Guru Parihara Sthalam

Guru Parihara Sthalam Sri Guru Dhakshanamurthy Swamy Temple

*॥ శ్రీమేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*🦚🦢🌻🙏🌻🦢🦚॥ శ్రీ గురుభ్యో నమః ॥*కర్పూర దీపికాలోలః* *కర్పూర రసచర్చితః ।**అవ్యా...
03/09/2026

*॥ శ్రీమేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*
🦚🦢🌻🙏🌻🦢🦚
॥ శ్రీ గురుభ్యో నమః ॥
*కర్పూర దీపికాలోలః*
*కర్పూర రసచర్చితః ।*
*అవ్యాజ కరుణామూర్తి*
*స్త్యాగరాజః క్షపాకరః ॥*
🌹మిత్రులకు,బృహస్పతివాసర శుభోదయం.🌹
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఈ రోజు గురువారం.* ఇంకొక పేరు బృహస్పతి వారం. బ్రహస్పతి ఎవరో కాదు. దేవతలకు గురువు. నవ గ్రహాలలోను ఒక్కరి వున్నారు. ఈయన సప్త ఋషులలో ఒకరైన అంగీరసుని పుత్రుడు. ఈయన భార్య పేరు తార. ఈయన నాలుగు వేదాలను ఔపొసనచే నాలుగు కాలాలను ఎరిoగిన మహాకాలజ్ఞాని. అనేక క్రతువులు, యాగాలు చేసి దేవతలకే గురు స్థానాన్ని అలంకరించిన వారు. వశిష్టీశ్వరుని అనుగ్రహం పొంది, నవగ్రహాలలో ఒకరిగా అంతస్తును పొందిన వారు. అందువలననే నవగ్రహాల లొనే రాజ గ్రహంగా పేరెన్నిక కన్నారు. వీరికి 18 పేర్లు కలవు. వీరి స్వగృహం ధనస్సు మరియు మీనం. వీరి అనుగ్రహం వలన మేధావులు, జ్ఞాన పరులు కాగలరు.
జ్యోతిష్య శాస్త్రం అనుసారం వీరి దృష్టి 5, 7, 9 అయిన వాటి పై ఉండును.
గురు అనుగ్రహం పొందిన వారు జ్ఞానం, మేధా సంపత్తులతో తుల తూగ గలరు. అజ్ఞామనే చీకటిని పారద్రోల శక్తి సంపన్నులు గురువు.
ప్రతి శివాలయములో గురు భగవానుడు మనకు దర్శనము ఇవ్వగలడు.
ఒక మారు గురు భగవానుడు భూలోకము నకు విచ్చేసి, శ్రీ మహా విష్ణువును దర్శించి, తపమాచరించి ఆయన కరుణను సంపాదించు కున్న స్థలం "వైగై" నదీ తీరమునకల పుణ్య క్షేత్రం "గురు వీట్రిరుంధ గురై" అని పిలువబడి కాలక్రమములో అదే క్షేత్రం "గురువిత్తురై" గా మారి ఇప్పుడున్నది. ఇక్కడి ఆలయం, పాండ్య, పల్లవుల రాజులచే జీర్ణోద్ధరణ కావింపబడి ఈ నాడు శోభాయమానంగా వెలుగొందుచున్నది. గురు భగవానుని అనుగ్రహం కోరు వారు ఈ క్షేత్ర దర్శనం గావించు కొనుటచే అత్యుత్తమ ఫలితాలను పొందగలరని విశ్వాశం. గురువిరుందా గురై అనగా గురువు ఉండిన ప్రదేశముగా పురాణము లలో పిలువబడినది. ఇక్కడి మూల విరాట్టును "చిత్ర రథ వల్లభ పెరుమాన్" అని పిలుస్తారు. గురు భగవాన్ పుత్రుడు కచుడు ఒక మారు మృత సంజీవిని విద్య నభ్యసించుటకై, ఆసురలోకానికి పోయి చాలాకాలం తిరిగి రాలేక అవస్థలు పడ్డాడు. గురు భగవానుడు నారదునితో ఆలోచన సలుపగా, నారదుల వారు తమ జ్ఞాన దృష్టితో వీక్షించి, ఆసుర లోకంలో కచునికి జరిగిన ఆపదలు గురించి వివరించారు. అందులకు పరిహారం అడుగగా, నారదులు వారు గురువును భూలోకం వెళ్లి, వెదవతి నది( అనగా వైగై నది) తీరంలో వేంచేసి ఉన్న శ్రేమత్ నారాయణుని గురించి, తపము చేయండి, ఆయన మీ బాధలను తీర్చగలరు అని సలహా నిస్తారు. అదే విధముగా గురుభగవానుడు వైగై నదీ తీరంలో తపము ఆచరించారు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై కచుని కాపాడి, గురుభగవానుడి కోరిక తీరుస్తారు. *(ఈ కథ వేరుగా వివరిస్తాను)*
గురుభగవానుడికి దర్శనం ఇవ్వటానికై విష్ణు భగవానుడు ఎన్నో చిత్రాలు చిత్రించ బడిన రథంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనం ఇచ్చినందులకు గాను ఆయనకు *"చిత్ర రథ వల్లభ పెరుమాళ్"* అన్న నామo ఏర్పడినది. ఈ నామo తోనే గురు భాగవానుడు స్వామిని పిలిచినట్లు స్థల పురాణం చెబుతుంది. తనను కరుణించినట్లుగానే సకల భక్తులను కరుణించమని, ఇక్కడే వెలయుమని కోరగా విష్ణువు అక్కడే గుడిలో కొలువు అయినారు.
ఈ ఆలయము ముందు భాగమున గురుభగవాన్ వుంటారు. విష్ణువు తూర్పు వైపు చూడగా, ఆయన చూస్తూ పడమర వైపుకు తిరిగి వుంటారు గురు భగవానుడు. ప్రక్కనే చక్రత్తాళ్వార్ వుంటారు. ఇక్కడి గురుభగవానుడు యోగ గురువులా వుంటారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ శెన్బగవళ్లి. ఈ ఆలయం మధురై జిల్లాలో గురువిత్తురై గ్రామంలో కలదు.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఇది తమిళం పురాణ గ్రoధo లో నుండి సేకరణ*
****************************

