Manadevullu

Manadevullu This page created for devotional purpose about indian temples and gods

21/12/2023
రేపటిరోజునా చాలా ప్రముఖమైన రోజు మన శ్రీరాములవారి కళ్యణమహోత్సవము చూచుటకు రెండుకళ్ళుచాలవు ,మన భద్రాదిలో శ్రీరాములవారి కళ్య...
09/04/2022

రేపటిరోజునా చాలా ప్రముఖమైన రోజు మన శ్రీరాములవారి కళ్యణమహోత్సవము చూచుటకు రెండుకళ్ళుచాలవు ,మన భద్రాదిలో శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవమునకు విచ్చేస్తున్నా భక్కజనకోటికి స్వాగతం సుస్వాగతం
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు .
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి ……ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవ...
01/04/2022

ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి ……
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం.
అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు.ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది.
ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం.

ఉగాది పంచాంగ శ్రవణంరోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది.
పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు.
ఎలా జరుపుకోవాలి?తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి.
నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి.అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టిశతాయుర్‌ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చసర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి.
కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.
దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసిఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది.
ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి.
బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే

పండగ వేళ...తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం..ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు..ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది...ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే..ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి..గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్‌ఈడి బల్బులతో అలంకరిస్తే సరి.

సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది.
ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్‌ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు.
ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు.
పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది.

🌹 రేపు  లక్ష్మీదేవి జయంతి🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించే...
17/03/2022

🌹 రేపు లక్ష్మీదేవి జయంతి🌹

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి , స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని , ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని , ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని , సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.

క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.

విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ *ఖ్యాతి చేసిన తఫః ఫలమే* లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.

లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు , చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు *కనకధారాస్తవం* పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.
అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.

లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు , ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు.

జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి , తామస మన్వంతరంలో భూమినుండి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి , చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.

పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై *”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక”* అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.

దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి , ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.

క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా , తరువాత సురభి అనే కామధేనువు , ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , పిమ్మట ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.

భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము , మేధస్సు , ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.

హోళి పండుగ శుభాకాంక్షలు  #వసంతోత్సవం,  #డోలికోత్సవం,భారతీయులు జరుపుకునే ఒక్కొక్క పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ...
17/03/2022

హోళి పండుగ శుభాకాంక్షలు

#వసంతోత్సవం, #డోలికోత్సవం,

భారతీయులు జరుపుకునే ఒక్కొక్క పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే హోళీ పండుగ కూడా విశిష్టమైనదే. ఇది సామాజికమైన పండుగ. గుండె నిండా సంతోషం నింపుకొని, గుప్పెడు రంగులు ఒంటి నిండా చల్లుకునే పండుగ. ఇరుగు పొరుగుతో ఆనందాలు పంచుకునే పండుగ. ఏలాంటి వర్గ బేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ స్నేహభావాన్ని పెంపొందిస్తుంది.

హోళి పండగను వసంతోత్సవం, డోలికోత్సవం, ఫాల్గుణోత్సవం అని కూడా పిలుస్తారు. శీతకాలపు చలి తగ్గిపోయి దాదాపు వేసవి కాలపు ఎండవేడి ప్రారంభం అయ్యే కాలంలో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ వసంతఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తుంది.

