21/10/2021
👉 Gospel Tract is ready to get Printed, below is the copy which is in Telugu Language which includes Gospel of Christ, Plan of Salvation and About One True New Testament Church, The Church of Christ. If Lord's will, I'm thinking of Printing 10,000 copies which Come's in Glossy Paper, colorful, pictured which surely will grab the attention of the Reader. By doing so, the Message of Salvation will surely reach thousand's of People, Targetting both Non-Christians and Denominations as well. Keep praying for this Good work.
Thanks so much.
In Christ,
Bro.Y.Ashok Chakravarthi,
Evangelist at Central Church of Christ
Miryalaguda Town, India.
“ సంపాదించి, కూర్చుకొని, తిని, త్రాగి, సుఖించి, సంతోషించుటకేనా.. ఈ జీవితం..?”
ప్రియ స్నేహితుడా ఆలోచించు....!
నేడు మనిషి తన ముందున్న ప్రకృతిని అణువణువునా పరిశీలించి పరిశోధిస్తున్నాడు. కానీ, తన గురించి తన బ్రతుకు పరమార్ధం గురించి తెలుసుకోనకుండా చనిపోతున్నాడు. నరుని ఆయుష్షు పరిమితి గలది. ఇళ్లు,ఆస్తులు, భార్యా, పిల్లలు, అన్నీ సంపాదించుకుని, చివరకు మరణములో వాటన్నింటిని విడిచిపెట్టి వెళ్లి పోవటం విచిత్రంగా లేదూ....! ఇదేనా జీవితం అంటే? నీ ఆత్మ నీ దేహమును విడిచిన తరువాత ఏమైపోతుంది? ఎక్కడికి పోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా?
నీ మరణమునకు ముందే నీవు తెలుసుకోవలసిన ముఖ్య సంగతులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి, ఆసక్తితో చదువగలరు.
“… దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను …” (ప్రసంగి 7:29) శిశువుల్లో ఎటువంటి పాపము లేదు. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, ఇలాంటి వారిదే పరలోకరాజ్యమని యేసుక్రీస్తు వారు సెలవిచ్చియున్నారు(మత్తయి 19:14, మార్కు 10:14). అయితే వయస్సు వచ్చిన తరువాత మానవుడు పాపిగా మారుచున్నాడు. “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.” (రోమా 3:11,12). “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమా 3:23) ఈ లేఖనాలు ప్రతి మానవుడు కూడా పాపము చేయుట ద్వారా మనుష్యుడు పాపిగా మారుచున్నాడని తెలియజేయచున్నవి.
అయితే స్త్రీయని, పురుషుడని, ఒక కులమని, ఒక జాతి అని భేదము లేకుండా అందరూ పాపము చేయుట ద్వారా పాపి అగుచున్నారని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి వయస్సు వచ్చిన ప్రతి మనిషి కూడా పాపియే, ఎందుకంటే లేఖనము పాపమును ఈ క్రింది విధముగా నిర్వచించినది.
👉 ప్రశ్న (1) :- పాపము యొక్క నిర్వచనము ఏమిటి?
1. ఆజ్ఞాతిక్రమమే పాపం:
“పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.” – 1వ యోహాను 3:4
దేవుడు మానవులకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చియున్నాడు. నర హత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగువానిది ఆశింపకూడదు మొ. చెడు కార్యములు … ఎవరైనా సరే వీటిని మీరు ప్రవర్తించిన యెడల అనగా నర హత్య చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా వారు పాపిగా మారుతున్నారు.
