది. అన్నాన్ని దగ్గరకి తీసుకోవడం, వేర్వేరు పదార్థాలను కలుపుకోవడం, ముద్దలుగా చేసుకోవడం మొదలుకొని ముద్దని నోట్లోకి చేర్చడం వరకూ ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. దీని వల్ల అరచేతిలోనూ, వేళ్లలోనూ రక్తప్రసరణ మెరుగవుతుంది.

- చేతి వేళ్లకి ఉండే స్పర్శజ్ఞానం వల్ల ఆహారం ఎంత ఉష్ణోగ్రతలో ఉందో తెలియడమే కాదు… దానికి మరింత రుచిని, తినడంలోని తృప్తిని అందిస్తుంది. ఆహారాన్ని తీసుకున్న చేతివేళ్లు పెదాలకి తగలగానే, ఆ స్పర్శకి నోట్లో లాలాజలం త్వరగా ఊరుతుందట.

- భారతీయుల ఆహారం అంటే బ్రెడ్డూ, సాండ్‌విచ్‌లు మాత్రమే కాదు. రోజుకో వంటకం చేసుకున్నా జీవితాంతం తరిగిపోని పాకశాస్త్రం మన సొంతం. వీటిలో ఎక్కువ శాతం వంటకాలు వేళ్లతో తినడానికి మాత్రమే సౌకర్యంగా ఉంటాయి. అందుకే ఎన్ని పరికరాలను వాడినా, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా… చేతి వేలుని మించిన ప్రత్యామ్నాయం దొరకదు. పరికరాలతో తినే ఆహారం యాంత్రికంగానే ఉంటుంది!

- భారతీయులు వంటలను యాంత్రికంగా చేసుకోరు. ఏదో ఆకలి తీరడానికన్నట్లుగా కాకుండా తమ వంటకాలు రుచిగా, వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటారు. అవి పంచేంద్రియాలనూ తృప్తి పరచాలనుకుంటారు. అందుకే మన వంటకాలు కమ్మటి వాసనతో, కంటికి ఇంపుగా ఉంటాయి. వాటికి స్పర్శ కూడా తోడైతేనే పరిపూర్ణత! చేతులతో తినడం ద్వారా ఆ పరిపూర్ణతని సాధిస్తాం.

ఆలయాలలో గంట ఎందుకు మోగిస్తారు?మన దేవాలయాల నుంచి వచ్చే ఘంటారావాలను వినడం ఓ అద్భుతమైన అనుభవం. అల్లంత ఎత్తున ఉన్న గంటను అంద...
07/11/2023

ఆలయాలలో గంట ఎందుకు మోగిస్తారు?

మన దేవాలయాల నుంచి వచ్చే ఘంటారావాలను వినడం ఓ అద్భుతమైన అనుభవం. అల్లంత ఎత్తున ఉన్న గంటను అందుకోవడం పిల్లలకు సరదా అయితే పెద్దలకు ఓ ఆచారం. ఇంతకీ ఈ ఘంటారావం వెనుక ఏదన్నా శాస్ర్తీయత ఉందా అంటే చాలా జవాబులే లభిస్తాయి. దేవాలయంలోకి అడుగుపెట్టే సమయంలో మన మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. పైగా ఏదన్నా బాధలోనో, తీరని వ్యధతోనో ఆలయంలోకి ప్రవేశించేవారే ఎక్కువమంది. అలాంటి మనసుని ఒక్కసారిగా మేల్కొలిపి ‘వచ్చిన పని చూడు’ అని హెచ్చరిస్తుంది ఘంటానినాదం. అంటే అన్యమనస్కంగా ఉన్న మన దృష్టిని ఒక్కసారిగా దేవుని మీదకి మరలుస్తుందన్నమాట. గంటలో ఉండే కంచు, రాగి వంటి లోహాలు అన్నీ కలిసి ఓ చిత్రమైన శబ్దాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాలలో ఈ శబ్దం ఓంకార నాదాన్ని పోలి ఉంటుంది. ఆ శబ్దాన్ని వినగానే మనసంతా మనసు భక్తి భావనలతో నిండిపోతుంది.

