Dr.Sindhumataji-Bhadrakali Peetam

Dr.Sindhumataji-Bhadrakali Peetam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Sindhumataji-Bhadrakali Peetam, Religious Center, Hyderabad.

👻 విజ్ఞానశాస్త్రం మరియు ఆధ్యాత్మికతలోని ఒక రహస్యం: అసలు 'దెయ్యాలు మరియు ఆత్మలు' ఎలా ఏర్పడతాయి? 🌑దెయ్యాలు, ఆత్మలు, *బ్రహ్...
26/03/2026

👻 విజ్ఞానశాస్త్రం మరియు ఆధ్యాత్మికతలోని ఒక రహస్యం: అసలు 'దెయ్యాలు మరియు ఆత్మలు' ఎలా ఏర్పడతాయి? 🌑
దెయ్యాలు, ఆత్మలు, *బ్రహ్మ-ప్రేతాలు* మరియు *జిన్నుల* గురించి మనమందరం కథలు వినే ఉంటాం. కొందరు వ్యక్తులు ఈ శక్తులపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతారు, మరికొందరు వాటిని పూర్తిగా కొట్టిపారేస్తారు. కానీ ఎప్పుడైనా ఒక్క విషయం గురించి ఆలోచించారా—ఒకవేళ అవి *నిజంగా* ఉంటే—అసలు అవి ఎలా సృష్టించబడతాయి?
'సూక్ష్మ శరీరం' మరియు 'శక్తి విజ్ఞానశాస్త్రం' (శక్తి శరీరం) అనే భావనల ఆధారంగా, ఒక ఆసక్తికరమైన కోణం నుండి దీనిని విశ్లేషిద్దాం: 👇
✨ 1. శరీరంలోని శక్తి వలయం:
మన భౌతిక శరీరాన్ని నిర్మించే బిలియన్ల కొద్దీ కణాల లోపల, శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలైన 'మైటోకాండ్రియా' నివసిస్తాయని విజ్ఞానశాస్త్రం చెబుతోంది. శరీరంలోని ఈ సమస్త శక్తి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక సంక్లిష్టమైన వలయాన్ని ఏర్పరుస్తుంది; ఆధ్యాత్మిక సంప్రదాయాలలో దీనిని "సూక్ష్మ శరీరం" లేదా "శక్తి శరీరం" (ఎలక్ట్రానిక్/శక్తి శరీరం) అని పిలుస్తారు. ఆత్మ (*Atma*) ఈ సూక్ష్మ శరీరంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది.
🍂 2. సహజ మరణ ప్రయాణం:
ఒక వ్యక్తి సహజ మరణాన్ని పొందినప్పుడు, శరీరంలోని అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతాయి. కణాలలోని శక్తి నెమ్మదిగా క్షీణించిపోతుంది, చివరకు జీవశక్తి (*ప్రాణం*) శరీరాన్ని విడిచిపెడుతుంది. శక్తి శరీరం పూర్తిగా క్షీణించిపోయిన (విడిపోయిన) తర్వాత, ఆత్మ విముక్తి పొంది, ఒక కొత్త భౌతిక శరీరం కోసం అన్వేషణను ప్రారంభిస్తుంది.
⚡ 3. 'ప్రేత' లోకపు రహస్యం (అకాల/ఆకస్మిక మరణం):
ప్రమాదం, విషప్రయోగం లేదా మరేదైనా ఆకస్మిక కారణం వల్ల మరణం సంభవించినప్పుడు—భౌతిక శరీరం నిజంగానే నశించిపోతుంది; అయితే, సరిగ్గా ఆ క్షణంలో, 'శక్తి శరీరం' మాత్రం పూర్తి శక్తితో (chargeతో) నిండి ఉంటుంది! దానికి ఆధారంగా నిలిచే భౌతిక శరీరం లేకపోవడం వల్ల, ఈ శక్తి క్షీణించిపోలేదు; తత్ఫలితంగా, ఆత్మ ఆ శక్తి శరీరంలోనే చిక్కుకుపోతుంది. ఈ నిర్దిష్ట స్థితిని 'ప్రేత' (శాంతి లేని ఆత్మ) అని పిలుస్తారు.
కంటికి కనిపించకపోయినప్పటికీ, వాటి చైతన్యం, కోరికలు మరియు భావోద్వేగాలు మాత్రం పూర్తిగా సజీవంగా మరియు క్రియాశీలకంగా ఉంటాయి. తమ కోరికలను తీర్చుకోవడానికి ఒక భౌతిక శరీరం లేకపోవడం వల్ల, అవి నిరంతర అశాంతి మరియు ఆందోళనతో కూడిన స్థితిలోనే ఉండిపోతాయి. 🕉️ 4. మంత్రాలు, తాయెత్తులు మరియు పవిత్ర స్థలాల ప్రభావం:

దెయ్యాలు మరియు ఆత్మలు తరచుగా *ఓం*, *రామ్*, లేదా *హనుమాన్* వంటి మంత్ర జపానికి లేదా ఆత్మజ్ఞానం పొందిన యోగుల సాన్నిధ్యానికి భయంతో పారిపోతాయి. ఇది ఎందుకలా జరుగుతుంది? వాస్తవానికి, మంత్రాల ధ్వని మరియు యోగుల తేజస్సు ఒక ప్రత్యేకమైన ప్రకంపనను సృష్టిస్తాయి, అది దెయ్యాల శక్తి శరీరాలను వేగంగా నిర్వీర్యం చేస్తుంది. వాటి శక్తి శరీరాలు నశించినప్పుడు మాత్రమే అవి మోక్షాన్ని పొందుతాయి.

🔥 5. ఏ శక్తులు అత్యంత ఆధిపత్యం కలిగి ఉంటాయి?

బ్రాహ్మణులు, నిష్ణాతులైన తాంత్రికులు, లేదా ఆధ్యాత్మిక సాధనలు చేసే అత్యంత శక్తివంతమైన యోధుల శక్తి శరీరాలు సాధారణ మానవుల కంటే చాలా శక్తివంతమైనవి. అందువల్ల, అకాల మరణం చెందినప్పుడు, వారు 'బ్రహ్మలు'గా లేదా అత్యంత శక్తివంతమైన దెయ్యాలుగా మారతారు, వీటిని నియంత్రించడం చాలా కష్టం.

(గమనిక: ఈ సమాచారం ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు శక్తి సూత్రాల మిళిత దృక్పథం.)

ఈ ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ దృక్పథం మీకు ఎలా నచ్చింది? మీరు ఎప్పుడైనా అతీంద్రియ శక్తిని అనుభూతి చెందారా? దయచేసి మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి! 👇

**దేవీ_ఖడ్గమాలా_స్తోత్రం:* ఒక్కసారి చదివితే శ్రీచక్ర యజ్ఞం చేసినంత ఫలితం!  #నవరాత్రులలో_ఖడ్గమాలా_స్తోత్రం_ఎందుకు_చదవాలి?...
24/03/2026

**దేవీ_ఖడ్గమాలా_స్తోత్రం:* ఒక్కసారి చదివితే శ్రీచక్ర యజ్ఞం చేసినంత ఫలితం!
#నవరాత్రులలో_ఖడ్గమాలా_స్తోత్రం_ఎందుకు_చదవాలి? దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం అనేది సాక్షాత్తు శ్రీచక్ర యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇచ్చే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దేవీ భాగవతంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది.

శ్రీచక్ర పూజ చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి. అందుకే మనలాంటి సామాన్యులకు అమ్మవారు ఇచ్చిన గొప్ప వరం ఈ 'దేవీ ఖడ్గమాలా స్తోత్రం'. ఈ స్తోత్రం చదివితే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది.

లలితా నవరాత్రుల వేళ అమ్మవారిని స్తుతించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం 'ఖడ్గమాల'. శివుడు నందీశ్వరుడికి ఉపదేశించిన ఈ స్తోత్రం విశిష్టత గురించి ఈ post లో తెలుసుకుందాము...

📖 1. దీని వెనుక ఉన్న కథ ఏమిటి?

ఈ స్తోత్రం పరమశివుడు స్వయంగా నందీశ్వరుడికి ఉపదేశించినది. అనంతరం దుర్వాస మహర్షి, హయగ్రీవుడు వంటి వారు దీనిని ప్రచారం చేశారు. లలితా సహస్రనామాల్లో అమ్మవారి రూపం, గుణాల గురించి ఉంటే.. ఖడ్గమాలలో అమ్మవారి నివాసమైన శ్రీచక్రంలోని దేవతలందరినీ మనం పూజిస్తాం. "ఖడ్గమాల" అంటే 'జ్ఞానమనే ఖడ్గాన్ని ధరించిన మాల' అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, భయాన్ని ఈ స్తోత్రం ఖడ్గంలా ఛేదిస్తుంది.