గురువారం ప్రత్యేకత.గురువారం గురువులను స్మరించడం, గురు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడం, శ్రీ గురుదక్షిణామూర్తి స్తోత...
03/09/2026

గురువారం ప్రత్యేకత.

గురువారం గురువులను స్మరించడం, గురు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడం, శ్రీ గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం విశేషంగా భావించబడుతుంది.

చిత్తూరు గిరింపేటలో గురు పరిహార స్థలం శ్రీగురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష హోరాఅభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్మరించి, జ్ఞానం, వివేకం, సద్బుద్ధి, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించమని ప్రార్థిద్దాం.

శ్రీ గురుదక్షిణామూర్తి స్వామినే నమః।
ఓం నమః శివాయ।

#గురుస్థలం

*॥ శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*🦚🦢🌻🙏🌻🦢🦚*నాగహార ధరం**చారుకంకణైః కటిసూత్రకైః।**విరాజమాన వృషభం**వ్యాఘ్ర చర్మ...
03/09/2026

*॥ శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*
🦚🦢🌻🙏🌻🦢🦚
*నాగహార ధరం*
*చారుకంకణైః కటిసూత్రకైః।*
*విరాజమాన వృషభం*
*వ్యాఘ్ర చర్మాంబరా వృతమ్॥*

*శ్లోకార్థం:*

*నాగహార ధరం*
పాములను హారంగా ధరించినవాడు. నాగ కుండలినీ శక్తికి చిహ్నం.

*చారుకంకణైః కటిసూత్రకైః*
అందమైన కంకణాలు, మొలత్రాడుతో ప్రకాశించేవాడు.