మనం గంటను మోగించగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోదు. కొన్ని సెకన్ల పాటు దాని శబ్ద తరంగాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ తరంగాలు మన షట్చక్రాల మీదా పనిచేస్తాయని నమ్మకం. శ్రావ్యమైన ఈ ఘంటారావాలు గుడి ఉన్న ప్రతి చోటా ఆధ్మాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. పండుగలు, పర్వదినాలలో దేవాలయాల నుంచి నిరంతరం వినిపించే ఘంటానాదాలు చుట్టుపక్కల ప్రజలలో భక్తిభావాన్ని నింపి ఉంచుతాయి. గంటను మోగించడం అంటే దేవునికి మన రాకను తెలియచేయడమే కాదు… ‘తండ్రీ! నీ శరణు కోరి, నీ ముందు నిల్చొని ఉన్నాను’ అని సవినయంగా వేడుకోవడమే!

ఇళ్లలో పూజని చేసుకునేటప్పుడు కూడా గణపతిని ప్రార్థించిన తరువాత…
అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్..
అంటూ గంటని మోగిస్తాము. దైవిక శక్తులను మేల్కొలుపుతూ, చుట్టూ ఉన్న దుష్టశక్తులను పారద్రోలుతూ ఘంటానాదంతో, తాను దేవతలను ఆహ్వానిస్తున్నానని దీని అర్థం. దైవిక శక్తులు అంటే మనలోని ధార్మిక భావనలు అని పెద్దల అంతరార్థం కావచ్చు. పైగా, అలికిడి ఉన్న ప్రదేశాలలో ఎలాంటి పురుగూ పుట్రా తిరగడానికి ఇష్టపడవు. మన దేవాలయాలన్నీ ఒకప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండేవి. ఇప్పటికీ చాలా గుళ్లలోని గర్భాలయాలు చీకటిగా ఉంటాయి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండటం వల్ల, విషకీటకాలు ఆయా ప్రాదేశాలకి దూరంగా ఉంటాయి.

నందికి ఎందుకంత ప్రత్యేకత!     శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండ...
07/11/2023

నందికి ఎందుకంత ప్రత్యేకత!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? కాదంటోంది ఆయన చరిత్ర! ఈ కార్తీకమాసం సందర్భాన ఒకసారి ఆ నందీశ్వరుని తల్చుకుందాం…

పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి, ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. `నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి` అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు `తథాస్తు` అంటూ వరాన్ని అనుగ్రహించాడు.

శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి `నంది` అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట! బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ `దీర్ఘాయుష్మాన్భవ` అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు!

నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భివిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. `శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు` అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా `అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ` అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు.

ఆనాటి నుంచీ శివుని ద్వారాపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు.

నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు!

దీపారాధన :-                       “దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్                     దీపేన సాధ్యతే సర్వం దీప ల...
07/11/2023

దీపారాధన :-
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”

దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించటాన్ని దీపారాధనం అంటాం . దేవుడిని ఆరాధించటానికన్న ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్న మాట. ముందు దీపం వెలిగించటమే కాదు షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం దీపం నైవేద్యం అయినా తప్పవు. దీపం దేవతల ముఖమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు.

దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించట మంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం . దీపాలు వెలిగించటం అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు. నేతి దీపాలు కావచ్చు. నూనె దీపాలు కావచ్చును.
మన పెద్దలు దీపారాధనకు సంబంధించి ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు.

“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”

“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుండి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని, ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టేప్పుడు అనుకుంటాం. ఎంత గొప్ప భావన! ఎంతటి ఉదాత్తమైన ఆలోచన!! పెట్టేది చిన్నదీపం. ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని . అంతే కాదు. నరకం నుండి రక్షింపబడాలట.

