05/07/2023
RSS ప్రచారక్ కేశవ్ హెగ్డే మరణం
హిందూ సమాజానికి తీరని లోటు..
@ గుండెపోటుతో VHP బెంగళూరు క్షేత్ర సంఘటన మంత్రి కేశవ్ హెగ్డే మృతి
@ తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం
@ ఆకారపు కేశవ రాజు గారు వెళ్లిన తరువాత.. ముడుపు యాదిరెడ్డి గారు వచ్చేదాక తెలంగాణకు హెగ్డే సేవలు
@ దాదాపు నాలుగేళ్ళు తెలంగాణ వ్యవహారాల పర్యవేక్షణ
@ అత్యంత సాదాసీదా వ్యవహారం
@ పనిచేసే కార్యకర్తలకు వెన్ను తట్టే ప్రోత్సాహం
@ వారి స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం హుబ్లీ సమీపంలోని సిరిసి లో రేపు అంత్యక్రియలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ కేశవ్ హెగ్డే మరణం బాధాకరం. గుండెపోటుతో బుధవారం (5-7-2023) మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వారు కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఆయన మరణ వార్త వినగానే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రాల్లోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిచయం ఉన్న సంఘపరివార్ కార్యకర్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలో గల శిరసి అనే గ్రామానికి చెందినవారు కేశవ్ హెగ్డే. రేపు ( 6-7-2023) వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రస్తుత భాగ్యనగర్ క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటకలోని రెండు ప్రాంతాలు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రాలకు సంఘటన మంత్రిగా శ్రీ కేశవ్ హెగ్డే గారు విశ్వహిందూ పరిషత్ కు సేవలందించారు. నిరంతరం చిద్విలాసంగా నవ్వుతూ కలకలలాడే కేశవ్ గారు కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. పనిచేసే కార్యకర్తలను అమితంగా ఇష్టపడేవారు. కార్యకర్త మనసును తెలుసుకొని మసులుకునేవారు. చిరు నవ్వు తప్ప.. ఏనాడూ ఆగ్రహం ఎరుగని వ్యక్తిత్వం వారిది. 2015 లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కోటిలో వారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికి వారు కర్ణాటక రాష్ట్ర సంఘటన మంత్రి. ఆ తర్వాత 2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు బెంగళూరు క్షేత్ర సంఘటన మంత్రిగా వ్యవహరించేవారు. ఆ సమయంలో ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ గా ఉన్న నాకు అన్ని విధాలా సహకరించేవారు. అత్యంత ఆత్మీయంగా చూసుకునేవారు. కర్ణాటకలో ఉన్నప్పటికీ భాగ్యనగర్ లో ఏదైనా పని ఉందంటే బాలస్వామిని కలవండి అని చెప్పేవారు. ప్రత్యేకంగా కన్నడ లో నడుపుతున్న విశ్వహిందూ పరిషత్ మాసపత్రికకు నన్ను అడ్వర్టైజ్మెంట్ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా చాలాసార్లు సూచించారు. ప్రత్యేకంగా రెండుసార్లు బెంగళూరు పిలిపించి అందుకు సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేశారు బెంగళూరు VHP కార్యాలయంలో.
తెలంగాణ ప్రాంతానికి చాలా కాలం పాటు సంఘటన మంత్రి లేకపోయినా అన్ని వారే చూసుకునేవారు. 2019 లో నాలుగు ప్రాంతాలు, మూడు రెవెన్యూ రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ) ప్రచార ప్రముఖుల సమావేశం నిర్వహించడానికి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ప్రచార ప్రముఖులను భాగ్యనగర్ కు పంపించారు. ఈ సమావేశానికి అఖిల భారత ప్రచార ప్రముఖ్ విజయశంకర్ తివారి గారు హాజరయ్యారు. ప్రతి విషయంలో నేను చేసే పనులకు ఆశీర్వాదం అందించడంతోపాటు ఆటంకాలు ఏవైనా ఉంటే అడ్డు తొలగించేవారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ లోపల కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి నేను ప్రతిపాదన పంపడంతో, వెంటనే వారు స్పందించారు. ఈ ఏడాది జనవరి నెలలో నన్ను ప్రత్యేకంగా బెంగళూరు పిలిపించి.. అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాకు అటాచ్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
గత సంవత్సరం జనవరిలో బెంగళూరు కార్యాలయానికి వెళ్లిన నన్ను "ఇక మీరు ఇదే చివరిసారి.. మరోసారి ఈ కార్యాలయానికి రావడానికి వీల్లేదు "అని అన్నారు సీరియస్ గా... కంగుతిన్న నేను.. ఎందుకు ? అని తిరిగి ప్రశ్నించాను.
