Chilkur balaji

Chilkur balaji ONly DêVoTioNaL������

07/12/2024
06/12/2024
https://youtu.be/Qv1IGTdqKbQ?si=FNSgysjfYR_HT83h
07/09/2024

https://youtu.be/Qv1IGTdqKbQ?si=FNSgysjfYR_HT83h

ప్రకృతిని దైవంగా భావిస్తూ మట్టి గణపతి పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.జై బోలో గణేష్ మహారాజ్ కీ జై! ...

Smizzy Metal Wall Hanging God Tirupati Balaji,Sri Venkateswara Idol, venkateshwara Swamy Idol, Spiritual Home Décor, Gif...
03/01/2024

Smizzy Metal Wall Hanging God Tirupati Balaji,Sri Venkateswara Idol, venkateshwara Swamy Idol, Spiritual Home Décor, Gifts Statue for Pooja Gift Living Room Mandir Decor Gold Color,1Pc
https://amzn.eu/d/3zTB4SS

శ్రీ చంద్రశేఖర అష్టకం. 🌺🙏🌺చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాంచంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం రత్నసాను ...
07/08/2023

శ్రీ చంద్రశేఖర అష్టకం. 🌺🙏🌺

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

రత్నసాను శరాశనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మంబుజాసన సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

పంచ పాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మధ విగ్రహం
భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం భవ మవ్యయం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం
పంక జాసన పద్మ లోచన పూజితాంఘ్రి నరోరుహం
దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైల రాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
క్ష్వేడ నీల గళం పరశ్వధ ధారిణం మృగ ధారిణం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం వృష వాహనం
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

భేషజం భవ రోగిణా మఖిలా సదా మపహారిణం
దక్ష యజ్న వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

భక్త వత్సల మర్పితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారిణి భూహుతాశన సోమపానిల భాకృతిం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

విశ్వ సృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేష లోక వినాశినం
క్రీడయంత మహర్నిశం గణనాధ యూధ సమన్వితం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

మృత్యుభీత మృకండు సూనుకృత స్తవం
శివ సన్నిధౌయత్ర కుత్ర చయః పఠేన్న హితస్య మృత్యు భయం భవేత్
పూర్ణ మాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్యదదాతి ముక్తి మయత్నతః. 🙏

🌹🙏 జగన్నాథాష్టకం ...!! 🙏🌹🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరోముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపఃరమాశంభుబ్రహ్మామరపతిగణే...
20/06/2023

🌹🙏 జగన్నాథాష్టకం ...!! 🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || ..🚩🌞🙏🌹