*విరాజమాన వృషభం*
తన పక్కన ప్రకాశిస్తున్న నందిని (వృషభాన్ని) కలవాడు. వృషభం ధర్మానికి చిహ్నం.

*వ్యాఘ్ర చర్మాంబరా వృతమ్*
పులి చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు. కోరికలను జయించాడని అర్థం.

*ఈ రూపంలోని రహస్యం:*
*దక్షిణామూర్తి మౌనంగా కూర్చుని కేవలం చూపుతోనే శిష్యులకు జ్ఞానం ఇస్తాడు. ఆయన మెడలో పాము భయాన్ని జయించడాన్ని, పులిచర్మం అహంకారాన్ని జయించడాన్ని చెబుతుంది.*

*ఈరోజు పిల్లల చదువు కోసం, జ్ఞానం కోసం "ఓం మేధా దక్షిణామూర్తయే నమః" అని 11 సార్లు చెప్పి, దక్షిణం వైపు తిరిగి కూర్చున్న శివుడిని తలచుకోండి.*
🌺 గురు పరిహార స్థలం చెంగల్వరాయ కొండ కింద C B రోడ్ గిరిoపేట చిత్తూరు, గురు గణేష్
8985922444
9491290900.

🪷మిత్రులకు,బృహస్పతి వాసర శుభోదయం.🪷

గురుమధ్యేస్థితం విశ్వం | విశ్వమధ్యేస్థితో గురుః |     గురుర్విశ్వం నచార్న్యోతి | తస్మై శ్రీ గురవేనమః ||🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏Th...
01/09/2026

గురుమధ్యేస్థితం విశ్వం | విశ్వమధ్యేస్థితో గురుః |
గురుర్విశ్వం నచార్న్యోతి | తస్మై శ్రీ గురవేనమః ||
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
Thiruvannamalai.

అరుణాచల గిరి ప్రదక్షిణ విశేషము

తిరుఅణ్ణామలైలో సాక్షాత్తు ‘శ్రీ గురు దక్షిణామూర్తి’ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడంవలన కొండను చుట్టు ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమయినది. ఈ నాటికీ కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు ప్రతి రోజూ తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు.

ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్ననూ రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగ ప్రాముఖ్యం పొందెను.

ఒకటి హిమాలయాలయందు కైలాస గిరి ప్రదక్షిణము; మరొకటి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం. టిబెట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుచున్న ‘లామాలు’ (Lamas) అనబడు గొప్ప యోగులు నేటికీ భౌతిక శరీరముతో (physical body) శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్ననూ, ఆధ్యాత్మిక సూక్స్మ శరీరముతో (spiritual body) తిరుఅణ్ణామలై ప్రదక్షిణముకూడ చేస్తున్నారు.

ఇది మాత్రమేనా? ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులును, నక్షత్ర దేవతలును తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేయుచున్నారు. క్రిములు, జంతువులు, వృక్షములు, కీటకములు మొదలగు ప్రతియొక్క జీవరాసులకుగాను తత్సంబంధిత దేవతలు వారి జాతియొక్క బాగు కోరి తిరుఅణ్ణామలైని ప్రదక్షించుచున్నవి.

శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులుకూడ ఏదో ఒక రూపములో ప్రతిరోజు గిరి ప్రదిక్షిణము చేస్తున్నారు. శ్రీ అంగవ మహర్షి తన 10000 శిష్యగణముతో దట్టగాలీ ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగ గిరి ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు.

తిరుఅణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు ! గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు ‘మనము ఒంటరిగ వెళుచుంటిమే !’ యని చింతయో, భయమో పడునవసరం లేదు !
తా|| ఈ ప్రపంచమంతయు సద్గురువునందున్నది. సద్గురువు ప్రపంచమునందు అంతటానున్నాడు. కావున ప్రపంచమంతయు సద్గురువే. అన్యం లేనే లేదు. అట్టి ఈశ్వర స్వరూపుడైన సద్గురువునకు నమస్కారము.

