Advitha Siddi Devotional Center Sri Shiva Chandi Vastu Jyothishalayam

  • Home
  • India
  • Hyderabad
  • Advitha Siddi Devotional Center Sri Shiva Chandi Vastu Jyothishalayam

Advitha Siddi Devotional Center Sri Shiva Chandi Vastu Jyothishalayam జన్మ తేదీ జన్మ సమయం పుట్టిన ప్రదేశం వంటి విషయాలు అందజేసిన ఎడల జాతక పరిశీలన చేయబడును

26/10/2022

*కార్తీక పురాణం ప్రారంభం*

*కార్తీకపురాణం 1 అధ్యాయం*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*కార్తీక మాసం విశేషం*

ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.

*కార్తీక వ్రతవిధానం*

”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సం

ధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

08/09/2022

మహాలయ పక్షం పితృ పక్షం మొదలయ్యే రోజు భాద్రపద బహుళ పాడ్యమి ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు.

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.

శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.

పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తి కి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ది, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారం గా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది
దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్త కు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది
త్రయోదశి నాడు శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు,అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

08/09/2022

భాద్రపద శుక్ల చతుర్థశి ( అనంత పద్మనాభ వ్రతము)
భాద్రపద శుక్ల చతుర్థికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి శ్రీమహావిష్ణువు తన నాభీపుండరీకమును బాగా వికసింపజేసి, బ్రహ్మ దేవునికి భూలోక మానవసృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం, ఈ తిథి నాడే ప్రసాదించాడు. బ్రహ్మ కృతజ్ఞతతో అనంతపద్మనాభ స్వామి వ్రతం చేశాడు. ఈ వ్రతాచరణము చేసిన సాధకుడు భుక్తి, ముక్తులు రెండూ పొందుతాడు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడు అనే పేరుతో కాసేపు శయనించాడు. ఈ రోజు విష్ణువును, విష్ణు సహస్రనామంతో లేదా అష్టోత్తర శతనామములతో కాని పూజించాలి.
రెండవది - ఈ తిథి నాడు అగస్త్యమహర్షిని ఏదైనా లోహ ప్రతిమ రూపంలో పూజా మందిరంలో ఉంచి పూజించుట. అగస్త్యుడు పూర్వం యముని వద్దకు వెళ్ళి, మానవులకు నరకబాధను తొలగించమని కోరాడు. అప్పుడు యముడు అగస్త్యుని, భాద్రపద శుక్ల చతుర్థి నాడు లోహ రూపంలో పూజించిన వాని జోలికి తాను, తన భటులు వెళ్ళమని, అటువంటి వారికి నరక భయం ఉండదని వరమిచ్చాడు. కనుక శక్తిని అనుసరించి అగస్త్యుని పూజించాలి. ఈ అగస్త్యుని పూజ శ్రీశైలంలో కాని, కాశీ క్షేత్రంలో కానీ చేస్తే అనంత ఫలితం లభిస్తుంది.

01/09/2022

శ్రీ సరస్వతీ కవచమ్

ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలంమే సర్వదావతు | ఓం హ్రీం | సరస్వత్యై స్వాహేతి శ్రోత్రేపాతు నిరంతరం | ఓం శ్రీం హ్రీం భగవత్యై | | సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై | స్వాహా నాసాంమే సర్వదావతు ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా | " చోష్ఠం సదావతు | ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంత పంక్తిం | సదావతు | ఓం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రేవాం స్కంధౌమే శ్రీం సదావతు | ఓం | హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహామే పాతునాభికాం | ఓం హ్రీం క్లీం | వాణ్యై స్వాహేతి మమ హస్తా సదావతు | ఓం సర్వవర్ణాత్మికాయై | పాదయుగ్మం సదావతు | ఓం వాగాధిష్ఠాతృదేవ్యైస్వాహా సర్వాంగం సదావతు | ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు ఓం | సర్వజిహ్వాగ్ర వాసిన్యై స్వాహా అగ్నిదిశిరక్షతు | ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా | సంతతం మంత్ర రాజోయం దక్షిణే మాం సదావతు | ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైఋత్యాం | సర్వదావతు | ఓం ఐం హ్రీం జిహ్వా గ్రవాసిన్యై స్వాహా మాం | వారుణేవతు | ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యేం మాం | సదావతు | ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యైస్వాహా మాముత్తరేవతు | ఓం ఐం సర్వశాస్త్ర వాసిన్యైస్వాహా ఈ శాన్యాం సదావతు | ఓం హ్రీం | సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు | ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా అధోమాం సదావతు ఓం గ్రంధబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు

విద్యా, జ్ఞాపక శక్తులకు రోజు 3సార్లు -
సిద్ధిః - 1108 సార్లు

| జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికా కృతిమ్ | ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

19/06/2022

🌟 *నక్షత్ర వివరాల జాబితా* 🌟

👉 *నక్షత్రం నక్షత్రాధిపతి అధిదేవత గణము జాతి జంతువు పక్షి వృక్షము రత్నం నాడి రాశి*

*అశ్విని:-* కేతువు-అశ్వినీదేవతలు-దేవగణము-పురుష-గుర్రము-గరుడము-అడ్డసరం-విషముష్టి-జీడిమామిడి-వైడూర్యం-ఆదినాడి-4మేషము
*భరణి:-* శుక్రుడు-యముడు-మానవగణము-స్త్రీ-ఏనుగు-పింగళ-దేవదారు-ఉసిరిక-వజ్రము-మధ్యనాడి-4మేషరాశి

*కృత్తిక:-* సూర్యుడు-సూర్యుడు-రాక్షసగణము-పురుష-మేక-కాకము-ఔదుంబరం-అత్తి-కెంపు-అంత్యనాడి-1మేషము-2-4వృషభం
*రోహిణి:-* చంద్రుడు-బ్రహ్మ-మానవగణము-పురుష-సర్పం-కుకుటము-జంబు(నేరేడు)-ముత్యం -అంత్యనాడి -

*మృగశిర:-* కుజుడు-దేవగణం-ఉభయ-సర్పం-మయూరము-చండ్ర-మారేడు-పగడం-మధ్యనాడి-2వృషభం-2మిధునం

*ఆరుద్ర:-* రాహువు-రుద్రుడు-మానవగణం-పురుష-శునకం-గరుడము-రేల-చింత-గోమేధికం-ఆదినాడి-4మిధునం
*పునర్వసు:-* గురువు-అధితి-దేవగణం-పురుష-మార్జాలం(పిల్లి)-పింగళ-వెదురు-గన్నేరు-కనక-పుష్యరాగం-ఆదినాడి-1-3మిధునం-4కర్కాటకం
*పుష్యమి:-* శనిగ్రహం-బృహస్పతి-దేవగణం-పురుష-మేక-కాకము-పిప్పిలి-నీలం-మధ్యనాడి-4కర్కాటకం

*ఆశ్లేష:-* బుధుడు-జ్యోతిషం-సర్పము-రాక్షసగణం-స్త్రీ-మార్జాలం-కుకుటము-నాగకేసరి-సంపంగి-చంపక-పచ్చ-అంత్యనాడి- 4కర్కాటకం

*మఖ:-* కేతువు-పితృదేవతలు-రాక్షసగణం-పురుష-మూషికం-మయూరము-మర్రి-వైడూర్యం-అంత్యనాడి -4సింహరాశి
*పూర్వఫల్గుణి:-* శుక్రుడు-భర్గుడు-మానవసగణం-స్త్రీ-మూషికం-గరుడము-మోదుగ-వజ్రం-మధ్యనాడి-4సింహం

*ఉత్తర:-* సూర్యుడు-ఆర్యముడు-మానవగణము-స్త్రీ-గోవు-పింగళ-జువ్వి-కెంపు-ఆదినాడి-1సింహం-3-4కన్య

*హస్త:-* చంద్రుడు-సూర్యుడు-దేవగణం-పురుష-మహిషము-కాకము-కుంకుడు-జాజి-ముత్యం-ఆదినాడి-4కన్య

*చిత్త:-* కుజుడు-త్వష్ట్ర-విశ్వకర్మ-రాక్షసగణం-వ్యాఘ్రం(పులి)-కుకుటము-తాటిచెట్టు-మారేడు-పగడం-మధ్యనాడి-2కన్య-2తుల-స్వాతి-రాహువు-వాయు-దేవుడు-దేవగణం-మహిషి-మయూరము-మద్ది-గోమేధికం -అంత్యనాడి -4తుల