2. ఇతరులకు మేలు చేయగల స్థితిలో ఉండి చేయకపోవడం పాపం:
“కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగున చేయనివానికి పాపము కలుగును.” – యాకోబు 4:17
అనగా మన దగ్గర ఒక 100 రూపాయలు వున్నాయనుకోండి, ఇతరులకు అవసరానికి 10 రూపాయలు ఇవ్వగల స్థితిలో ఉన్నాం, కానీ అలా ఇవ్వనప్పుడు మనము పాపము చేయుచున్నాము. ఈ లోకరీతిగా చుస్తే మన ధనం మన ఇష్టం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది పాపము! ఎందుకనగా, మనం పుట్టినప్పుడు వట్టి చేతులతో ఈ లోకములోనికి వచ్చాము, ఆయనే మనకు ఆరోగ్యం, ఆహారం, జ్ఞానం, అవకాశాలు ఇచ్చియున్నాడు, మనం నరహత్య, దొంగతనం, వ్యభిచారం చేయకపోయినా ఇతరులకు మేలు చేయగల స్థితిలో యుండి చేయకపోవడం ద్వారా పాపిగా మారుచున్నాం. ఈ నిర్వచనాన్ని బట్టి ఎక్కువ మంది పాపులగుచున్నారు.
3. సకల దుర్నీతియు పాపము: దుర్నీతి అనగా దేవుని యెడలను, ఇతర మానవుల యెడలను, దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణము ప్రకారం నడవక పోవడం దుర్నీతి. “సకల దుర్నీతియు పాపము…” (1వ యోహాను 5:17) అనగా మన అప్పులను చెల్లించకుండా ఉండటం, తన తల్లిదండ్రుల ఆకలిని అవసరాలను తీర్చక పోవడం, ఇతరుల యెడల మరియు స్థానిక సంఘములో మన బాధ్యతలను నెరవేర్చక పోవడం; వీటి వలన కొంత మంది పాపులుగా మారుచున్నారు.
4. విశ్వాస మూలము కానిది పాపము: మన జీవితం విశ్వాస సంబంధముగా జీవించకుండా ఉండటం పాపము. ఎందుకంటే, దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించుచున్నాడు.
కాబట్టి మనము విశ్వాసము సంబంధముగా జీవించాలి. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.(రోమా 14:23).
పై నిర్వచనాలను బట్టి ప్రతి మానవుడు కూడా ఎదో ఒక నిర్వచనాన్ని బట్టి పాపిగా మారుచున్నాడు. అయితే ఈ మానవుని యొక్క పాపాలు పోవాలంటే “బాప్తిస్మము” పొందాలని లేఖనము చెప్పుచున్నది. శిశువుల్లో పాపము లేదని లేఖనాలు తెలుపుతున్నాయి(ప్రసంగి 7:29, మత్తయి 19:14, మార్కు 10:14) కాబట్టి వారికి బాప్తిస్మము అవసరం లేదు.
“గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.” (అపో. కా 22:16) కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మము పొందుట ద్వారా పాపములను కడిగివేసుకొనగలరు. “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” (అపో. కా 2:38).
👉 ప్రశ్న (2) :- పాపములు కడిగివేసుకొనుటకు నేను ఏమి చేయాలి? లేదా [రక్షింపబడుటకు నేను ఏమి చెయ్యవలెను?]
విశ్వసించు వాడు నిత్యజీవము గలవాడని లేఖనాలు చెప్పుచున్నవి. కాబట్టి ఆ విశ్వాసం రావాలంటే మొదటిగా వినాలి.
1. Hear the word of God - దేవుని వాక్యమును లేదా క్రీస్తును గూర్చిన మాటలు వినాలి (రోమా 10:17)
“కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
– రోమా 10:17. తండ్రియైన దేవుడు (యెహోవా) – తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపాడని నమ్మాలి. తండ్రియైన దేవుని వద్దకు (పరలోకానికి) క్రీస్తే మార్గము అని గ్రహించాలి.
సువార్త నిర్వచనం : మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. 1కోరింథీయులకు 15: 1,
మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. 1కోరింథీయులకు 15: 2,
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, 1కోరింథీయులకు 15: 3,
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. 1కోరింథీయులకు 15: 4.
సువార్త అర్ధం : మంచి వార్త లేదా దేవుని రాజ్యమును గూర్చి శుభవార్త లేదా క్రీస్తును గూర్చిన వార్త.
అలాగే – శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఎఫెసీ 4: 4.
ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, ఎఫెసీ 4: 5
అందరికి “తండ్రియైన దేవుడు ఒక్కడే”. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు. ఎఫెసీ 4: 6.
2. Believe Jesus is the Son of God – విన్న మాటలయందు (యేసు దేవుని కుమారుడని) విశ్వాసం ఉంచాలి (యోహాను 3:16; 8:24, రోమా 10:10-11)
“మరియు–మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” – మార్కు 16:15-16.
మనం క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి మరియు ఆ విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి.
3. Repent of your Sins- మారు మనస్సు పొందాలి (అపో.కా 2:38), “ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా 17:30-31), “… మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.” (లూకా 13:3). ఒకని మారు మనస్సు వానిని బాప్తిస్మమునకు నడిపించాలి.
4. Confess Jesus as Lord - యేసు ప్రభువని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి (అ. కా 2:36-37., రోమా 10:9,10). యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను 20: 31. ఒప్పుకొన్నవారు ఏమి చేశారో చూద్దాం.
5. Be Baptized for the forgiveness of your Sins - పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి (అ. కా 2:38, ; 22:16 ; 1 పేతురు 3:20-21). బాప్తిస్మము పొందుట అంటే ముంచబడాలి లేదా పాతిపెట్టబడాలి (కొలస్సీ 2:12).
యేసుక్రీస్తు వారు తన శిష్యులతో – కాబట్టి, మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, మత్తయి 28: 19,
6) Remain Faithful - మరణమువరకు లేదా క్రీస్తు రెండవ రాకడ వరకు నమ్మకముగా ఉండాలి (ప్రకటన గ్రంథం 2: 10).
👉 ప్రశ్న (3) :- బాప్తిస్మము పొందడానికి ఎన్ని రోజులు ఆగాలి? ఈ విషయములో బైబిల్ ఏమి చెపుతుంది?
1. అదే రోజున బాప్తిస్మము పొందినవారు (అపో. కా 2:41).
2. ప్రయాణములో బాప్తిస్మము పొందిన వారు (అపో. కా 8:36-38).
3. రాత్రి వేళ బాప్తిస్మము పొందినవారు (అపో. కా 16:24-33).
పై సన్నివేశములను గమనించినట్లయితే వాక్యం అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆలస్యము చేయకుండా,బాప్తిస్మము పొందుటకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం గ్రహించగలము.
👉 ప్రశ్న (4) :- మనం బాప్తిసము పొందుటకు ఆలస్యము చేసిన యెడల ఏమి జరగవచ్చు?
1. మన ప్రాణం పోవచ్చు (2వ కొరింథీ 6:2)
2. మన హృదయం కఠినం చేయబడవచ్చును (హెబ్రి 3:13-17)
3. ఏ దినమైన క్రీస్తు రావచ్చు (మత్తయి 24: 36,42; 25:13) (మత్తయి 25:31, ప్రకటన 20:11-13) కాబట్టి, శరీరంలో ప్రాణం ఉండగానే “నేడు అనబడే సమయం” ఉండగానే బాప్తిస్మము పొంది మీ పాపములను కడిగివేసుకొని రక్షింపబడుము.
👉 ప్రశ్న (5) :- ఏ సంఘములో బాప్తీస్మం పొందాలి? (లేదా) బైబిల్ లో ఉన్న సంఘము ఏది?
ఒక వ్యక్తి రక్షింపబడుటకు క్రీస్తును ఎరుగుట ఎంత ముఖ్యమో ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కూడా ఎరుగుట అంతే ముఖ్యము. ఎందుకనగా దేవుని నిత్య సంకల్పము చొప్పున స్థాపించబడిన సంఘమునకు క్రీస్తు శిరస్సుగా, నాయకునిగా ఉన్నాడు. ఆ సంఘము ద్వారా దేవుని సమస్త జ్ఞానము తెలియచేయవలెనని ఉద్దేశించి యున్నాడు (మత్త 16:18, అ.కా 20:28, ఎఫె 1:23, 3:8-11). అంతే కాదు రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రభువుచే తన సంఘమందు చేర్చబడుచున్నాడు (అ.కా 2:47). కావున, ఈ రచనను చదువు ప్రతి పాఠకుడు తానున్నది క్రీస్తు కట్టిన సంఘమునందా లేదా మనుష్యులు స్థాపించిన సంఘముల యందు ఉన్నారా అనేది పరిశీలించి చూసుకోవాలి.