🤫 2. ఎందుకు చదవాలి? (Importance):-

శ్రీచక్రం అనేది అమ్మవారి శరీరం. అందులో 9 ఆవరణలు (ప్రాకారాలు), వందలాది మంది దేవతలు ఉంటారు. వారందరికీ విడివిడిగా పూజ చేయాలంటే గంటల సమయం పడుతుంది. కానీ ఖడ్గమాలా స్తోత్రం చదివితే, కేవలం 5-10 నిమిషాల్లోనే ఆ దేవతలందరినీ స్మరించినట్లవుతుంది. అంటే "శ్రీచక్రార్చన" చేసిన పూర్తి ఫలితం ఈ ఒక్క స్తోత్రంతో లభిస్తుంది.

3. ఫలితాలు & లాభాలు:-

✨ రక్షణ:- ఇది ఒక కవచంలా పనిచేస్తుంది. శత్రు బాధలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి.

✨ భయం పోతుంది:- పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

✨ కోరికల సిద్ధి:- ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే అమ్మవారి దయతో నెరవేరుతాయి.

✨ నెగటివ్ ఎనర్జీ:- ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోయి, ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది.

🤔 4. ఎవరు చదవాలి? ఎలా చదవాలి?

✨ భక్తి ఉన్న ఎవరైనా చదవవచ్చు (ఆడవారు, మగవారు). ముఖ్యంగా లలితా సహస్రనామాలు చదవడానికి సమయం లేని వారు దీనిని ఎంచుకోవచ్చు.

✨ ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి చదవాలి.

✨ నవరాత్రులలో రోజుకు కనీసం ఒకసారి చదివినా చాలు. వీలైతే 3 లేదా 11 సార్లు చదవడం ఇంకా మంచిది. ఈ 9 రోజులు రోజూ చదివితే, మీకు ఆ మణిద్వీపంలో అమ్మవారి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

నవరాత్రులలో ప్రతిరోజూ దీనిని పఠించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. "నవరాత్రులలో ఈ స్తోత్రం ఒక్కసారి చదివినా చాలు!"

స్త్రీ శక్తి ఆరాధనలో శౌచం అత్యంత ప్రాధమైనది . అందులోనూ మనం మాట్లాడుకుంటున్నది ఖడ్గమాల గురించి . ఇది పూర్తిగా శ్రీచక్ర వర్ణన. ఈ ఒక్క స్తోత్రం నియమంగా చేసుకోగలిగితే చాలు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని తొలగిపోతాయి . ఇహమూ , పరమూ కూడా అమ్మ అనుగ్రహంతో సిద్ధిస్తాయి . కానీ, శ్రద్ధ , భక్తి, నియమ పాలన అమ్మకి చేసే ఈ పూజకి చాలా అవసరం . ఇది తంత్రశాస్త్ర సంబంధమైనది. శ్రీ వామకేశ్వర తంత్రంలో ఉమా మహేశ్వరుల సంవాదంగా చెప్పబడింది.

మనని కన్నా అమ్మ కూడా అంతే కదా ! చెడు దారిలో వెళ్తానంటే, శిక్షించయినా దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంది . మన ఉన్నతి కోసం ఎంతకైనా వెనకాడకుండా శ్రమిస్తుంది. అమ్మ చిటికెడు ప్రేమకే పొంగిపోయే అమృతమయి. ఆవిడ హృదయమే ఇంతటి నవనీతమైతే, మరి ఆ అమ్మలగన్నయమ్మ మన కోసం ఇంకెంత వాత్సల్యంతో ఉంటుందో అర్థం చేసుకోవాలి . అలాంటి అమ్మనే మనం ఖడ్గమాలతో అర్చిస్తాం . ఆవిడ కరుణాకటాక్ష వీక్షణం మనపైన పడినా చాలు ఇహమూ పరమూ రెండూ సౌఖ్యమే !

సకల పాపాలు తొలగించి, సకల దుఃఖాలు తొలగించి నిత్యం మనల్ని రక్షించే, అపూర్వ స్తోత్రం శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వివిన్నా, పఠించినా , సకల దోషాలు తొలగుతాయి. సంపదలు కలుగుతాయి. ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది.ఇలా చేయడం వల్ల సర్వ దుష్టశక్తులూ వదిలిపోతాయి . పీడలన్నీ తొలగిపోతాయి . మన మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి.

🔱 ఖడ్గమాలా స్తోత్రంలో ఏముంది ?