శ్లో|| శ్రీమత్పరబ్రహ్మ గురూస్మరామి |
శ్రీమత్పరబ్రహ్మ గురూభజామి |
శ్రీమత్పరబ్రహ్మ గురూవదామి |
శ్రీమత్పరబ్రహ్మ గురూనమామి |

తా|| ప్రకాశము గల పరబ్రహ్మ స్వరూపమైన సద్గురువును స్మరించుచున్నాను, సేవించుచున్నాను. పలుకుచున్నాను. అట్టి గురువును గూర్చియే నమస్కరించు చున్నాను.

ధ్యానమూలం గురోర్మూర్తిం | పూజామూలంగురోఃపదం |
మంత్రమూలం గురోర్వాక్యం |
ముక్తిమూలం గురోఃకృపా ||

తా|| గురువు యొక్క దేహమే ధ్యానమునకు కారణము. గురువు యొక్క పాదమే పూజించుటకు కారణము. గురువాక్యమే మంత్రమునకు కారణము. గురుకృపయే మోక్షమునకు కారణము. లక్ష్యార్థమున శ్రీ గురుస్వరూపమేదో, ఆ పరబ్రహ్మ స్వరూపమే ధ్యానించదగినది. శ్రీ గురుస్థానమేదో ఆ లక్ష్యమగు పరబ్రహ్మమే పూజింపదగినది. శ్రీ గురుదేవుల తత్త్వోపదేశమే మహామంత్రము మరియు మననము చేయవలసినది. శ్రీ గురుదేవుని అనుగ్రహమే మోక్షం.

గురుమూర్తిం స్మరేన్నిత్యం |
గురోర్నామసదాజపేత్‌ |
గురోరాజ్ఞాం ప్రకుర్వీత |
గురోరన్యన్నభావయేత్‌ ||

తా|| ఎల్లప్పుడును సద్గురు స్వరూపమునే స్మరించవలయును. ఆ సద్గురు నామమునే జపించవలయును. సద్గురు ఆజ్ఞ ప్రకారమే చేయవలెను. ఇతరమగు దానిని తలంచనే కూడదు.
#సద్గురువులు

🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹

29/08/2026
శివుడు🔱దక్షిణామూర్తి అవతారం ఎత్తడానికి కారణం తెలుసా..?🌺                                 పరమశివుని దక్షిణామూర్తి అవతారం🔱ప...
29/08/2026

శివుడు🔱దక్షిణామూర్తి అవతారం ఎత్తడానికి కారణం తెలుసా..?🌺
పరమశివుని దక్షిణామూర్తి అవతారం
🔱పురాణాల ప్రకారం, ఒకప్పుడు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నలుగురు కుమారులు సృష్టి రహస్యం, ఆత్మజ్ఞానం, మోక్ష మార్గం గురించి తెలుసుకోవాలని సంకల్పించారు.
🔱దేవతలు, మహర్షులను కలిసినా వారి సందేహాలకు సంపూర్ణ సమాధానం లభించలేదు. చివరికి పరమేశ్వరుడే నిజమైన గురువని భావించి కైలాసానికి చేరుకున్నారు.
🔱వారి భక్తిని చూసిన పరమశివుడు దక్షిణామూర్తి అవతారాన్ని ధరించాడు. దక్షిణ దిశను ముఖంగా చేసుకుని ఒక మహా వటవృక్షం (మర్రిచెట్టు) క్రింద ఆసీనుడై, తన కుడి చేతిలో జ్ఞాన ముద్ర చూపిస్తూ ఎలాంటి మాటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉపదేశం చేశాడు.
🔱ఆశ్చర్యకరంగా, ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆ నలుగురు ఋషుల సందేహాలన్నీ తొలగిపోయాయి. వారు ఆత్మజ్ఞానాన్ని పొందారు.
🔱అందుకే "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం" అని దక్షిణామూర్తి మహిమను వేదాలు, ఆగమాలు కీర్తిస్తాయి. అంటే, మౌనంతోనే పరబ్రహ్మ తత్వాన్ని బోధించిన జగద్గురువు అనే అర్థం.
🔱అప్పటి నుంచి జ్ఞానానికి, విద్యకు, గురుత్వానికి ఆదిదేవుడిగా దక్షిణామూర్తిని ఆరాధిస్తున్నారు. విద్యార్థులు, గురువులు, వేద పండితులు, ఆధ్యాత్మిక సాధకులు దక్షిణామూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జ్ఞానం, వివేకం, ఏకాగ్రత, గురుకృప లభిస్తాయని విశ్వసిస్తారు.