*విశాఖ:-* గురువు-ఇంద్రుడు-అగ్ని-రాక్షసగణం-స్త్రీ -వ్యాఘ్రము (పులి)-గరుడము-నాగకేసరి-వెలగ-మొగలి-కనక-పుష్యరాగం-అంత్యనాడి 1-3తుల-4వృశ్చికం

*అనూరాధ:-* శని-సూర్యుడు-దేవగణం-పురుష-జింక-పింగళ-పొగడ -నీలం -మధ్యనాడి-4వృశ్చికం

*జ్యేష్ట:-* బుధుడు-ఇంద్రుడు-రాక్షసగణం-లేడి-కాకము-విష్టి-పచ్చ-ఆదినాడి-4వృశ్చికం

*మూల:-* కేతువు-నిరుతి-రాక్షసగణం-ఉభయ-శునకం-కుకుటము-వేగిస-వైడూర్యం-ఆదినాడి-4ధనస్సు

*పూర్వాషాఢ:-* శుక్రుడు-గంగ-మానవగణం-స్త్రీ-వానరం-మయూరము-నిమ్మ-అశోక-వజ్రం-మధ్యనాడి-4ధనస్సు

*ఉత్తరాషాఢ:-* సూర్యుడు-విశ్వేదేవతలు-మానవగణం-స్త్రీ-ముంగిస-గరుడము-పనస-కెంపు-అంత్యనాడి -1ధనస్సు2-4మకరం

*శ్రవణము:-* చంద్రుడు-మహావిష్ణువు-దేవగణం-పురుష-వానరం-పింగళ-జిల్లేడు-ముత్యం-అంత్యనాడి -4మకరం

*ధనిష్ట:-* కుజుడు-అష్టవసుడు-రాక్షసగణం-స్త్రీ-సింహము-కాకము-జమ్మి-పగడం-మధ్యనాడి-2మకరం2-కుంభం

*శతభిష:-* రాహువు-జ్యోతిషం-వరుణుడు-రాక్షసగణం-ఉభయ-అశ్వం(గుర్రం)Kకుకుటము -అరటి,-కడిమి -గోమేధికం-ఆదినాడి -4కుంభం

*పూర్వాభద్ర:-* గురువు-అజైకపాదుడు-మానవగణం -పురుష -సింహం -మయూరము -మామిడి -కనక-పుష్యరాగం-ఆదినాడి-3కుంభం1-మీనం

*ఉత్తరాభద్ర :- శని-అహిర్పద్యువుడు-మానవగణం-పురుష-గోవు-మయూరము -వేప- నీలం-మధ్యనాడి-4-మీనం

*రేవతి:-* బుధుడు- పూషణుడు-దేవగణం-స్త్రీ-ఏనుగు-మయూరము-విప్ప -పచ్చ అంత్యనాడి- 4-మీనం

07/06/2022

*చనిపోయిన వారింటికి పరామర్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయా?*
*0x0x0x0x0x0x0x0x0x0*

*బంధువుల ఇళ్ళలో కానీ లేదా మనకు తెలిసిన వారి ఇళ్ళలో కానీ ఎవరైనా చనిపోతే ఆ రోజు వెళ్ళలేని వారు తర్వాత పరామర్శించడానికి వెళ్ళాలను కునే వారుకానీ లేదా భర్త చనిపోయి* *వైధవ్యము ప్రాప్తించిన స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు పరామర్శించడానికి వీలులేదు. అందుకు శాస్త్ర ప్రకారంగా ఈ క్రింది నియమాలను పాటించాల్సి ఉంటుంది.*

*పరమార్శకు పనికి వచ్చే వారలు:-*
*సోమవారం, బుధవారం, ( ఆదివారం ) అనుకూలమైనవి.*

*పరమార్శకు పనికి వచ్చే తిధులు:-*
*విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు అనుకూలమైనవి.*

*పరామర్శకు పనికి వచ్చే నక్షత్రాలు:-*
*అశ్విని, భరణి, ఆరుద్ర, పుబ్బ, ఆశ్లేష, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలమైనవి.*