ఖడ్గమాలా స్తోత్రం పూర్తిగా శ్రీ చక్రం యొక్క వర్ణన. శ్రీ చక్రం లో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఆ తొమ్మిది ఆవరణలో ఉండే దేవతల స్తోత్రమే ఖడ్గమాల స్తోత్రం. ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే శ్రీచక్రాన్ని ఉపాసించినటువంటి ఫలితం లభిస్తుంది . శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేసినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది.

🤔 ఖడ్గమాల ఎలా చేయాలి :

తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు, అమ్మపైన పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే, వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం చేస్తూ, అలా 41 రోజుల పాటు కొనసాగించాలి . నియమపాలన చేస్తూ, ఈ పారాయణం చేస్తే, సత్వర సహాయం లభిస్తుంది. స్పష్టంగా చదవలేని వారు, ఈ స్తోత్రం ప్రతిరోజూ విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అంతటి మహిమోపేతం , విశిష్టం ఈ ఖడ్గమాలా స్తోత్రం .

🙏 నియమాలు : -

✨ అమ్మమీద పూర్ణమైన విశ్వాసం , అచంచలమైన భక్తి ఉండాలి .

✨ అలా ఉన్నా స్త్రీ, పురుషులెవరైనా ఈ స్తోత్రం చదువుకోవచ్చు .

✨ అక్షర దోషాలూ , ఉచ్ఛారణా దోషాలూ లేకుండా నేర్చుకొని చదువుకోవాలి .

✨ స్నానం చేయకుండా, శౌచం లేకుండా ఖడ్గమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు.

✨ బయట ఉన్న ఆడవాళ్ళు నాలుగురోజులపాటు పారాయణ చేయకూడదు. మైల ఉన్న కాలంలో మాటవరసకి కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు.

✨ మాంసాహారం తీసుకోకుండా , సాత్వికులై , సాత్విక ఆహారాన్ని ఈ పారాయణా కాలంలో తీసుకోవడం మంచిది .

ఖడ్గమాల స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఖడ్గమాల పారాయణ నియామంకితులై పాటించగలిగినవారు, చక్కగా నిత్యమూ చేసుకోవచ్చు . అమ్మ ఆరాధన విశేష ఫలం . వీలయితే, శ్రీచక్ర కుంకుమార్చన యుక్తంగా దేవీ ఖడ్గమాలని చేసుకోవచ్చు . లేదంటే, పైన చెప్పినట్టు పరిమితమైన కాలనియమం తో ఖడ్గమాల చేసుకొని అమ్మని శరణువేడవచ్చు. ముందే చెప్పుకున్నట్టు , దీనివల్ల ఇహములోని కామ్యాలు అన్ని సిద్ధిస్తాయి అమ్మ అనుగ్రహంతో . ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి, అమ్మ ఆశీస్సులతో పరలోక పుణ్యమూ దక్కుతాయి

🚩 ముఖ్యమైన సూచన:-

ఖడ్గమాలా స్తోత్రం చదివేటప్పుడు ఉచ్చారణ (Pronunciation) చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో బీజాక్షరాలు ఉంటాయి. చదవడం రాని వారు భక్తితో వినడం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది.

🙏🌺 ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏

త్రిపురాంతకం............!!ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన...
24/03/2026

త్రిపురాంతకం............!!
ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’ అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది .

త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం .రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి .స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి . ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ..త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయం గా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని ‘’తత్పురుష లింగం ‘’అంటారు

స్థల పురాణం –త్రిపురాసుర సంహారం....

తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించాడు .ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు .వీరినే త్రిపురాసురులు అంటారు .తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్న తోబ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు .ఆయన ప్రత్యక్షం కాలేదు .పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి .బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలాగ కూడదని వరం కోరుకొన్నారు .పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు .తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణం తో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలో నే తమకు మృత్యువు రావాలనికోరుకొన్నాడు .సరే నన్నాడు బ్రహ్మ .

తారాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు .వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం ,అపూర్వ బాణాలు అవసరమనీ చెప్పాడు .వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు .విశ్వకర్మ జగత్తు తత్త్వం తో రధాన్ని ,వేదం తత్త్వం తో గుర్రాలను ,నాగ తత్త్వం తో పగ్గాలను ,మేరు శఖర తత్త్వం తోధనుస్సును ,వాసుకి తత్త్వం తో వింటి నారిని ,సోమ ,విష్ణు ,వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రధ సారధి అయ్యాడు ..అ దివ్య రధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు .

త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం....

ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన ,మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రధం భూమి లోకి కుంగి పోయింది .గుర్రాలు నిలవ లేకపోయాయి ధనుస్సు పని చేయలేదు .రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించ లేక పోయి నందుకు కోప పడ్డాడు .ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు .పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు .లీలా వినోదిని బాలా త్రిపురాసుందరి గా ఆమె ఆవిర్భవించింది .శివుని ధనుసులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదం లో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది .

‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ ‘’.అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు .దేవతలు అప్పుడు ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘’అని స్తుతించారు .త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి ..

దేవమునులు సంతసిం చారు. బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది .శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు .ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది .రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు.ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది .పెద్ద గుట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు .దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –‘’స్తుతి శ్రుతం గర్త సదం యువానం –మృగన్నభీమ ముప హత్తు ముగ్రం –మ్రుడా జరిత్రే రుద్రస్తవానో –అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’’ . వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు. ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది .

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భ విం చిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి .ఆదిశైలం ,అరుణాచలం ,కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి .తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు .ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కు మారుడైన కుమారస్వామిని చూసి పోతూఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’

అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’

పిలిస్తే పలికే దైవం.....

పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట .పాల్కురికి సోమ నాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కద తార్కాణం .ఈ ఆలయానికి నలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి . ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉన్ది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది .ఈయన మహా మహిమ కల దైవం .అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు .దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవా లయం ఉన్నది .పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు .మూల స్తానేశ్వరునికి ఆగ్నేయం గా పంచ బ్రాహ్మల చే ప్రతిస్టింప బడిన ‘’పంచ లింగ దేవాలయం ‘’ఉన్నది .ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి .పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి .దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది .ఇంకొంచెం పైకి ఎక్కితే ఇస్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది దీనికి దక్షిణం గా అద్భుత మహిమలున్న ‘’అగస్త్య లింగం ‘’ఉన్నది దీనినే ‘’ విన్ధ్యేశ్వర లింగం అనీ అంటారు .

ముఖ్యదేవాలయం దగ్గరే ‘’అపరాజితెశ్వరుడు ‘’ఉన్నాడు మన్యు సూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది . ఆగ్నేయం లో సూక్ష్మ తేజోమయ ‘’యజ్ఞేశ్వర లింగం ‘’వాయవ్యం లో హనుమంతుడు నెలకొల్పిన ‘’మారుతి లింగం ‘’, ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుస్సు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరం లో చండీశ్వరుడు ,పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిస్తితమైన ‘’ఉగ్రేశ లింగం ‘’ఉన్నాయి . ఉత్తరాన ‘’భేక సోమేశ్వరుడు’’దర్శన మిస్తాడు ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగాచేయాలి. ఆలయం లోని బలిహణలను భక్షిస్తాడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకలాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది . ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది .గర్భాలయానికి నైరుతి దిశలో ‘’చీకటి మిద్దె ‘’అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది .వృశ్చిక మల్లెశ్వరాలయానికి దగ్గర ‘’లో మఠం ‘’ఉంది .శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చిన్చాటానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు .ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది .దాని మూలం లో భైరవుడు ఉంటాడు .దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది .అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట .ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు .ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి ‘’రస రత్నారం ‘’అనే గ్రంధం లో రాశాడు .చీకటి మిద్దె ప్రకనే ‘’మహా గణపతి మండపం ‘’ఉంది .విగ్రహం శిదిలమైతే ప్రక్కన కింద పెట్టారు.

ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు అలాటి అరుడైన దేవాలయం ఇది .’’శ్రీ చక్రం శివ యొర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట .అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి .లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు .జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండడ కిందఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిస్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేత్రులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది .అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది .

స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది ఇందులో స్నానిస్తే పుణ్యం మోక్షం .త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది .చెరువులో కలిసిపోయింది .మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది .దీనికి ‘’పాప నాశనం ‘’అనిపేరు .నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని .కుమార గిరికి పడమర దూర్వా నది లేక దువ్వలేరు ఉన్నది .ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు .దీనికి దక్షిణం లో ‘’ముక్త గుండం ‘లో స్నానం చేస్తే మోక్షమే .

తీర్దాలు-మిగిలిన గుడులు.....