క్రీస్తు తన సంఘమును కడతానని వాగ్ధానం చేసెను(మత్తయి 16:18). సంఘం శరీరంతో పోల్చబడినది(కొలస్సి 1:18) శరీరము ఒక్కటే(ఎఫెసీ 4:4) అనగా సంఘము ఒక్కటే అదే “క్రీస్తు సంఘము” (The One True Church, The Church of Christ).
బాప్తిస్మము పొందిన తరువాత పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా పొందుచున్నామనే సంగతి తెలియకపోతే ఆ తీసుకొన్న బాప్తిస్మము చెల్లదు, కాబట్టి అటువంటి వారు మరలా బాప్తిస్మము పొందాలి(అపో. కా 19:1-4).
నీవు గనుక మత శాఖల విధానములో ఉన్నట్లయితే ఈనాడే వాటి నుండి బయటకు వచ్చి క్రీస్తు తన సంఘముతో నిన్ను చేర్చునని నిశ్చయత కలిగి లేఖనానుసారంగా బాప్తిస్మము పొందుము. ఆయన నిన్ను తన సంఘముతో చేర్చుకొనును(అపో. కా 2:47), లేఖనానుసారంగా – ప్రతీ ఆదివారమున మానక, క్రీస్తు సంఘముగా కూడి ఆరాధించే ప్రజలతో చేరి ఆయనను (తండ్రియైన దేవుని) ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుము (యోహాను 4:20-24). నిత్య జీవము చేపట్టుము. ఒక వ్యక్తి రక్షింపబడుటకు క్రీస్తు సంఘములో బాప్తిస్మము తప్పనిసరైయున్నది.
గమనిక :- క్రీస్తు సంఘములో లేని ఆరాధనలకు తండ్రి పాత్రుడు కాడు అనే విశేష సంగతిని గ్రహించాలి. అదే సమయమున ప్రభువు మార్గములో కాకుండా ఇతరుల మార్గములలో అనేక తప్పిదములలో నడిపించబడుచున్న అనేక మంది వాటిని గ్రహించి దేవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు స్థాపించిన నిజమైన సంఘము ఎదో అర్ధం చేసుకొనుటకు సహాయపడు విధముగా ఈ రచనను ప్రచురించుచున్నాము.
👉 ప్రశ్న (6) :- క్రీస్తు సంఘములో బాప్తీస్మం పొందిన తరువాత – ఎలా దేవుని ఆరాధించాలి?
[“క్రొత్త నిబంధన ఆరాధన” యొక్క నమూనా (THE NEW TESTAMENT WORSHIP PATTERN)]
◆ ప్రార్థన చేయాలి – (తండియైన దేవునికి, యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేయాలి) —(యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు పాడాలి – (వాయిద్యములు లేకుండా) ---(ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ అపొస్తలుల బోధ మాత్రమే ప్రకటింపబడాలి లేదా వినాలి – (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి – (ప్రతీ ఆదివారమున) – (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ కానుకులు – వర్ధిల్లిన కొలది, ఉత్సాహముతో, సనుగుకొనకుండా ఇవ్వాలి – (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).
◆ సహవాసము కలిగియుండాలి – (పరిశుద్ధులందరితో) – (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
గమనిక: నా ప్రియులారా... వీటిలో ఏ ఒక్క అంశమైన మన సత్య ఆరాధనలో లేనియెడల మరియు నీవు పరిశుద్ధతను, నీ రక్షణను కొనసాగించక ఎదో మొక్కుబడిగా జరిపిస్తే అది యదార్ధమైన ఆరాధన కాదు అనే విశేషమైన సంగతి మనకి బాగుగ తెలియాలి.