" ఎందుకు అంటే .. ఈ కార్యాలయాన్ని కూల్చివేసి, కొత్త కార్యాలయం నిర్మాణం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడకి మన అధికారులు ఎవరూ రాలేరు" అని చమత్కరించారు.
అత్యంత చలాకిగా.. హుషారుగా ఉండే కేశవ్ హెగ్డే గారు బెంగళూరు వెళ్లిన సమయంలో రకరకాల హోటళ్లు తిప్పి రుచి చూపించేవారు. టిఫిన్ కు ఏ హోటల్ ప్రసిద్ధి.. భోజనానికి ఏ హోటల్ ప్రసిద్ధి అనే విషయం చెప్పి అన్ని హోటల్లో తినిపించేవారు.
బెంగళూరు, ఉడిపి, కర్ణాటకకు సంబంధించిన చాలామంది ప్రముఖులు భాగ్యనగర్ లో ఉద్యోగము, వ్యాపారం చేస్తున్నారు. వారందరినీ కలిసే క్రమంలో చాలా తోడ్పాటు గా ఉండేవారు. ఇటీవల రాయపూర్ లో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశాల సందర్భంగా కూడా అక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించారు. వారం క్రితం రాయపూర్ లో ఉండగా మాట్లాడినవే వారితో చివరి మాటలు. వారు చూపిన వాత్సల్యం.. కార్య దక్షత జీవితాంతం మరచిపోనివి. "సంఘ కార్యం చేయడంలో ఎన్ని అడ్డంకులు అయినా ఎదుర్కోవాలి.. విపక్షం నుంచే కాదు, స్వ పక్షం నుంచి కూడా ఎదుర్కొని సంఘం పనిచేయాలి" అని సూచించేవారు. ఇంతటి అటాచ్మెంట్ ఉన్న వారు.. లేరు అనే వార్త వినగానే కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళులో సుడులు తిరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో నాతో అత్యంత ఆత్మీయంగా మెలుగుతూ సంఘం విషయంలో అనేక మెలుకువలు నేర్పిన మహనీయులు కేశవ్ హెగ్డే గారు.
ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణకు అనాధికారిక సంఘటన మంత్రిగా సేవలందించారు. కేశవరాజు గారు వెళ్లిన తర్వాత .. యాది రెడ్డి గారు వచ్చేంతవరకు కేశవ్ హెగ్డే గారు తెలంగాణ సంఘటన మంత్రిగా ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డారు. వారి సేవలు కర్ణాటక కే కాదు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి.
VHP తెలంగాణ కార్యాలయంలో ఉంటూ చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో వారితో పాల్గొన్నాను.
అత్యంత పవర్ ఫుల్ పోస్టులో ఉండి కూడా ఏ రోజు తన పవర్ ను ఉపయోగించింది లేదు. కార్యకర్తలను ఏ రోజు మనసు నొప్పించింది లేదు.. బాధ పెట్టిందీ లేదు. ఏ రోజు కూడా కటువుగా మాట్లాడింది లేదు.. మనసు బాధ పెట్టిందీ లేదు.
కలిసి నిర్వహించిన సమావేశాలు.. కలిసి ప్రయాణించిన జ్ఞాపకాలు పదిలంగా మిగిలాయి. ప్రతి మాటలో ప్రతి సందర్భంలో ప్రశాంతత తప్ప టెన్షన్ కనపడని తత్వం.
ప్రచార విషయానికి వస్తే.. బాలస్వామి ఆదర్శం అంటూ అందరికీ చెప్పేవాడు. నేను చాలా కాలంగా ప్రచార సహ ప్రముఖ్ గా ఉన్నానండి.. నా బాధ్యత మార్చండి అని చెప్పిన్నప్పుడల్లా.. ఓ నవ్వు నవ్వేవారు. సహ ప్రముఖ్ అయినా ప్రముఖ్ అయినా అదే పని అని భుజం తట్టేవారు. వారి జ్ఞాపకాలు.. వారితో కలిసి నడిచిన అనుభూతులు చిరస్మరణయం. మాటలకందని విషాదం.
జాతీయ స్థాయికి ఎదిగి విశ్వహిందూ పరిషత్ కు, హిందూ ధర్మానికి సేవ చేయాల్సిన ఉజ్వలమైన భవిష్యత్తు వారికి ఉండింది. కానీ అనుకోని రీతిలో అకస్మాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడం మాటలకందని విషాదం. మొత్తంగా హిందూ సమాజానికి, కర్ణాటక విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు తీరని లోటు. వారు చెప్పిన మార్గంలో నడుస్తూ.. హిందూ కార్యం పెంచడమే వారికి నిజమైన నివాళి.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. శ్రీరాముడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. కేశవ్ మరణానికి కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. కేశవ్ హెగ్డే ఆత్మకు సద్గతులు కలగాలని.. భగవంతుని కోరుకుంటూ..
..ఓం శాంతి..
భవదీయ
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010