త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం .కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం .పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు .ఉత్తరాన ఉన్న కొండడను పూల పూల కొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది .ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట .దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది .దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది .ఇది సర్వ రోగ నివారిణి .తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి .వాయవ్యం లో లింగాల కొండ ఉంది .ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట .ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట .ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు .

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం.....

చిదగ్ని కుండ సంభూత.....

కుమార గిరికి దగ్గరలోఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది .ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే .ఆలయ గోపుర గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది .గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత .’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు . కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే . అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవిం చింది .ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం .దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ .అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట

ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యది దేవతలుంటారు .తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది .దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది .సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికి .ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది .విగ్రహానికి వేనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు .అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు –

‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై

కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు .

సిద్ధి మండపాలు....

చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి .వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్టానం చేసేవారట .

శ్రీ చక్ర పాదుకలు....

మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది .ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి . అర్చనలన్నీ వీటీకే చేస్తారు . అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు , చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది . ధనం కా వాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి .ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి .వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు .శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ .గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’.చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు .

ఛిన్నమస్తా దేవి......

చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది . ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు .ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య .ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంధం వివరించింది .ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు .ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి .

రక్త పాత్రలు....

సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవు .కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు .వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత .’’సవ్యాప సవ్య మార్గస్థా’’.ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది .అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది .ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది .దీనిపై సంస్కృత శాసనం ఉంది .శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు .దీన్ని ఒక కవి పద్యం లో

‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద –

మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’

వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో-

‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ

దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’

కదంబ వనవాసిని......

త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి .అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు .కదంబ వృక్షాలే కల్ప వృక్షాలే శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు .’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు .

వీర శిలలు.....

అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే .ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు .ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది .ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో ,గుండెలో ,గొంతులో ,తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు .వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి .’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం .ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి .ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం .

అపరాదేశ్వరీ ఆలయం – గుహలు....

అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది .ఇది శిధిల రూపం లోనే ఉంది.దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం ‘’చింతామణి గుహాంతస్త ‘’ అనే నామం .ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట అమ్మవారికి వెనక ‘’వైడూర్య శిఖరం .అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట .ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట .దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక .

మహా సర్పం – మరికొన్ని విశేషాలు.....

బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది .అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది .సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట .

అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని ‘’ఈశ్వరుని తల గుడ్డ ‘’అంటారు .ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు .త్రిపురాంతక శివునికి పడమర గా పదమూడు కిలో మీటర్ల దూరం లో ఒక కొండ ,దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి అక్కడ నలభై అడుగుల దూరం లో ‘’మండే కాంతులు ‘’అనిపిస్తాయి .అక్కడి మామిడి పండు ఆకారం లో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి .అది ఎర్రగా మారుతుంది .ఆ గుడ్డను పాలల్లో వేయాలి .పాలు ఎర్రగా మారుతాయి .ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధం గా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు ,ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం ‘’లో నిత్య నాద సిద్ధుడు రాశాడు .

బిలాలు.....

శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది .సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి .నలభై అడుగులు లొపలీ వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి .ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి .అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి .ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి .అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు .మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది .

గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది .దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది .దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు

ఇస్ట కామేశ్వరీ దేవి ఆలయ.......

శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరం గా కారడవిలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి విగ్రహాన్ని అందరు తప్పక దర్శించాలి .ఈమె పేరు తెలుగు సాహిత్యం లో ఎక్కడా చోటు చేసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉంది. ధ్యాన మగ్నయై పద్మాసనం లో శిలా పీఠం పై దర్శన మిస్తుంది .నాలుగు భుజాలు ఉన్నాయి .పై రెండు చేతులతో కలువ మొగ్గలను కింది కుడి చేతితో రుద్రాక్ష మాల ,ఎడమ చేతిలో శివలింగాన్ని కలిగి ఉంటుంది .పూర్వపు ఆలయం శిధిలమైంది .ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది . కాపాలికల దేవత అయి ఉండచ్చు .ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది ..సుమారు ఎనిమిదవ శతాబ్దపు ఆలయం అనుకో వచ్చు జీపులలో అడవిలో ప్రయాణించి ఇష్ట కామేశ్వరిని దర్శించాలి . దీనిని కంచి పరమాచార్యుల వారు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారుమొదటి సారి దర్శించి లోకానికి తెలియ జేశారు .అప్పటిదాకా ఎవరికీ తెలియదు . తర్వాత ఇటీవలికాలం లో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వెళ్లి దర్శించి , అమ్మవారి ప్రాభవాన్ని ప్రవచనాలలో తెలియ జేస్తున్నారు . ఇప్పుడే ప్రభుత్వం పక్కారోడ్డ్డు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు

వీరశైవం –మఠాలు.....

