08/11/2023
సాయి మహరాజ్ సన్నిధి పంచుతున్న బాబా ప్రేమ
🌺సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం🌺
నా పేరు సుశాంత్. నేను పూణేలో నివాసముంటున్న సాయిబాబా భక్తుడిని. 2017వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వలన నేను తీవ్రమైన మనస్తాపానికి గురై చాలా వేదనను అనుభవిస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో ఒక అర్థరాత్రివేళ హఠాత్తుగా నా కాళ్లు వణికిపోవడం మొదలయ్యాయి. అప్పటికప్పుడే నేను చనిపోబోతున్నాననిపించింది. భయంతో ఆత్రంగా మా సిస్టర్ తో, "నాకెందుకో చాలా ఆందోళనగా ఉంద"ని చెప్పాను. ఆ మాటలు వింటూనే తను కూడా చాలా భయపడిపోయింది. కానీ వెంటనే, "సాయిరామ్, సాయిరామ్" అని స్మరించుకోమని చెప్పింది. నేను తను చెప్పినట్లే చేసాను. అంతే! మరుక్షణంలో నాకు ఉపశమనంగా అనిపించి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మరుసటిరోజు నేను, మా సిస్టర్ కలిసి హాస్పిటల్ కి వెళ్లి, రాత్రి జరిగిన విషయం గురించి డాక్టరుతో చెప్పాము. ఆయన, మానసిక ఒత్తిడి వలన అలా జరిగిందని చెప్పి, కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ ఆ మందుల వలన నాకు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కనిపిస్తూ ఉండేది. దాంతో, ఏం జరుగుతుందో ఏమోనన్న భయంతో, "బాబా! నేను ఈ స్థితిలో బ్రతకలేను. దయచేసి నాకు నయం చేయండి" అని రోజూ ప్రార్థిస్తూ ఉండేవాడిని. క్రమంగా నా పరిస్థితిలో మార్పు వచ్చింది. బాబా కృపవలన కొద్దిరోజుల్లో నేను ఆ స్థితి నుండి పూర్తిగా బయటపడ్డాను. ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారో వాళ్లు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మధనపడకుండా సదా సాయిస్మరణ చేస్తూ ఉంటే బాబా తప్పక అండగా నిలుస్తారు. మీ మానసిక పరిస్థితిలో మార్పు తీసుకువస్తారు.
సోర్స్: https://saimaharajsannidhi.blogspot.com/2019/04/26.html
# బాబా ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకోవడానికి మీ అనుభవాలను పంపవలసిన మెయిల్ఐడి:
[email protected]
# సాయి మహరాజ్ సన్నిధి టెలిగ్రామ్ ఛానెల్ లింక్: https://t.me/sai_bhaktula_anubhavalu
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
Shiridi Sai Devotees Experiences in Telugu - తెలుగులో శిరిడీ సాయి భక్తుల అనుభవాలు...