మూడు వత్తులు ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరు అడ్డవత్తులు బొడ్డు వత్తులు అని చేసి, ప్రమిదలో ఒక అడ్డ వత్తి, ఒక బొడ్డు వత్తి వేస్తారు ప్రత్యేకంగా ఐదు పోగులతోనూ, తొమ్మిది పోగులతోనూ, కమల వత్తులని ఎనిమిది పోగులతోనూ, ఇంక అనేక రకాల వత్తులు చేస్తారు. అంతే కాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఆవునెయ్యి [దేశ వాళీ] శ్రేష్ఠం. ఆవు నేతిలో పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది. తెల్లని గోడలు బంగారు మలాము చేసినట్టుంటాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చుని జపమైనా, పూజైనా చేస్తే ఏకాగ్రత కుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. దీపం వెలిగించినప్పుడు ఆ దీప శిఖలు దక్షిణా వర్తంగా, అంటే, కుడి వైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభమని నమ్మకం.

ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేప్పుడు-విద్యుద్దీపాలు లేనప్పుడు - చేతితో దీపం పట్టుకుని చూపించుతాము కదా! అదే విధంగా దేవుడు ఉరేగేప్పుడు కాగడా పట్టుకుంటాము.

లోకాలకి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సంప్రదాయం.

లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. అందుకే తమిళులు లక్ష్మీ పూజ దీప స్థంభానికే చేస్తారు. వారు మీనాక్షీ దీపాలని అమ్మవారి ప్రతిరూపం ఉన్న దీపపు కుందులను ఉపయోగిస్తారు.

*మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..........!!* *ఉగాది:-*  కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. *శ్రీర...
16/01/2023

*మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..........!!*

*ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

*శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

*అక్షయ తృతీయ:-* విలువైన వాటిని కూడబెట్టుకోమని.

*వ్యాస (గురు) పౌర్ణమి 😗 జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

*నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

*వరలక్ష్మి వ్రతం 😗 నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

*రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

*వినాయక చవితి ( నవరాత్రులు ) 😗 ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

*పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

*దసరా ( ఆయుధ పూజ) 😗 ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

*దీపావళి 😗 పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

*కార్తీక పౌర్ణమి 😗 చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

*సంక్రాంతి 😗 మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

*మహాశివరాత్రి 😗 కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

*హోలీ 😗 వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
*👉రెండు ఏకాదశిలు*,
*👉సంకష్ట హర చతుర్థి*,
*👉మాస శివరాత్రి,*
*👉ప్రాదోశ వ్రతం,*
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి.....

*👉ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.*

*ఇదే నా ధర్మం గొప్పతనం***

తెలుగు భాష గొప్పదనంతెలుగు మాతృభాషగా గలిగినవారు, తెలుగు అభిమానులు, తెలుగును గురించి తెలుసుకోవాలని అనుకొనేవారికోసం తెలుగుక...
29/11/2022

తెలుగు భాష గొప్పదనం

తెలుగు మాతృభాషగా గలిగినవారు, తెలుగు అభిమానులు, తెలుగును గురించి తెలుసుకోవాలని అనుకొనేవారికోసం తెలుగుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

1. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు నుండి తెలుగు వాడుకలో ఉన్నది.

2. అంతర్జాతీయ అక్షర సంఘం 2012 లో తెలుగును ప్రపంచంలోని రెండవ ఉత్తమ అద్భుత లిపిగా ఎంపిక చేసింది. కొరియన్ భాష మొదటి స్థానంలో నిలిచింది.

3. తెలుగు భాషను మాట్లాడటం వలన మన శరీరంలోని 72000 నాడులు ఉద్దీపనం చెందుతాయని, ఇది అన్ని భాషాలకన్నా చాలా ఎక్కువ అని సైన్సు నిరూపించింది.

4. శ్రీలంక లోని శ్రీలంక జిప్సీ తెగవారు అందరూ తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో అనేక చోట్ల తెలుగు వాడుకలో ఉన్నది. గూగుల్ లో అనేక వివరాలు పొందుపరిచారు.

6. 16వ శతాబ్దంలో నికోలో డి కొంటి అనే ఒక ఇటాలియన్ భాషావేత్త తెలుగు భాషలో పదాలు అచ్చులుతో అంతమవుతాయి, ఇటాలియన్ భాషలోలాగ, అందుచే తెలుగును తూర్పు ఇటాలియన్ భాషగా అభివర్ణించారు.