త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహద పడింది .ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది .14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది .1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతు శ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది .ఇక్కడి ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది . పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).

ఉత్సవాలు.....

ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసం లోప్రత్యెక ఉత్సవాలు కార్తీకం లో అభషెకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది .తర్వాత ఆలయం శిధిలా వస్తకు చేరింది .శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది . దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు . 2006 లో కరివేన వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభ మైంది .శివరాత్రి నాడు జరిగే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది . ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.

పరమ యోగి అయిన శివుడు, ఇడా, పింగళ, సుషుమ్న నాడుల పరిపూర్ణ సమతుల్యతకు ప్రతిరూపంగా నిలుస్తూ, దివ్య చైతన్యం యొక్క అంతర్గత వి...
19/03/2026

పరమ యోగి అయిన శివుడు, ఇడా, పింగళ, సుషుమ్న నాడుల పరిపూర్ణ సమతుల్యతకు ప్రతిరూపంగా నిలుస్తూ, దివ్య చైతన్యం యొక్క అంతర్గత విజ్ఞానాన్ని వెల్లడిస్తాడు. చంద్రుని చల్లని శక్తిలా ప్రవహించే ఇడా నాడి, అంతర్ దృష్టి, ప్రశాంతత మరియు అస్తిత్వంలోని స్త్రీ తత్వాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, సూర్యునిలా ప్రకాశించే పింగళ నాడి, కర్మ, వేడి మరియు పురుష శక్తిని సూచిస్తుంది. ఈ రెండు ప్రవాహాలు మానవ వ్యవస్థలో ప్రవహిస్తూ, జీవన లయను సృష్టిస్తాయి. వీటన్నింటి కేంద్రంలో సుషుమ్న నాడి ఉంటుంది. ఇది జాగృతికి సూక్ష్మమైన మార్గం, ఇక్కడ ద్వైతం కరిగిపోయి స్వచ్ఛమైన చైతన్యం ఉద్భవిస్తుంది. ఇడా మరియు పింగళ నాడులు విలీనమయ్యే నిశ్చల బిందువే శివుడు. ఈ కలయిక ద్వారా, నిద్రాణంగా ఉన్న శక్తి ఆరోహించి, ఉన్నతమైన సాక్షాత్కారానికి దారితీస్తుంది. ఈ పవిత్ర దర్శనంలో, శివుడు ఈ శక్తుల నుండి వేరుగా లేడు—ఆయనే సుషుమ్నలో సూర్యచంద్రులు ఏకమై, మోక్ష మార్గాన్ని మేల్కొలిపే అంతిమ స్థితి.

06/03/2026
జపం చేస్తే ఫలితం......!! జపం :ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాల...
16/02/2026

జపం చేస్తే ఫలితం......!!

జపం :
ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-

వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము

రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు,

నేలపై కూర్చునిచేస్తే - ధుఖము,

కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,

గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.

జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి

వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము

వస్త్రాసనం మీద- ధన సమృద్ధి

పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.

ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.

లక్ష్మీ తంత్రం 8:- భార్య కి కోపం వస్తే ప్రేమతో బెండ్ చేసుకోవాలి అహంకారం తో కాదు.కోపం ఉగ్రం గా ఉన్న నరసింహ స్వామికే తప్పల...
11/02/2026

లక్ష్మీ తంత్రం 8:- భార్య కి కోపం వస్తే ప్రేమతో బెండ్ చేసుకోవాలి అహంకారం తో కాదు.
కోపం ఉగ్రం గా ఉన్న నరసింహ స్వామికే తప్పలేదు భార్య అలిగితే గడ్డం పట్టుకుని అడుక్కోవడం
చాల మందికీ భార్య అలిగితే అలక తీర్చడానికి మగ అహం అడ్డం వస్తుంది
నరసింహ స్వామి కన్న గొప్ప మగ అహం ఎవరికి ఉంది ఆయనే భార్య అలక తీర్చడానికి ప్రయత్నం చేసాడు