🌺జై జగన్నాథ 🌺🙏

పూరి జగన్నాథ యాత్ర 20/6/2023

🌹🙏 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏

పూరి జగన్నాథ రథయాత్ర 🌹
క్షేత్ర వైభవం 🙏🌹
పూరి క్షేత్రం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా అలరారుతుంది పూరి గర్భాలయంలో రత్న సింహాసనముపై సుభద్ర బల‌ బద్రుల సమేతంగా కొలువుతీరే జగన్నాధుడు వివిధ సందర్భాల్లో వివిధ వేషాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు వేషం అంటే అలంకారము అని అర్థం వివిధ సందర్భాల్లో ప్రత్యేక అలంకారాలు చేస్తారు 🌹🙏
ఉదాహరణకు రథయాత్ర సమయంలో జగన్నాధుని అలంకారం నవ యవ్వన వేషమని పిలుస్తారు ఏడాదిలో సుమారు 34 అలంకారాల్లో జగన్నాథుడు దర్శనమిస్తాడు వారాలకు అనుగుణంగానూ జగన్నాథని వస్త్రాలంకారం ఉంటుంది గ్రహాలకు సూచికంగా వివిధ రంగుల పట్టు వస్త్రాలు పుష్పాలతో ప్రతినిత్యం అలంకరిస్తారు 🙏🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🌹
శ్రీకృష్ణుడు అంటే నీల మేఘ వరణంతో నెమలి పింఛను ధరించి వేణువును చేతబూని దర్శనం ఇస్తాడు కానీ పూరీక్షేత్రంలో మాత్రమే పెద్దపెద్ద కళ్ళతో నల్లటి దేహముతో సగం కాళ్లు సగం చేతులతో కొలువుతీరి ఉంటాడు 🌹🙏
ఈయన సమస్త విశ్వానికి అధిపతి ఆయనే జగన్నాథుడు 44 అడుగుల ఎత్తున రధములో సోదరీ సోదర సమేతంగా జగన్నాథ రథయాత్ర కొనసాగుతుంది 🌹🙏
250 అడుగుల పొడవు 8 అంగుళాల కైవారం ఉండే తాళ్లతో అశేష జన భక్తజనం రధాలు లాగటానికి పోటీలు పడతారు ఆషాడ మాసం రెండో రోజున ఆ దేవదేవుని రథచక్రాలు ముందుకు కదులుతాయి పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచమంతటా ప్రఖ్యాతి పొందింది 🙏🌹
మనకు అన్నాచెల్లెళ్ల పండగ అనగానే శ్రావణ పూర్ణిమనాడు జరుపుకొని రక్షాబంధనం గుర్తుకు వస్తుంది కానీ పూరి వాసులకు మాత్రం అన్నాచెల్లెళ్ల పండుగ అంటే జగన్నాథని రథయాత్రే🙏🌹
ఇతర క్షేత్రాలను అన్నిటికంటే భిన్నముగా పూరి గర్భాలయంలో దారుమూర్తులే దర్శనమిస్తాయి రాతి విగ్రహాల స్థానంలో చెక్క ప్రతిమలే నిత్య పూజలు అందుకుంటాయి 🙏🌹
జగన్నాధునికి సంబంధించిన అనేక పురాణ కథలు చారిత్రక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ద్వాపర యుగం నాటి కథ ప్రకారం శ్రీకృష్ణ ఆత్మ స్వరూపం జగన్నాధుని విగ్రహములో నిక్షిప్తమై ఉంది 🙏🌹
పూరీలో ప్రతి ఏడాది నూతన రథాలను రూపొందిస్తారు బలరాములకి సుభద్ర కు జగన్నాధునికి మూడు కొత్త రథాలను సిద్ధం చేస్తారు వైశాఖమాసంలో అక్షయ తృతీయ రోజున రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది సరిగ్గా రథయాత్రకు ముందు రోజైనా ఆషాడశుద్ధ పాడ్యమినాడు పూర్తవుతుంది అంతేకాదు ఎక్కడైనా ఉత్సవ మూర్తులను రథలపై ఊరేగిస్తారు కానీ పూరీలో మాత్రమే మూలవిరాట్లన్ని రథాలపై అవరోధించి ఊరేగిస్తారు ఇలాంటి ప్రత్యేకత మరెక్కడ కానరాదు 🌹🙏
పూరిలో జగన్నాథనుకి రోజుకు ఆరు పర్యాయాలు నైవేద్యాన్ని నివేదిస్తారు ప్రతి నివేదనలోను షడ్రసోపితమైన పిండి వంటలు ఉంటాయి 🙏🌹
లక్షలాది భక్తులతో పూరి జగన్నాథుని రథయాత్ర మహోత్సవం ఏటా కన్నుల పండగ జరుగుతుంది 🙏🌹 జై జగన్నాథ 🌹🙏
పూరి జగన్నాథ యాత్ర రథోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో జగన్నాథుడు బలబద్రుడు సుభద్ర వేరువేరు రథలలో ఊరేగుతారు భార్య సమైతుడేన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి ఉన్న స్వామిని అర్చించడం జగన్నాధ క్షేత్రంలోనే కనిపిస్తుంది
ఉత్తరాన బద్రీనాథ్ పశ్చిమాన ద్వారకాదీశుడు దక్షిణాన శ్రీ రంగనాథుడు తూర్పు జగన్నాథుడు భారత భూమికి రక్షకులు సకల జగత్తును పాలించే పరమాత్ముడే జగన్నాథుడు ఏట ఆషాడమాసంలో జరిగే జగన్నాధ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవము మూర్తులు ఊరేగిస్తారు పూరి క్షేత్రంలో మాత్రం మూలవిరాట్లే రథాలను అధిరోహిస్తారు అన్నగారైన బలబద్రుడు చిట్టి చెల్లెలు సుభద్ర తో కలిసి దారు (వేపచెక్క విగ్రహం) రూపంలో నిత్య పూజలందుకునే జగన్నాధునికి ఆషాడ మాసం రెండో రోజున రథయాత్ర జరుగుతుంది రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భాలయంలో మూలవిరాట్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం బయటకు తీసుకొస్తారు ఈ వేడుకనే పోహండి అంటారు ఆరడుగుల ఎత్తు ఉండే బలబద్రుడు జగన్నాథ్ విగ్రహాల రాథల వద్దకు చేర్చే ప్రక్రియ చాలా వైవిధ్యంగా ఉంటుంది ఈ ముగ్గురు దేవతలతో పాటు నిలువెత్తు కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రాన్ని సుభద్రా దేవత రథములో అధిష్టింప చేస్తారు పహాండీ సమయములో కుల మతాలకు అతీతంగా సామాన్యులకు సైతం మూలమూర్తులను తాకే అవకాశం లభిస్తుంది
జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉండని స్థలపురాణం చెబుతుంది ఏట ఆషాడమాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర లో 20 లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారు🌹💐

🌺జై జగన్నాథ 🌺🙏

07/01/2023

Jai Chilukuru Balaji….!

..............⚜🙏జై శ్రీ సీతారామ్ 🙏⚜           🌺జై శ్రీ రామ భక్త హనుమాన్ కి జై🌺  🙏🙏శ్రీ ఆంజనేయం🙏 ప్రసన్నాంజనేయం🙏🙏
03/01/2023

..............⚜🙏జై శ్రీ సీతారామ్ 🙏⚜
🌺జై శ్రీ రామ భక్త హనుమాన్ కి జై🌺
🙏🙏శ్రీ ఆంజనేయం🙏 ప్రసన్నాంజనేయం🙏🙏

Swamiye Sharanam Ayyappa 🙏🙏
17/11/2022

Swamiye Sharanam Ayyappa 🙏🙏

Address

Hyderabad
501504

Alerts

Be the first to know and let us send you an email when Chilkur balaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Chilkur balaji:

Share