అలాగే - తండ్రియైన దేవుని ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించకపోతే అది “క్రొత్త నిబంధన ఆరాధన” కాదు (యోహాను 4:20-24).
👉 ప్రశ్న (7) సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంధం “బైబిల్” యొక్క సందేశం ఏమిటి?
దేవుడు మానవులను రక్షించుటకు చేసిన ఏర్పాటు/ప్రణాళిక. క్రీస్తును మానవులందరి కొరకు బలియాగం చేయటం.
*_మనం ఎక్కడ నుండి వచ్చామో.....?🐾_* *_ఇక్కడ ఎందుకున్నామో.......?_*👫
*_ఎక్కడికి వెళుతున్నామో.....?_*🏃🏾🏃🏾♀️
చెప్పే ఏకైక గ్రంథం బైబిల్.📖
కనుక... *_బైబిల్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొని.....నిన్ను నువ్వు మలుచుకొని.....పరిశుద్ధునిగా మసులుకొని.....పరలోకాన్ని చేరుకొని.....కన్న తండ్రితో (దేవునితో) ఆనందించాలని ఆశిస్తూ.....
👉 ముగింపు :-
రక్షింపబడుటకు క్రీస్తు సంఘములో బాప్తిస్మము పొందుట ఒక తప్పనిసరియైన షరతై ఉన్నది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. బాప్తిస్మము ఒక్కటే(ఎఫెస్సి 4:5) బాప్తిస్మము పొందుటమనగా నీటిలో పూర్తిగా
ముంచటము ద్వారా పొందుట, పూర్తిగా నీటిలో పాతిపెట్టబడుట, ఇదిమాత్రమే లేఖనాల ప్రకారము సరియైన విధానము అయి ఉన్నది. లేఖనాలలో సువార్త విని అంగీకరించిన ప్రజలు రక్షింపబడుట కొరకై ప్రతిఒక్కరూ బాప్తిస్మము పొందినట్లుగా మనం చుసియున్నాము.
కాబట్టి, నీవు ఇంకనూ క్రీస్తు సంఘములో బాప్తిస్మము పొందకపోతే ఈనాడే యేసుక్రీస్తును గురించిన రాజ్యసువార్తను విని (రోమా 10:17) ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నీ హృదయమందు విశ్వసించి(యోహాను 3:16,36; 6:47) నీవు చేసిన పాపముల విషయమై మారు మనస్సు పొంది(లూకా 13:3,7; అపో. కా 17:30) యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని(రోమా 10:9) యేసు క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములలో ఐక్యత గలవాడై యుండుటకు, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందుము(రోమా 6:3-6; అపో.కా 2:38) నీ పాపములను కడిగి వేసుకొనుము(అపో. కా 22:16) రక్షింపబడినవాడవై యుండుము(మార్కు 16:16).
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. రోమీయులకు 16: 16.
Salute one another with an holy kiss. The churches of Christ salute you. Romans 16: 16.
👉 గమనిక :-
“మరిన్ని ఆత్మీయ సంగతులు చర్చించుటకు ఎల్లవేళలా మేము మీకు అందుబాటులో ఉన్నాము. మా సేవలను వినియోగించుకొనగలరు”.
క్రీస్తు సంఘమును (అనగా దేవుని రాజ్యమును) గురించి మరియు అపొస్తలుల బోధ గురించి మీరు ఇంకనూ ఎక్కువ తెలుసుకొనగోరితే వెంటనే మీ దగ్గరలోనున్న క్రీస్తు సంఘమును దర్శించండి (లేదా) మమ్ములను సంప్రదించండి.
బలవంతము చేయు క్రీస్తు ప్రేమతో…
దైవ జనుడు : సహో అశోక్ చక్రవర్తి యలకపాటి,
సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సువార్తికుడు మరియు సభ్యుడు,
H. NO :- 28-426, సుందర్ నగర్ వీధి, మిర్యాలగూడ పట్టణం,
నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. పిన్ కోడ్ : 508207.
ఫోన్ : +91 9966779006, ఇమెయిల్ : [email protected]