లక్ష్మీ తంత్రం 7 :-లక్ష్మీదేవికి(ఇంటి ఇల్లాలికి )అవమానంవైకుంఠానికి వచ్చిన బృగు మహర్షి విష్ణువు పట్టించుకోలేదనే ఉద్దేశ్యం...
11/02/2026

లక్ష్మీ తంత్రం 7 :-లక్ష్మీదేవికి(ఇంటి ఇల్లాలికి )అవమానం

వైకుంఠానికి వచ్చిన బృగు మహర్షి విష్ణువు పట్టించుకోలేదనే ఉద్దేశ్యంతో లక్షీ దేవి నివాసం అయిన విష్ణు వక్షస్థలం పై తన్నాడు
నారాయణుడు లక్షీ దేవి కన్నా భక్తుడికి ప్రాముఖ్యత ఇచ్చాడు అనే ఉద్దేశ్యంతో లక్షీ దేవి వైకుంటం విడిచి పెడుతుంది.
ఇంట్లో భార్య కూడా అత్తగారి ఇంట్లో అవమానాలు ఎదుర్కుని ఆమెకి అత్తగారి ఇంట్లో కోడలిగ గౌరవం ప్రాముఖ్యత లేదు అని తెలిసినప్పుడు బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు.
లక్షీ దేవి వైకుంఠాన్ని విడిచి పెట్టడం తో సర్వ దేవతలు ఐశ్వర్యాన్ని కోల్పోతారు.
లక్ష్మీదేవి ని పొందడం కోసం సాక్షాత్తు నారాయణుడే తపస్సు చేసిన ప్రాంతం మన తిరుపతి
ఇంట్లో భార్య కి అవమానం జరిగి ప్రియార్టీ ఇవ్వలేదు అని అలిగి పుట్టింటికి వెళితే కోర్టు ల చుట్టు తిరిగీ ఇంకో అమ్మాయిని చూసుకునే మహానుభావులు ఎందరో ఉన్నారు
కాని శ్రీ మన్నారాయణుడు మాత్రమే తపస్సు చేసి తన కి లక్షీ దేవి దగ్గర ప్రేమ ఉంది అని ప్రూవ్ చేసుకొని మరి లక్ష్మీ దేవి ని తిరిగి పొందాడు
భార్య భర్తల జంట సమాజానికి ఆదర్శం కావాలి
భార్య భర్తలు ఎలా ఉండకూడదో చెప్పే ఉదాహరణ అవ్వకూడదు

లక్ష్మీ తంత్రం 6 :- ( నమ్మక ద్రోహం  )దేవుడు వరం ఇచ్చినా పూజారి ఆ వరాన్ని మనకు ఇవ్వలేదు అన్నట్టు ఒక సామెత ఉంది.నేను ఈ మద్...
10/02/2026

లక్ష్మీ తంత్రం 6 :- ( నమ్మక ద్రోహం )
దేవుడు వరం ఇచ్చినా పూజారి ఆ వరాన్ని మనకు ఇవ్వలేదు అన్నట్టు ఒక సామెత ఉంది.

నేను ఈ మద్య ఒక అమ్మాయి సమస్య విన్నాను .ఆ అమ్మాయి దుబాయ్ లో ఉంటుంది అంట .
ఆ అమ్మాయి సంపాదించిన మొత్తం సొమ్ము కన్న తల్లిని నమ్మి ఇండియా కి పంపించేదంట.

ఆ తల్లి కూతురు సొమ్ముని కొడుకుకి ఖర్చు పెట్టేదంట ప్రేమతో ఆ కొడుకు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు.నా డబ్బులు ఎవమ్మా అని అడిగితే రివర్స్ లో కూతురినే తిట్టేదంట.

మనం అందరికన్నా ఎక్కువగా నమ్మే వారి చేతుల్లో మనం కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంచుతాం.మనం ప్రేమించి నమ్మి సొమ్ము ఇచ్చిన వారు తిరిగి మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. వారు ప్రేమించిన వారికి డబ్బులు కర్చు పెడుతూ ఉంటారు. మనం సంపదించే డబ్బుకోసం నమ్మకం గా ఉంటూ నటిస్తూ ఉంటారు.ఇలాంటి వాళ్లని నమ్మితే మన బ్రతుకు బిక్షగాడి బ్రతుకు అవుతుంది

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Dr.Sindhumataji-Bhadrakali Peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share