*పరమార్శకు పనికిరాని వారాలు :-* *మంగళవారం, గురువారం, శుక్రవారములు పరమార్శకు అనుకూలం కాదు.*

*గమనిక :-* *పరామర్శించడానికి నెలరోజుల వీలుకాక పోయినచో సరిమాసలలో మాత్రం పరామర్శించ కూడదు.భేసి మాసలలో పరామర్శించ వచ్చును.* *పరామర్శకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పరిగడుపున వెళ్ళకూడదు. ఏదైనా తిని వెళ్ళాలి.*

*పరామర్శకు వెళ్ళేప్పుడు వెంబడి తీసుకు వెళ్ళకుండా జాగ్రత్త పడవలసినవి:-*
*జాతి రత్నాలతో చేయబడిన ఉంగరాలు, ఆభరణాలు, రక్షాయంత్రాలు, పట్టు వస్త్రాలు మొదలైనవి ఒంటిమీద లేకుండా జాగ్రత్త పడాలి, వాటిని ఇంట్లో పెట్టి వెళ్ళాలి. పొరపాటున అవి ధరించుకుని వెళితే అవి శక్తిని కోల్పోతాయి. తిరిగి వాటికి శాస్త్రోక్తకంగా శుద్ధిని చేయించి ప్రాణప్రతిష్ఠ జరిపించాలి

02/06/2022
02/06/2022

*త్రిజ్యేష్ఠ*

త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం.
అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు.

‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని.

ఈ మధ్యకాలంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి అనే విషయం ప్రస్తావనకు వస్తే మా అబ్బాయి ఇంటిలో పెద్దవాడు కావున జ్యేష్ఠ మాసంలో వివాహం చేయము అనేవారు. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవద్దని చెప్పేవారు ఎక్కువయ్యారు.

జ్యేష్ఠ సంతానం అనగా వున్న వారిలో జ్యేష్ఠులు కాదు. ‘అద్యగర్భప్రసూతాయాః’ ఏ తల్లికి అయిననూ ప్రథమ గర్భంలో పుట్టిన సంతతికి మాత్రమే జ్యేష్ఠులు అని వర్తించారు.

దంపతులు ఇరువురూ జ్యేష్ఠ సంతతి అయి వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయుట వలన మూడు జ్యేష్ఠలు అవుతాయి కావున త్రిజ్యేష్ఠ దోషం ఆపాదించబడుతుంది. కావున జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులయిన వధూవరులు యిరువురికి వివాహం చేయుట నిషేధము. ఒకరు జ్యేష్ఠులు మరొకరు జ్యేష్ఠులు కాకపోయిన ఎడల వివాహం చేయవచ్చును.

పూర్వకాలామృతంలో మరొక విశేషం చెప్పారు. ‘జ్యేష్ఠేమాస్యపి జాతియోశ్చ యదివా జ్యేష్ఠోడు సంభూతయేః దంపత్సోర్యది యేనకేన విధినా జ్యేష్ఠాత్రయం చాస్తిచేత్ త్రిజ్యేష్ఠాహ్వయ దోషదోహి సతతం నాప్యాద్య గర్భద్వయే’ - త్రిజ్యేష్ఠ స్వరూపం కాకపోయిననూ వధూవరులు ఇరువురూ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిననూ, ఇరువురూ జ్యేష్ఠ మాసంలో పుట్టిననూ ఆ వధూవరులకు జ్యేష్ఠ మాసంలో వివాహం నిషేధం అని చెప్పారు.

పై మూడు రూపాలలో ఒకవేళ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవలసి వస్తే- ‘వివాహో యది కర్తవ్యశ్చాద్య గర్భ ద్వయరపి. అన్యోన్య రాశిమిత్రత్వే శుభం ప్రాహమునిర్మనుః’ - ఆ వివాహం చేసుకునే దంపతులకు రాశి మైత్రి వున్న యెడల వివాహం చేయవచ్చును అని వున్నది.