7. భారత్ లో 7.5 కోట్ల మంది మాట్లాడే తెలుగు 3వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 15వ స్థానంలో అత్యధికంగా జనులు మాట్లాడే భాషగా ప్రసిద్ధిగాంచినది.

8. తెలుగు త్రిలింగ అనే పదం నుండి పుట్టింది. మూడు లింగముల ప్రదేశము. హిందూ సిద్ధాంత ప్రకారం- కోస్తాలోని భీమేశ్వరం, తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం లోని మూడు చోట్ల శివుడు లింగరూపంలో ఆవిర్భవించి ఉండటంతో త్రిలింగదేశం అని వచ్చింది. ఇక్కడి భాష త్రిలింగ భాష తెలుగు అయింది.

9. తూర్పు ప్రపంచభాషలలో హ్రస్వాంత శబ్దంతో ప్రతీ పదం అంతమయ్యే భాష తెలుగు భాష ఒక్కటే.

10. తెలుగు భాషలో లెక్కలేనన్ని నుడికారములు, సామెతలు ఉన్నాయి.

11. తెలుగును పూర్వం తెనుంగు అని, తెలుంగు అనీ అనేవారు.

12. రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో, తెలుగు భారతీయ భాషలో కెల్లా మధురమైన భాష.

13. సుమారు 200 సంవత్సరాల క్రితం సుమారు 400 మంది తెలుగు వారు తోటపని వారుగా మార్షియస్ వెళ్లగా, ప్రస్తుత అక్కడి ప్రధాని ఆ సంతతి వారే అయ్యారు.

14.ఏ భాషలోనూ లేనివిధంగా తెలుగులో 40 శ్లోకాలు తో రామాయణం పలుకగా, అవే శ్లోకాలు వెనకనుండి చదివితే మహాభారతం అవుతుంది.

15. శ్రీకాకుళం లోని దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించి స్వామిని సేవిస్తూ, అక్కడే ఆముక్తమాల్యద అనే సాహిత్య గ్రంధాన్ని అక్కడి ప్రభువు ఆంధ్ర విష్ణువు ఆదేశానుసారం రచించి, "దేశభాషలందు తెలుగు లెస్స " అని ప్రవచించి అక్కడ తెలుగు ను అధికార భాషగా చేసి ఉత్తర్వులను ఇచ్చారు.

16. ఒకే అక్షరంతో వ్రాసే ఏకాక్షర పద్యములు తెలుగులోనే ఉన్నాయి.

మహా ఋషులు కొనియాడిన భాష తెలుగు భాష.

తెలుగు వాడివి అయినందుకు ఆనందించు. ( గర్వం మంచిది కాదు ).

సర్వే జనాః సుఖినోభవంతు.

ఆ రోజులు మళ్ళీ రావు.టైం మెషిన్ లో 60 ఏళ్ల క్రితంఅర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగి...
29/11/2022

ఆ రోజులు మళ్ళీ రావు.

టైం మెషిన్ లో 60 ఏళ్ల క్రితం

అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మొగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం (పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్ లు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసాన్నాలు, SLO, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

రాత్రిపూట7, 8 గంటలకు మాదాకాలం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకాళo అబ్బాయికిచేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది. అప్పుడప్పుడూ ఇడ్లీలు, పూరీలు.

ప్రతిరోజూ ఉదయం పూట చద్దిఅన్నంలో చింతకాయ లేదా గోంగూర, ఉసిరికాయ పచ్చడి, మజ్జిగ..

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి RMP డాక్టర్స్ ఉండే వారు. వాళ్లు చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెంద్రాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.

కర్మ ఫలంకురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వంద మంది పుత్రులను పోగొట్ట...
29/11/2022

కర్మ ఫలం

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు..

ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు..? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు..? ఈరోజు తనకి వంద మంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు...

"ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు.. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ.

యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు).. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మ బంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది.., వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింప చేస్తుంది.. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు.. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి.. "ఓ రాజా! వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు... అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచి పెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం..

ఓం నమో భగవతే వాసుదేవాయ

Address

Peddapadu
Peddapadu
524225

Telephone

+918074980467

Website

Alerts

Be the first to know and let us send you an email when Jwalamukhi Mahakali Temple, Peddapadu. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category