03/04/2022
Sri Srungara Vallabha Swami temple TIRUPATHI....
తూర్పు గోదావరి జిల్లా అనగానే పవిత్ర గోదావరినది, అన్నవరం, సామర్లకోట, దాక్సారామం, కోటిపల్లి, రాజమండ్రి, కోనసీమలలోఅడుగడుగునా వెలసియున్న ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రములు మన కళ్ల ఎదుట కదలాడుతాయి. అటువంటి పుణ్యక్షేత్రములలో పెద్దాపురం మండలంలో తిరుపతి గ్రామం ఒకటి. ఈ తిరుపతి క్షేత్రము సామర్లకోట నుండి 12km. దివిలి మార్గములో ఉన్నది.
ఇక్కడ 9వేల సంవత్సరముల చరిత్ర కలిగిన
శ్రీ శృంగార వల్లభస్వామి వారి ఆలయము ఉన్నది.
ఆలయంలోని స్దంభములపై చెక్కబడ్డ
శిలాశాసనములను బట్టి ఇన్నివేల సంవత్సరము లు చరిత్ర కలిగియున్నదని తెలియచున్నది.
ఈ ఆలయము నిండా శిలాశాసనములు ఉన్నట్లుగా పురావస్తుశాఖవారు చెప్పియున్నారు.
TEMPLE HISTORY :
పూర్వకాలములో ఈ పాంతమంతా
కీకారణ్యము. ధృవుని తల్లి సునీత.
ధృవుని సవతి తల్లి, ధృవుడు సింహాసనమును ఎక్కకుండా తంత్రములు నడుపుతుంది.
సునీత ధృవుని పిలిచి
"నాయనా! నీవు సింహాసనమును అధిష్టించి , రాజ్యపాలన చెయ్యాలి . అందుకు
శ్రీ మహావిష్ణువు దర్శనభాగ్యం కలగాలి .
ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి , విష్ణుదర్శనం పొంది, రాజ్యాధికారము సంపాదించమని" చెప్పి అడవులకు పంపింది.
అలా బయలుదేరిన ధృవుడు కీకారణ్యము ప్రదేశమునకు చేరుకున్నాడు.
ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి , అతని మనసులోని కోరిక తెలిసినవాడై , ముని అతనిని పిలిచి
"నాయనా! విష్ణుమూర్తి దివ్య మంగళ రూపమును తలచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి నీ కోరిక తీరుస్తాడు" అని చెప్పియున్నారు.
మునీశ్వరులు చెప్పినట్లుగా ధృవుడు తపమాచరించుట మొదలు పెట్టినాడు. అలా కొంతకాలము గడిచిన తరువాత , ధృవుని తపస్సునకు మెచ్చినవాడై,
విష్ణుమూర్తి దర్శనమిచ్చినాడు.
దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు.
అంతట విష్ణువు
"బాలకా! భయమెందుకు ? తత్తరపాటు చెందకు,
నేను నీ అంతే కదా ఉన్నాను " అని నవ్వుతూ పలుకుటయే కాకుండా , చెక్కిళ్లు ఒత్తి భయము లేకుండా చేసి , స్వామి అక్కడ శిలారూపములో వెలసినాడు.
ఇది స్థల పురాణము.
ఈ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార
వల్లభస్వామిగా పేరు గాంచినాడు.
" నీ అంతే ఉన్నాను కదా" అని చెప్పియున్నందున , "చూచే వాళ్లు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా స్వామి దర్శనమిస్తాడు".
చెక్కిళ్లు ఒత్తిన కారణంగా కుడి , ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ , కుడిలకు ఉంటాయి.
స్వామివారు వెలసిన తరువాత కొంతకాలం ఎండకు ఎండి , వానకు తడిసి ఉన్నారు. అందరు దేవతలు ముందుకు వచ్చి
స్వామివారికి ఆలయ నిర్మాణము గావించారు.
తరువాత లక్ష్మి దేవిని నారద మునీశ్వరులు , ఈ యుగంలో శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనాలు చెప్పుచున్నాయి.
విష్ణుమూర్తి శిలారూపములో ఇక్కడే మొదటిసారిగా వెలసినందున ఈ తిరుపతి ని
"తొలి తిరుపతి " అని పిలుస్తారు...
ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణము శోభాయమానముగా ,
దివ్యంగా జరుగుతుంది.
చుట్టుప్రక్కల చాలా గ్రామముల నుండి భక్తులు ఈ కళ్యాణమునకు తరలివచ్చి , స్వామివారి కళ్యాణము చూచి స్వామివారి, అమ్మవార్ల ఆశీస్సులు పొందుతారు.
ధనుర్మాసం నెల్లాళ్లు కూడా ధనసు పూజా
కార్యక్రమం జరుపబడి , పులిహోర, దద్దోజనం,
చక్రపొంగలి, మొదలగు ప్రసాదములు వితరణ కూడా జరుగుతుంది.
ఈ ధనుర్మాస పూజలు
చాలమంది భక్తులు తమ గోత్రనామములతో జరిపించుకుంటారు.
DAILY VISITING HOURS :
Morning 5.00 A.M. to 12.00 A.M.
Evening 5.00 P.M. to 08.00 P.M.
Distances From near places :
Rajahmundry (Air Port) - 55 km
Rajahmundry - 61 km
Kakinada - 25 km
Pitapuram - 15km
Samlkot - 12 km
Amalapuram - 79 km
Ravulapalem - 68 km
Tuni - 58 km
PhoneNumbers:08852247483,
9989078026