04/10/2022
బండమీద మరియు ఇసుకమీద వేయబడిన పునాదులు
🛐🛐🛐✝️✝️✝️🕎🕎🕎
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. మత్తయి 7 : 24-28
ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళిద్దరి ఉద్దేశ్యం ఒక్కటే. వారికొరకు ఒక ఇల్లుని నిర్మించుకోవాలని. అయితే, ఇద్దరూ ఇళ్ళు కట్టారు. ఈ ఇద్దరి ఇళ్ల మధ్యగల తేడా, వారు తీసిన పునాదిలోనే వుంది. ఇంటి పునాది భాగం పైకి కనిపించకపోయినాగాని, ఆ ఇంటికి అదే ఆధారం. పునాది యొక్క పటిష్టతనుబట్టే, ఆ పునాదిపై కట్టబడిన కట్టడం పటిష్టతను కలిగియుంటుంది. గాలి, వాన, వరదలు ఇంట్లోని ప్రతీభాగాన్ని పరీక్షిస్తాయి. ఇంటికప్పును, గోడలను, పునాదులను కూడా అవి పరీక్షిస్తాయి.
♻️బుద్ధిమంతులు ♻️
🟥⬜⬛🟧🟫🟦🟨🟪🟩
క్రీస్తు అనే బండ ( 1కొరింథీ 10:4) మీద పునాది వేయబడిన జీవితాలు వీరివి. హృదయలోతుల్లో యేసయ్యకు విధేయత చూపాలనే కోరికను కలిగియుంటారు. తమ బ్రతుకులో దేవుని సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తారు. ఆయన చిత్తానికి తలవంచుతారు. క్రీస్తులో నమ్మకముంచుతారు. తమ విధేయతమూలముగా వారి నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటారు. క్రైస్తవ జీవితానికి స్థిరమైన పునాది యేసు క్రీస్తే. (1కొరింథీ 3:11)
♻️బుద్ధిలేనివారు ♻️
🟫🟦🟨🟪🟩🟧⬛⬜🟥
వీరి పునాదికి లోతులేదు. కొంచెం గాలి మరియు నీటి వంటివి వాటిని తాకినా తట్టుకోలేవు. వీరి పునాదులు స్వంత ఆలోచనలు, వారియొక్క మనోభావాలు, వారి సిద్ధాంతాలు, వారి మతాచారాలమీద ఆధారపడి ఉంటాయి. దేవునిపైన ఆధారపడలేదు. అట్లాంటి శ్రద్ధను కనుపరచలేరు. వారి హృదయాల్లో దేవునికి స్థలముండదు. క్రీస్తు పై పునాది వేసి వేరుపారడం అంటే వీరికి తెలియదు.
♻️బుద్ధిమంతుని ఇల్లు: ♻️
🟥⬜⬛🟧🟫🟦🟨🟪🟩
గాలి, వాన, వరదలు అనేవి, క్రైస్తవ జీవితంలో అత్యంత సహజం. ఇవన్నీ వారి విశ్వాస యాత్రలో ఎదురుపడే శోధనలు, శ్రమలు, నిందలు మొదలగు వాటికి సూచనగానున్నాయి.
▫️యోబు ఎట్లాంటి గాలి, వాన, వరదలచేత కొట్టబట్టాడో వర్ణనాతీతం కదా? ( యోబు 1,2 ఆధ్యాయములు)
▫️యిర్మీయా ఎన్నో తాకిడులకు గురయ్యాడు ( విలాప 3:1-24 )
▫️పేతురు అలల చేత కొట్టబడ్డాడు. (లూకా 22:54-62)
▫️పౌలు తుఫానులనే ఎదుర్కొన్నాడు. ( 2కొరింథీ 6:4-10; 11:23-29)
అయితే, ఒక వ్యక్తి తన ఇల్లు, క్రీస్తుపై స్థిరంగా నిర్మించి యుంటే, అది ఎట్లాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిరముగా నిలబడగలుగుతుంది. గాలి, వాన, వరదలు ఆ ఇంటిని ఎంతమాత్రమూ భయపెట్టలేవు. అందుకే ప్రతీ పరిస్థితికి తట్టుకొని, కూలిపోకుండా ఆ ఇల్లు స్థిరంగా నిలబడగలిగింది.
♻️బుద్ధిలేనివాని ఇల్లు: ♻️
🟩🟪🟨🟦🟫🟧⬛⬜🟥
ఇది ఇసుకమీద కట్టబడింది. పునాది త్రవ్వడం కూడా చాలా సులభం. పైకి చాలా సుందరం గానే వుంది. అయితే, ఒకదినాన్న గాలి వీచింది, పైకప్పు లేచిపోయింది. వాన కురిసింది, గోడలు నేలకూలాయి. వరదలు వచ్చాయి, పునాదితో సహా కొట్టుకుపోయింది. కారణం? యేసు చేసిన ఉపదేశాలపై కాకుండా, వారి స్వంత ఆలోచనలతో కట్టబడిన ఇల్లు ఇది. వాక్యానుసారమైన జీవితంలేకుండా, ఆపద్దినాన్న తట్టుకోవడం సాధ్యం కానేకాదు. శోధన సమయంలో ఆదరించేవారుండరు. వేదనకాలంలో కన్నీరు తుడిచేవారుండరు. జీవితం అస్తవ్యస్తమవుతుంది. అగమ్యగోచరమవుతుంది. అర్ధంలేకుండా అర్ధాంతరంగా ముగిసిపోతుంది.
♻️ముగింపు ♻️
🟫🟦🟨🟪🟩🟧⬛⬜🟥
గాలి, వాన, వరదలు అంటే? రాబోయేకాలంలో ప్రతీ ఇంటిని పరీక్షించి ప్రతీ పునాదిని బయటపెట్టే తీర్పు దినాన్ని కూడా సూచించవచ్చు. అయితే, జీవితం అనే నీ ఇల్లు బండమీద కట్టబడిందా? ఇసుకమీద కట్టబడిందా? స్థిరంగా నిలబడగలుగుతుందా? కొట్టుకుపోతుందా? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలీయుల శారీరిక దాహాన్ని తీర్చిన ఆ బండే, కల్వరిలో తన రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది. ఆ బండ క్రీస్తే (1కొరింథీ 10:4) ఆబండపై నీ జీవితం కట్టబెడితే, నీ జీవితం ధన్యమైనదే. లేకుంటే అది అత్యంత భయంకరం. కనీసం నేడైనా మన ఇంటిని క్రీస్తు అనే బండపైన కట్టి, అనగా? ఆయనలో విశ్వాసముంచి, ఆయనను నిజముగా ప్రేమిస్తూ, హృదయపూర్వకంగా ఆయనకు విధేయత చూపగలిగితే, ఆ ధన్యతలోనికి మనమునూ ప్రవేశించగలము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
🟩🟧⬛⬜⬜🟫🟫🟦🟪🟪
బైబిల్ సమాచారం కొరకు ఈ క్రింద లింక్స్ ద్వారా
జాయిన్ కాగలరు.....
📖What's app group link
https://chat.whatsapp.com/Dg2EgGKC3pV6f8hax9hE49
📖 Telegram group link
https://t.me/pastorabhishek
📖page link
https://www.facebook.com/బైబిల్-సమాచారం-129354961128752/
👬మీ మిత్రులకు share చేసి మీ వంతుగా
దేవుని పని చేయగలరు.
మీ ప్రార్ధన అవసరతలు కొరకు
బైబిల్ సమాచారం అడ్మిన్
☎️9️⃣6️⃣0️⃣3️⃣2️⃣6️⃣6️⃣1️⃣4️⃣5️⃣