వధూవరులలో ఒకరు జ్యేష్ఠ మాసం మరొకరు వేరే మాసంలోను, ఒకరు జ్యేష్ఠా నక్షత్రం మరొకరు వేరే నక్షత్రంలోను, ఒకరు జ్యేష్ఠుడుగా మరొకరు అన్యులుగా జన్మిస్తే ఈ చర్చ అవసరం లేదు. త్రిజ్యేష్ఠ దోషంగా చెప్పబడిన వధూవరులకు యిరువురికీ మాసాధిపతుల మైత్రి వుంటే జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చును.

‘అద్యగర్భ ప్రసూతయోర్యత్ర వివాహం కారయేద్యది మాసాధిపతి మిత్ర వశా దత్రశుభావహః - ముహూర్తదర్పణం ఈ విధంగా ఎన్నో మతాంతర పాఠాలు ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడికి వివాహం చేయు విషయంలో చెప్పారు.

ఇక ప్రజలు పరిధిని అతిక్రమించి కొత్త పాఠాలు మొదలుపెట్టారు. జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడికి జ్యేష్ఠ కన్యను ఇచ్చి వివాహం చేయరాదట కదా! ఇలాంటి పిచ్చి శాస్త్రాలు మహర్షులు చెప్పలేదు. ఇక భవిష్యత్‌లో అందరూ ఒకరు లేదా ఇద్దరినే కంటారు. మరి అలాంటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలా? అక్కర్లేదు. ఇలాంటి పిచ్చి అపవాదులకు అవకాశం శాస్త్రంలో లేదు.

శాస్త్రం చాలా చక్కగా దోషములు దోష పరిహారములతో పకడ్బందీగా చెప్పబడినది. అందువలన జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయు విషయంలో పై విధంగా శాస్త్ర నిర్ణయాలు తెలుసుకోండి.

01/06/2022

*జపం.....*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

*జకారో జన్మ విచ్చేదః*
*పకారో పాపనాశకః*
*జన్మపాప వినాశిత్వాత్*
*జప ఇత్యభిదీయతే*

*"జపం" లోని....*

*జ = జన్మవిఛ్చేదనం చేసేది.*

*పా = పాపాన్ని నశింపచేసేదని.. అర్థం.*

💫 యోగానికి జపం ఒక ముఖ్యాంశము. అందుచేతనే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునితో..

*"యజ్ఞానాం జప యజ్ఞోస్మి"* అని చెప్పడం జరిగింది. అంటే, యజ్ఞములు లన్నింటిలో నేను జపయజ్ఞాన్ని.. అని చెప్పాడు.

💫 జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలను గానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

✅‌ *సాధారణంగా జపం మూడు విధాలుగా ఉంటుంది...*

*1. వాచికం...* 💐

💫 మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

*2. ఉపాంశువు...* 💐

💫 తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

*3. మానసికం...* 💐

💫 మనస్సులోనే మంత్రాన్ని జపించడం..

✅ *వాచిక జపం కంటే ఉపాంశు జపం వంద రెట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం వెయ్యిరెట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది.*

💫 అయితే... జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడ చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉచ్ఛారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందు గానీ, తరువాత గానీ ఇష్టదేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదనేది శాస్త్రం.

💫👉‌ జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

🌈 *జపమాలలు మూడు రకాలు...*

*1. కరమాల...* 💐

💫 అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలము వరకు గల పది కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

*2. అక్షమాల...* 💐

💫 ‘ఆ నుంచి క్ష' వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ' అనంత ఫలితాన్ని కలిగిస్తుండగా.. ’క్ష' కల్మషాలను తొలగిస్తుంది.

*3. మణి మాలలు...* 💐

💫 రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజతమాలలు, తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణి మాలలని అంటారు.

👉 రజతమాల జపం దశగుణాన్ని,
👉 శంఖమాల జపం శతగుణాన్ని,
👉 పగడాలమాల జపం సహస్రగుణాన్ని,
👉 స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని,
👉 ముత్యపు మాలజపం లక్ష గుణాన్ని,
👉 తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని,
👉 బంగారుమాల జపం కోటిగుణాన్ని,
👉 తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని,
👉 రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి...

💫 పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపుమాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసిమాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

💫 అన్ని యజ్ఞాలకన్నా జపయజ్ఞం గొప్పదని మనుస్మృతి చెబుతోంది.

