29/03/2024
భగవద్వీషయ సమాపన మహోత్సవం
విజయవాడ లబ్బీపేట:
విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ నందు భగవద్విషయ సమాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వవిఖ్యాత యతిసార్వభౌములు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాస నాలతో, ప్రేమైకమూర్తి, శిష్యసులభులు శ్రీశ్రీశ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయవాడ పట్టణంలో ఎన్నడూ జరగని ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని, ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చు అని అన్నారు. ఆచరించే వారు శాస్త్రబద్ధమైన ఆచరణ విధానాన్ని అనుసరించాలని అన్నారు. "భగవద్విషయం” అనేది విశిష్టాద్వైత సిద్ధాంత సంప్రదాయంలో ఉద్గ్రంధమని, 1102 పాశురాలతో వుండే గ్రంథమని వివరించారు. అనంతరం శ్రీమాన్ ఈయుణ్ణి శింగరాచార్య స్వామి, శ్రీమాన్ శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి, శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు,శ్రీమాన్ వాధూల సముద్రాల శఠకోపాచార్య స్వామి,. శ్రీమాన్ శ్రీభాష్యం జగన్నాధాచార్యులు,. శ్రీమాన్ మరుధూరి నరసింహాచార్యులు, శ్రీమాన్ చించాపట్టణ గోమఠం మోహనాచార్యులు భాగవతులను ఉద్దేసించి అనుగ్రహభాషణం చేసారు. అనంతరం నిర్వాహకురాలు, రామానుజదాసి పసుమర్తి పద్మజకుమారి మాట్లాడుతూ విజయవాడలో కనీవినీ జరుగని రీతిలో “యతిరాజనాథవల్లి గోష్ఠి” వారి "భగవద్విషయ సమాపన మహోూత్సవం" జరిగిందని వెల్లడించారు. సంస్కృతంలో వున్న వేదాలను స్వామి నమ్మాళ్వార్లు తమిళంలో అనుగ్రహించారని చెప్పారు. అందులో సామవేదానికి సమానమైనది తిరువాయ్మే దివ్య ప్రబంధం అని, ఆ ప్రబంధాన్ని మూడు సంవత్సరాలుగా యతిరాజనాథపల్లి గోష్ఠి తరపున ఆన్ లైన్ విధానంలో నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్స్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామివారు, పసుమర్తి నందకిషోర్, చుండూరు సూర్యప్రకాశరావు తదితరులు మాత్రమే కాక యావత్ భారతదేశం నుండి, విదేశాల నుండి కూడా వెయ్యిమంది భాగవతులు పాల్గొన్నారు వీరీ మన మధిర భాగవతులు K లక్ష్మి,M రాధా,K అనిత,K విజయ,E శ్రీదేవి,K ఝాన్సీ,K జ్యోత్స్న,మిరియాల పద్మజ రామానుజ దాసి పాల్గొన్నారు