*॥ శ్రీమేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*🦚🦢🌻🙏🌻🦢🦚॥ శ్రీ గురుభ్యో నమః ॥*కర్పూర దీపికాలోలః* *కర్పూర రసచర్చితః ।**అవ్యా...
29/08/2026

*॥ శ్రీమేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*
🦚🦢🌻🙏🌻🦢🦚
॥ శ్రీ గురుభ్యో నమః ॥
*కర్పూర దీపికాలోలః*
*కర్పూర రసచర్చితః ।*
*అవ్యాజ కరుణామూర్తి*
*స్త్యాగరాజః క్షపాకరః ॥*
🌹మిత్రులకు,బృహస్పతివాసర శుభోదయం.🌹
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఈ రోజు గురువారం.* ఇంకొక పేరు బృహస్పతి వారం. బ్రహస్పతి ఎవరో కాదు. దేవతలకు గురువు. నవ గ్రహాలలోను ఒక్కరి వున్నారు. ఈయన సప్త ఋషులలో ఒకరైన అంగీరసుని పుత్రుడు. ఈయన భార్య పేరు తార. ఈయన నాలుగు వేదాలను ఔపొసనచే నాలుగు కాలాలను ఎరిoగిన మహాకాలజ్ఞాని. అనేక క్రతువులు, యాగాలు చేసి దేవతలకే గురు స్థానాన్ని అలంకరించిన వారు. వశిష్టీశ్వరుని అనుగ్రహం పొంది, నవగ్రహాలలో ఒకరిగా అంతస్తును పొందిన వారు. అందువలననే నవగ్రహాల లొనే రాజ గ్రహంగా పేరెన్నిక కన్నారు. వీరికి 18 పేర్లు కలవు. వీరి స్వగృహం ధనస్సు మరియు మీనం. వీరి అనుగ్రహం వలన మేధావులు, జ్ఞాన పరులు కాగలరు.
జ్యోతిష్య శాస్త్రం అనుసారం వీరి దృష్టి 5, 7, 9 అయిన వాటి పై ఉండును.
గురు అనుగ్రహం పొందిన వారు జ్ఞానం, మేధా సంపత్తులతో తుల తూగ గలరు. అజ్ఞామనే చీకటిని పారద్రోల శక్తి సంపన్నులు గురువు.
ప్రతి శివాలయములో గురు భగవానుడు మనకు దర్శనము ఇవ్వగలడు.
ఒక మారు గురు భగవానుడు భూలోకము నకు విచ్చేసి, శ్రీ మహా విష్ణువును దర్శించి, తపమాచరించి ఆయన కరుణను సంపాదించు కున్న స్థలం "వైగై" నదీ తీరమునకల పుణ్య క్షేత్రం "గురు వీట్రిరుంధ గురై" అని పిలువబడి కాలక్రమములో అదే క్షేత్రం "గురువిత్తురై" గా మారి ఇప్పుడున్నది. ఇక్కడి ఆలయం, పాండ్య, పల్లవుల రాజులచే జీర్ణోద్ధరణ కావింపబడి ఈ నాడు శోభాయమానంగా వెలుగొందుచున్నది. గురు భగవానుని అనుగ్రహం కోరు వారు ఈ క్షేత్ర దర్శనం గావించు కొనుటచే అత్యుత్తమ ఫలితాలను పొందగలరని విశ్వాశం. గురువిరుందా గురై అనగా గురువు ఉండిన ప్రదేశముగా పురాణము లలో పిలువబడినది. ఇక్కడి మూల విరాట్టును "చిత్ర రథ వల్లభ పెరుమాన్" అని పిలుస్తారు. గురు భగవాన్ పుత్రుడు కచుడు ఒక మారు మృత సంజీవిని విద్య నభ్యసించుటకై, ఆసురలోకానికి పోయి చాలాకాలం తిరిగి రాలేక అవస్థలు పడ్డాడు. గురు భగవానుడు నారదునితో ఆలోచన సలుపగా, నారదుల వారు తమ జ్ఞాన దృష్టితో వీక్షించి, ఆసుర లోకంలో కచునికి జరిగిన ఆపదలు గురించి వివరించారు. అందులకు పరిహారం