హోళీకి సంబంధించి పురాణాల్లో ఓ కథను చెప్పుకుంటారు. కృష్ణుడు నల్లనివాడంటారు. రాధేమో కృష్ణునికంటే కాస్త రంగుగా ఉండేది. ఈ విషయమై కృష్ణుడు తన తల్లి యశోద దగ్గరకు వెళ్లి సలహా అడిగాడట. యశోద 'మీకు ఈ గొడవెందుకు, ఏ రంగు కావాలంటే ఆ రంగును పులుముకోండి' అని సలహా ఇచ్చిందట. యశోద అలా చెప్పగానే కృష్ణుడు గోపికలదంరినీ రంగు నీళ్లతో ముంచెత్తాడు. కృష్ణుడి మహిమలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో ఇప్పటికీ హోళీని ఘనంగా జరుపుకుంటారు. హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో ఆచరంగా ఉంది. హోళీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు జరుగుతాయి. మధుర బృందావన్ లలో ఈ పండుగ 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. పదహారు రోజులపాటు ఈ ప్రదేశాలు పర్యటకులతో కళ కళలాడుతాయి. ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం రంగ పంచమి రోజున కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడుతారు. కృష్ణుడు గోపికలతో తన చిలిపి చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని విశ్వసిస్తారు. జయపూరు మున్నగు ప్రాంతాలలో "దోళో పూర్ణిమ" అని రాధాకృష్ణుల 'కల్యాణం' చేస్తారు. కొత్త మామిడి పిందెలు తింటారు. రాత్రి హోళికని దహనం చేస్తారు. మరుసటి రోజన హోళిరంగులు ఆడతారు.

ప్రతీ ఏడాది మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. అరమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం, ఏ ఆధునిక ఉత్సవానికీ తీసిపోని పర్వం హోళీ. అందుకే హోళీని ఇష్టపడని వారు ఉండరు. ప్రకృతితో మమేకమై జరుపుకునే ఈ పండుగ ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, వివిధ సంప్రదాయాలకు అనుగుణంగా పండుగ సంబరంగా జరుపుకుంటారు. మొఘల్ కాలంలో హిందూ, ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా హోలీని జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ పండుగను మత సామరస్యం చాటే ప్రకృతి పండుగగా చెబుతారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో కృష్ణుడిని ఆరాధిస్తూ భక్తి గీతాలు పాడుతూ హోళీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి ఉట్టి కొట్టడం అక్కడ సంప్రాదాయంగా వస్తోంది. అంతేకాకుండా హోళీ రోజున కృష్ణుడిని ఊయల్లో వేసి బెంగాల్ లో డోలికోత్సవం జరుపుకుంటారు. ఒక్కొక్క వ్యక్తి తత్వం ఒక్కో విధంగా ఉన్నట్టుగానే హోళీలో ఉపయోగించే పలు రంగులు ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తాయని పెద్దలు చెబుతారు. హోళీ పండుగ భారత దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా జరుపుకోవడం విశేషం. నేపాల్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు. కారణాలు వేరైనా, పేర్లు వేరైనా, ప్రాంతాలు వేరైనా రంగుల పండుగ అంటే అందరికి ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది.

హోళీ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోళీ పండుగ జరపుకోవడంలో శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వసంత కాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. వాటి బారినుండి కాపాడుకోవడానికి ఆ కాలంలో కొన్ని ఔషధ మొక్కల నుండి తయారు చేసిన సహజమైన రంగులు వాడుకునే వారు. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించేవారు. మోదుగ పువ్వుల్ని మరిగించిన నీటిని రంగులుగా చల్లుకునేవారు. ఈ కారణంగా ఆ కాలంలో సంభవించే అనారోగ్యాలనుండి బయటపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో రసాయనాలు కలిపిన రంగులను వాడుతున్నారు. ఇవి వాడడం వలన చర్మ సమస్యలు, కంటి సమస్యలు, శిరోజాల సమస్యలే కాకుండా వాటి వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా సంభవిస్తున్నాయని వైద్యులు తేల్చి చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సమాజంలో భాగమై ఉన్నందున రసాయనాలతో తయారయిన రంగులను వాడకుండా మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం, సరైన పద్ధతులు పాటించడం వలన అందరికీ మేలు జరుగుతుంది. ఈ పండుగ జరుపుకోవడం అందరికి ఆనందమే. కానీ ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో అపశృతులు దొర్లకుండా జాగ్రత్త పడడం ప్రస్తుత తరుణంలో అవసరం. మనం ఆరోగ్యంగా ఉంటే రోజు పండుగే అని భావించాలి.

Address

Chennai

Website

Alerts

Be the first to know and let us send you an email when Manadevullu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Manadevullu:

Share

Category