💫 తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించ దలచుకున్నారో, ఆ మంత్రం తోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

*త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా |*
*తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే ||*

💫 అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వ్రేళ్ళపై ఉంచి, చేతి బోటనివేలితో, మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి.

💫 కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ఋగ్వేదం.. సామవేదాలు.. లేడి రూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మరల దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ఋగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ఋగ్వేదం, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

💫 దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

💫 గృహస్థులు దర్భాసనం వేసుకొని గాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది.

30/05/2022

🙏వివిధ దేశాలలో పూజ / జప సంకల్పాలు🙏

వీటిలో తగిన మార్పులు ఉంటే సరిచేసుకొండి

Sankalpam for US Atlanta city :
క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, గోతీర్ధ ఖండే, మెరోహే పశ్చిమే పార్ష్వే, పుష్కర క్షేత్రే, రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , చట్టహూచి జీవ నదీ తట సమీపే , అట్లాంటా నగరే, స్వ / వసతి గృహే .....
_---------

క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే , రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే , మిన్నిసోటా జీవ నది తీరే , బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,
( Above is for Bloomington city in Indiana state . please make required changes to your city)

Australia :
శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే, భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్

UK region. :
విన్ధ్యస్య పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే , ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే , లండన్ నగరేౌ

Africa :
ప్లక్ష ద్వీపె , వింధ్యస్య నైరుతి దిక్భాగె , తామ్ర ఖండె , కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె

ముంబాయి :
వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె , ముంబాయి నగరె .... లక్ష్మి నివస / స్వ గ్రుహె

Middle East :
జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య పస్చిమ దిక్భాగె , అరబీ మహాసాగర పస్చిమ తటె , కతార్ దెసె , దొహా నగరె .......... గ్రుహె

Delhi :
మెరొహ్ దక్షిణ పార్స్వె , వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , ఆర్య వర్తైక ప్రదెశె , యమునా తటె , ధిల్లీ నగరె ... గ్రుహె

SINGAPORE :
మేరొహ్ ఆగ్నేయ దిక్భాగే,
మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,
పూర్వ సముద్ర తీరే,
సింహపురి మహా ద్వీపే,
సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,
వసతి గృహే/
లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...And so on.....

VARANASI :
వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , అశీ వరుణయొర్ మధ్యె , మహాస్మశానె , ఆనందవనె , త్రికంటక విరాజితె , అవిముక్త వారణాశీ క్షెత్రె , ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె , వసతి గ్రుహె , విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత , గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ ,

Banglore :
శ్రీసైలస్య నైరుతి ప్రదెశె , తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె , శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె , ..... గ్రుహె ..... సమస్త దెవతా .....

Chennai : ..శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే కృష్ణ కావేరి మధ్య ప్రదేశ...

Vishakhapatnam :
శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే.....

South Korea :
జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె , మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె , కొరియా నామ ద్వీపె వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ

🕉🙏

*ఎంత సేపు పూజ?**పూజ గదిలో - 30 నిమిషాలు**బయట - 23 గంటల 30 నిమిషాలు**1) ఏది పూజ? ఎంత సేపు పూజ?**2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ...
28/05/2022

*ఎంత సేపు పూజ?*

*పూజ గదిలో - 30 నిమిషాలు*

*బయట - 23 గంటల 30 నిమిషాలు*

*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*

*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*

*3) నిద్ర లేవగానే -*
*i) శ్రీహరి గుర్తుకు రావాలి*
*ii) భూమికి నమస్కరించాలి*
*iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*

*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*

*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*

*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*

*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*

*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*

*9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*

*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*

*11) పసి పిల్లలను, స్త్రీలను చూసినప్పుడు విష్ణు మాయ గుర్తుకు రావాలి.*

*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*

*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*

*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*

*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*

*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*

Address

Ankalamma Street Giddalur, Chintal Basthi
Hyderabad

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+917989641460

Website

Alerts

Be the first to know and let us send you an email when Advitha Siddi Devotional Center Sri Shiva Chandi Vastu Jyothishalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Advitha Siddi Devotional Center Sri Shiva Chandi Vastu Jyothishalayam:

Share