అడుగగా, నారదులు వారు గురువును భూలోకం వెళ్లి, వెదవతి నది( అనగా వైగై నది) తీరంలో వేంచేసి ఉన్న శ్రేమత్ నారాయణుని గురించి, తపము చేయండి, ఆయన మీ బాధలను తీర్చగలరు అని సలహా నిస్తారు. అదే విధముగా గురుభగవానుడు వైగై నదీ తీరంలో తపము ఆచరించారు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై కచుని కాపాడి, గురుభగవానుడి కోరిక తీరుస్తారు. *(ఈ కథ వేరుగా వివరిస్తాను)*
గురుభగవానుడికి దర్శనం ఇవ్వటానికై విష్ణు భగవానుడు ఎన్నో చిత్రాలు చిత్రించ బడిన రథంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనం ఇచ్చినందులకు గాను ఆయనకు *"చిత్ర రథ వల్లభ పెరుమాళ్"* అన్న నామo ఏర్పడినది. ఈ నామo తోనే గురు భాగవానుడు స్వామిని పిలిచినట్లు స్థల పురాణం చెబుతుంది. తనను కరుణించినట్లుగానే సకల భక్తులను కరుణించమని, ఇక్కడే వెలయుమని కోరగా విష్ణువు అక్కడే గుడిలో కొలువు అయినారు.
ఈ ఆలయము ముందు భాగమున గురుభగవాన్ వుంటారు. విష్ణువు తూర్పు వైపు చూడగా, ఆయన చూస్తూ పడమర వైపుకు తిరిగి వుంటారు గురు భగవానుడు. ప్రక్కనే చక్రత్తాళ్వార్ వుంటారు. ఇక్కడి గురుభగవానుడు యోగ గురువులా వుంటారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ శెన్బగవళ్లి. ఈ ఆలయం మధురై జిల్లాలో గురువిత్తురై గ్రామంలో కలదు.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఇది తమిళం పురాణ గ్రoధo లో నుండి సేకరణ*
****************************

గురువారం ప్రత్యేకత.గురువారం గురువులను స్మరించడం, గురు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడం, శ్రీ గురుదక్షిణామూర్తి స్తోత...
28/08/2026

గురువారం ప్రత్యేకత.

గురువారం గురువులను స్మరించడం, గురు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడం, శ్రీ గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం విశేషంగా భావించబడుతుంది.

చిత్తూరు గిరింపేటలో గురు పరిహార స్థలం శ్రీగురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష హోరాఅభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్మరించి, జ్ఞానం, వివేకం, సద్బుద్ధి, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించమని ప్రార్థిద్దాం.

శ్రీ గురుదక్షిణామూర్తి స్వామినే నమః।
ఓం నమః శివాయ।

#గురుస్థలం

Address

Beside Dmart, CB Road
Chittoor
517001

Website

Alerts

Be the first to know and let us send you an email when Guru Parihara Sthalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category